జింఖానా, న్యూస్‌లైన్: ఏపీ స్టేట్ జూనియర్ అండర్-17 బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ కుర్రాడు రాహుల్ యాదవ్ సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. చీరాలలో బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో రాహుల్ 21-17, 21-11తో కృష్ణప్రసాద్ (తూర్పుగోదావరి)పై విజయం సాధించాడు. రంగారెడ్డికి చెందిన అనీత్ కుమార్, జీకే రెడ్డి కూడా సెమీస్‌కు అర్హత సాధించారు.
అనీత్ కుమార్ 15-21, 21-17, 21-14తో సాగర్ (మెదక్)పై, జీకే రెడ్డి 21-18, 21-13తో ఆదిత్య బాపినీడు (ఖమ్మం)పై గెలుపొందారు. కినష్క్ (గుంటూరు) 21-16, 21-17తో చంద్రకుమార్ (తూర్పుగోదావరి)పై గెలిచాడు. బాలికల క్వార్టర్‌ఫైనల్స్‌లో హైదరాబాద్ క్రీడాకారిణి టాప్‌సీడ్ శ్రీకృష్ణప్రియ సెమీస్‌కు చేరుకుంది. శ్రీకృష్ణ ప్రియ 21-16, 21-15తో ప్రణవిపై నెగ్గింది. ఉత్తేజా రావు (విశాఖపట్నం) 21-16, 21-10తో వైష్ణవి (రంగారెడ్డి)పై, వృషాలిని (రంగారెడ్డి) 21-18, 21-19తో తనిష్క్ (గుంటూరు)పై, హాసిని (విశాఖపట్నం) 21-11, 21-18తో సిరి చందన (మెదక్)పై గెలుపొందారు.
బాలుర డబుల్స్ క్వార్టర్‌ఫైనల్స్
రఘునాథ్ సాయి (గుంటూరు)-అనిత్‌కుమార్ (రంగారెడ్డి) జోడి 21-13, 21-14తో ఆదిత్య (ఖమ్మం)-జగదీశ్ (విశాఖపట్నం) జోడిపై, కృష్ణప్రసాద్-సాత్విక్ (తూర్పుగోదావరి)జోడి 21-13, 16-21, 21-18తో అఖిల్-నితిన్ (తూర్పుగోదావరి) జోడిపై, దత్తాత్రేయ-మనోహర్ రెడ్డి (కర్నూల్) జోడి 21-17, 18-21, 21-10తో ముత్తు-సాయి కుమార్ (నెల్లూరు) జోడిపై గెలుపొందాయి.
సెమీస్‌కు చేరిన రాహుల్
Published Thu, Nov 7 2013 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM
Advertisement
Advertisement