మళ్లీ రియల్టీలోకి హౌసింగ్‌డాట్‌కామ్‌ | Housing Co- Founder Rahul Yadav Joins Real Estate Firm ANAROCK | Sakshi
Sakshi News home page

మళ్లీ రియల్టీలోకి హౌసింగ్‌డాట్‌కామ్‌

Published Tue, Jul 4 2017 1:03 AM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM

మళ్లీ రియల్టీలోకి హౌసింగ్‌డాట్‌కామ్‌

మళ్లీ రియల్టీలోకి హౌసింగ్‌డాట్‌కామ్‌

రాహుల్‌ యాదవ్‌
అనారాక్‌ సీటీవోగా బాధ్యతలు

న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లతో విభేదాల కారణంగా హౌసింగ్‌డాట్‌కామ్‌ నుంచి తప్పుకున్న సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ యాదవ్‌ మళ్లీ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రాపర్టీ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ మాజీ హెడ్‌ అనుజ్‌ పురికి చెందిన అనారాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ సంస్థలో చీఫ్‌ ప్రోడక్ట్‌ అండ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఆయన నియమితులయ్యారు.

ఆన్‌లైన్‌ రెసిడెన్షియల్‌ బ్రోకరేజీ, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫాం, ఫండ్‌ కార్యకలాపాలున్న ఈ సంస్థను జేఎల్‌ఎల్‌ నుంచి పురి ఇటీవలే కొనుగోలు చేశారు. జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ వంటి భారీ సంస్థలు ఇన్వెస్ట్‌ చేసిన ఆన్‌లైన్‌ రియల్టీ సేవల సంస్థ హౌసింగ్‌డాట్‌కామ్‌ నుంచి యాదవ్‌ 2015 జులైలో తప్పుకున్నారు.  ఇన్వెస్టర్లతో విభేదాలు తలెత్తడమే ఇందుకు కారణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement