హౌసింగ్‌డాట్‌కామ్ కొత్త సీఈఓగా రిషభ్ గుప్తా | Real estate portal Housing.com names COO Rishabh Gupta as interim CEO | Sakshi
Sakshi News home page

హౌసింగ్‌డాట్‌కామ్ కొత్త సీఈఓగా రిషభ్ గుప్తా

Published Sat, Jul 11 2015 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM

హౌసింగ్‌డాట్‌కామ్ కొత్త సీఈఓగా రిషభ్ గుప్తా

హౌసింగ్‌డాట్‌కామ్ కొత్త సీఈఓగా రిషభ్ గుప్తా

రాహుల్ యాదవ్ స్థానంలో
న్యూఢిల్లీ:
హౌసింగ్‌డాట్‌కామ్ తాత్కాలిక సీఈఓగా రిషభ్ గుప్తా నియమితులయ్యారు. రాహుల్ యాదవ్ స్థానంలో గుప్తాను నియమిస్తున్నామని, ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని హౌసింగ్‌డాట్‌కామ్ తెలిపింది. సాఫ్ట్‌బ్యాంక్ తోడ్పాటుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హౌసింగ్‌డాట్‌కామ్‌కు రిషభ్ గుప్తా ప్రస్తుతం చీఫ్ అపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ)గా పనిచేస్తున్నారు. రిషభ్ గుప్తా, హరీశ్ చావ్లా, అభిషేక్ ఆనంద్‌లు కంపెనీ నిర్వహణ బోర్డ్‌లో సభ్యులుగా ఉంటారని తెలిపింది. రాహుల్ యాదవ్ ప్రవర్తన ఒక సీఈఓకు తగ్గట్లుగా లేదని, అందుకే ఆయనకు ఉద్వాసన పలికామని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement