సెమీస్‌లో సిరిల్ వర్మ | Asian youth badminton championship siril varma reached in semi finals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సిరిల్ వర్మ

Published Sat, Oct 12 2013 12:25 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Asian youth badminton championship siril varma reached in semi finals

సాక్షి, హైదరాబాద్: ఆసియా యూత్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. అండర్-15 బాలుర సింగిల్స్ విభాగంలో సిరిల్ వర్మ సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... అండర్-17 బాలికల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ రుత్విక శివాని క్వార్టర్ ఫైనల్లో  పరాజయం పాలైంది.
 
 ఇండోనేసియాలో జరుగుతున్న ఈ పోటీల్లో శుక్రవారం జరిగిన అండర్-15 సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సిరిల్ వర్మ 21-13, 21-15తో ఎంగర్ పక్సీ (ఇండోనేసియా)పై గెలుపొందాడు. మరోవైపు రుత్విక శివాని 17-21, 17-21తో ఐదో సీడ్ కటెతోంగ్ సుపనిద (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి చవిచూసింది.
 
 అండర్-15 మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో కృష్ణ ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)-శ్రేయా బోస్ (కేరళ) ద్వయం సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో భారత జంట 23-25, 23-21, 21-17తో టాప్ సీడ్ కితా చికుగో-నగీసా యురా (జపాన్) జోడిని బోల్తా కొట్టించింది. అయితే మరో క్వార్టర్ ఫైనల్లో సాయిరాజ్ సాత్విక్ (ఆంధ్రప్రదేశ్)-కల్పితా సావంత్ (మహారాష్ట్ర) జోడి 15-21, 14-21తో కస్తూరో పుత్రా-మెంతారి ఫితా (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement