మళ్లీ ప్రేమకథలో.. | Hero Sumanth New Movie Opening | Sakshi
Sakshi News home page

మళ్లీ ప్రేమకథలో..

Published Thu, Mar 16 2017 1:01 AM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM

మళ్లీ ప్రేమకథలో..

మళ్లీ ప్రేమకథలో..

‘ఐయామ్‌ ఇన్‌ లవ్‌.. ఐయామ్‌ ఇన్‌ లవ్‌’ అంటున్నారు సుమంత్‌. రియల్‌ లైఫ్‌లో కాదులెండి.. రీల్‌ లైఫ్‌లో. హీరోగా సుమంత్‌ డిఫరెంట్‌ సినిమాల్లో నటించినా... ఆయనకు ప్రేమకథలు ఎక్కువ పేరు తీసుకొచ్చాయి. లేటెస్ట్‌గా మరో ప్రేమకథా చిత్రంలో నటించడానికి అంగీకరించారు సుమంత్‌. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రాహుల్‌యాదవ్‌ నక్కా నిర్మించనున్న ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేఎల్‌ దామోదరప్రసాద్‌ క్లాప్‌ ఇవ్వగా, చిత్రనిర్మాత రాహుల్‌ తల్లి సావిత్రి కెమేరా స్విచ్చాన్‌ చేశారు. ఈ నెలాఖరున చిత్రీకరణ ప్రారంభించను న్నారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీశైలం యాదవ్, కాదంబరి కిరణ్, ప్రవీణ్‌ (వెంకట్‌) యాదవ్, బందరు బాబీ పాల్గొన్నారు. సుమంత్‌కు జోడీగా ఆకాంక్ష సింగ్‌ నటించనున్న ఈ సినిమాలో అన్నపూర్ణ, కాదంబరి కిరణ్, ‘మిర్చి’ కిరణ్, అభినవ్, అప్పాజీ అంబరీష తదితరులు ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి పాటలు: కృష్ణకాంత్, సంగీతం: శ్రవణ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement