Gautam tinnanuri
-
అల్లు అర్జున్ బాటలో విజయ్.. ట్యూషన్‌కు సిద్దమైన ‘రౌడీ’ హీరో!
విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'వీడీ12' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోయే ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేసింది చిత్ర బృందం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుకుంటున్న ఈ మూవీ త్వరోలోనే సెట్స్‌పై రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే లైగర్‌తో ఫ్యాన్స్‌ను నిరాశ పరిచిన విజయ్ ఈసారి గట్టి హిట్ కొట్టాలని ఆశగా ఎదురు చూస్తున్నాడు. చదవండి: చిరంజీవి మెసేజ్‌ను అవాయిడ్ చేసిన స్టార్ యాంకర్! అసలేం జరిగిందంటే.. ఈ నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి మూవీ కోసం విజయ్ స్పెషల్‌గా ట్యూషన్‌కు వెళ్లనున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం జానపద గాయకుడు, రచయిత పెంచల్ దాస్‌ను విజయ్ సంప్రదించబోతున్నట్లు ఫిలిం దూనియాలో వినికిడి. వీడీ12 మూవీ కథ చిత్తూరు ప్రాంతం చూట్టు తిరుగుతుందట. ఇందులో విజయ చిత్తూరు యువకుడిగా బాడీ లాగ్వేజ్, ఆ యాసలోనే మాట్లాడాల్సి ఉంటుందట. తెలంగాణ స్టాంట్లో అదరగొట్టే విజయ్‌కి చిత్తూరు యాస రావడం కొంచం కష్టమే. ఇందుకోసం విజయ్ గట్టిగానే కసరత్తు చేయాల్సి ఉంటుంది. అందుకోసం పెంచల్ దాస్ దగ్గర స్పెషల్‌గా ట్రెయినింగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. చదవండి: విజయ్ వారసుడు ఓటీటీ స్ట్రీమింగ్ ఇక్కడే! అంతకు ముందే రిలీజ్? ఈ నేపథ్యంలో త్వరలోనే విజయ్ అయనను కలిసి ట్యూషన్ తీసుకోనున్నాడట. కాగా అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చిత్తూరు యాసలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అయితే సీక్రెట్ బన్ని పంచల్ దాస్ దగ్గర ఈ ట్రెయిన్ అయ్యాడు. అయితే ఈ వార్తలు బయటకు రాకుండ బన్నీ జాగ్రత్త పడ్డాడు. ఇప్పుడు అల్లు అర్జున్ బాటలోనే విజయ్ కూడా చిత్తూరు యాస నేర్చుకునేందుకు సిద్దమయ్యాడిన సినీవర్గాల నుంచి సమాచారం. మరి వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే మూవీ టీం, విజయ్ నుంచి క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాలి. కాగా విజయ్ మరోవైపు ఖుషి మూవీతో బిజీగా ఉన్నాడు. ఇందులో విజయ్ జోడిగా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. -
బాలీవుడ్లో సినిమాలు చేస్తున్న తెలుగు డైరెక్టర్లు
హిందీ దర్శకులు తెలుగులో సినిమాలు చేయడం చాలా అరుదు. తెలుగు దర్శకులు హిందీకి వెళ్లడం కూడా అరుదే. అయితే ఇప్పుడు ఒకేసారి ఐదుగురు దర్శకులు హిందీ చిత్రాలు చేస్తున్నారు. హిందీ పరిశ్రమ మనవాళ్లకు ‘స్వాగ్ సే స్వాగత్’ పలికింది. అంటే... ఆత్మీయ స్వాగతం పలికింది. ఆ ఆహ్వానం అందుకున్న దర్శకుల గురించి తెలుసుకుందాం. తెలుగులో వీవీ వినాయక్ స్టార్ డైరెక్టర్. దాదాపు 20 ఏళ్లుగా ఇక్కడ సినిమాలు చేస్తున్నారు. తొలి సినిమా ‘ఆది’ (2002)తోనే ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్న వీవీ వినాయక్ ఆ తర్వాత ‘దిల్’(2003), ‘ఠాగూర్’(2003), ‘బన్నీ’(2005), ‘కృష్ణ’ (2008) ‘అదుర్స్’ (2010), ‘ఖైదీ నంబరు 150’ (2017) వంటి హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు హిందీ సినిమా చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన హిట్ మూవీ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో ఆయన దర్శకుడిగా బీ టౌన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరో. ఇటు సాయి శ్రీనివాస్‌కు కూడా హిందీలో ‘ఛత్రపతి’యే తొలి సినిమా కావడం విశేషం. ఇక ‘అర్జున్‌రెడ్డి’ (2017) సక్సెస్‌తో డైరెక్టర్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించిన సందీప్ రెడ్డి వంగా ఇదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్‌తో ‘కభీర్ సింగ్’ (2019)గా రీమేక్ చేసి, బాలీవుడ్‌లోనూ నిరూపించుకున్నారు. ఇప్పుడు హిందీలో రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమా చేస్తున్నారు సందీప్. మరోవైపు తొలి చిత్రం ‘ఘాజీ’తోనే జాతీయ అవార్డు సాధించి ఇండస్ట్రీ దృష్టిని వెంటనే తన వైపు తిప్పుకున్న యంగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి కూడా బీ టౌన్ దర్శకుల లిస్ట్‌లో చేరారు. విద్యుత్ జమాల్ హీరోగా‘ఐబీ 71’ అనే స్పై థ్రిల్లర్‌ను తీయనున్నారు సంకల్ప్. జాతీయ అవార్డు సాధించిన మరో తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా హిందీకి హాయ్ చెబుతున్నారు. ‘మళ్ళీ రావా’(2017) వంటి ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల మెప్పు పొందిన గౌతమ్ 2019లో నానీతో తీసిన ‘జెర్సీ’కి జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రం షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ అయ్యింది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరియే దర్శకుడు. ఈ ఏడాది నవంబరు 4న విడుదల చేయాలనుకుంటున్నారు. విశ్వక్ సేన్ ‘హిట్’ (2020) చిత్రంతో దర్శకుడిగా హిట్టయ్యారు శైలేష్ కొలను. తెలుగు ప్రేక్షకులు ‘హిట్’ చేసిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాకు శైలేష్ కొలనుయే డైరెక్టర్. ఇందులో రాజ్‌కుమార్ రావు హీరోగా నటిస్తారు. ప్రముఖ సంగీత దర్శకులు యం.యం. కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా పరిచయమైన చిత్రం ‘మత్తువదలరా’ (2019)తో దర్శకుడిగా పరిచయమయ్యారు రితేష్ రాణా. ఈ చిత్రం హిందీ రీమేక్‌తో దర్శకుడుగా రితేష్ బీ టౌన్లో అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. వీరితో పాటు మరికొంతమంది టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్‌కు డైరెక్షన్ మార్చారు. ఇదిలా ఉంటే.. ఈ దర్శకులందరూ హిందీలో డైరెక్ట్ సినిమా ద్వారా పరిచయమవుతుంటే, ప్యాన్ ఇండియన్ సినిమాల ద్వారా మరికొందరు హిందీ ప్రేక్షకులకు హాయ్ చెప్పనున్నారు. -
గురుశిష్యులు
సాధారణంగా అందరికీ లైఫ్‌లో గురువు పాత్రను ఎక్కువగా తండ్రే పోషిస్తారు. బాలీవుడ్ నటుడు షాహిదీ కపూర్‌కు వాళ్ల నాన్న పంకజ్ కపూరే గురువు. ఇప్పుడు ఆన్‌స్క్రీన్ కూడా తనయుడికి గురువు పాత్రలో కనిపించబోతున్నారు. తెలుగు సూపర్‌హిట్ సినిమా ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో నటించనున్నారు షాహిద్. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నారు. అల్లు అరవింద్, ‘దిల్’ రాజు, అమన్ గిల్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో షాహిద్ మెంటర్‌గా (తెలుగులో సత్యరాజ్ పోషించిన పాత్ర) ఆయన తండ్రి పంకజ్ కపూర్ నటించనున్నారని తెలిసింది. ఈ నెలాఖారున షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 28న రిలీజ్ కానుంది. -
మరో రీమేక్
సౌత్‌లో సక్సెస్ఫుల్ సినిమాలు బాలీవుడ్ రీమేక్‌కి దారి ఇస్తున్నాయి. ఆ దారిలో బాలీవుడ్‌కు వెళ్తున్న చిత్రం ‘జెర్సీ’. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ సినిమాను ఇటు విమర్శకులు అటు ప్రేక్షకులు సూపర్ అన్నారు. ఇప్పుడు ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో నాని పాత్రను షాహిద్ కపూర్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్‌ను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్‌ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. అల్లు అరవింద్, ‘దిల్’ రాజు, అమన్ గిల్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 28న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. షాహిద్ గత చిత్రం ‘కబీర్ సింగ్’ తెలుగు ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్ అని తెలిసిందే. తన కెరీర్ బెస్ట్ హిట్‌గా ‘కబీర్ సింగ్’ సినిమా నిలిచింది. ఇప్పుడు ‘జెర్సీ’ రీమేక్ తన హిట్ ట్రాక్‌ని కొనసాగిస్తుందనే అంచనాలు ఉన్నాయి. -
జెర్సీ దర్శకుడితో మెగా హీరో
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం జెర్సీ. మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో దర్శకుడు గౌతమ్‌ను భారీ ఆఫర్లు వరిస్తున్నాయి. ప్రస్తుతం జెర్సీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న గౌతమ్ తన తదుపరి చిత్రాన్ని మెగా హీరోతో చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రయోగాత్మ చిత్రాలకు ఓటు వేస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్, గౌతమ్‌తో సినిమా చేసేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తుంది.ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న వరుణ్, గౌతమ్‌తో సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తాడో చూడాలి. -
‘జెర్సీ’పై ప్రశంసల జల్లు
నేచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా జెర్సీ. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టాలీవుడ్ టాప్ స్టార్లు సైతం జెర్సీ అద్భుతం అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఎన్టీఆర్.. జెర్సీ బ్రిలియంట్ అంటూ ట్వీట్ చేయగా, అల్లు అర్జున్.. జెర్సీ తప్పక చూడాల్సిన సినిమా అంటూ ట్వీట్ చేశారు. (మూవీ రివ్యూ : జెర్సీ) అంతేకాదు హీరోలు అల్లరి నరేష్, సుధీర్ బాబు, మంచు మనోజ్, శ్రీవిష్ణు లతో పాటు దర్శకులు సుధీర్ వర్మ, మారుతి, మెహర్ రమేష్, ఇంద్రగంటి మోహన కృష్ణ, గోపీ మోహన్, బీవీయస్ రవి, మధుర శ్రీధర్ లాంటి వారు తమ ఫీలింగ్స్‌ను అభిమానులతో పంచుకున్నారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, హీరో హీరోయిన్లు నాని, శ్రద్ధా శ్రీనాథ్‌లను ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. నాని.. 36 ఏళ్ల క్రికెటర్‌గా నటించిన ఈ సినిమాతో సాండల్ వుడ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ సినిమాతో తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తొలి విజయాన్ని అందుకోవటం విశేషం. Just watched JERSEY. Brilliant heart touching film. I loved every aspect of it. Congratulations to the entire team. @NameisNani you rocked the show , your best film & best best performance by far. All artists & technicians did a splendid job. @ShraddhaSrinath @anirudhofficial — Allu Arjun (@alluarjun) 19 April 2019 nailed it . Last and most imp. the captain Gowtham Tinnanuri . Splendid work . Steady & Bold . Such a sweet film. Movie lovers ...its a Must watch. — Allu Arjun (@alluarjun) 19 April 2019 So very proud of u babai @NameisNani Truly hats off!U shined brighter than ever before! @gowtam19 please take a bow,such a brilliant brilliant film! @ShraddhaSrinath looking forward to seeing more of u on screen in this side of the woods! @anirudhofficial 🙌🏼🙌🏼🙌🏼 @vamsi84 #Jersey — Allari Naresh (@allarinaresh) 19 April 2019 #Jersey is both heartwarming and heart-rending. Not an easy achievement. BRILLIANT performance by @NameisNani and the supporting cast, it’s a RARE and MOVING portrayal of human triumph. Please watch it. Everyone. Congrats to all. Gowtam Tinnanuri👏👍👏👍👏Stay put RIGHT THERE👏 — Mohan Indraganti (@mokris_1772) 19 April 2019 #JERSEY...what a film wow , amazing performance by @NameisNani !!!Must watch film !!! Direction by @gowtam19 is extraordinary and scintillating music by @anirudhofficial!! — Sree Vishnu (@sreevishnuoffl) 19 April 2019 Heartful congratulations to @NameisNani and @gowtam19 for a beautiful emotion driven film!❤️❤️ Cheers to the entire team of #Jersey👏👏 A must watch indeed...😍😍 pic.twitter.com/4fXJ2kIbRi — MM*🙏🏻❤️ (@HeroManoj1) 19 April 2019 #JERSEY will be celebrated and it will be remembered. The film stays with me. In love with@Nameisnani's performance. Brilliantly done @gowtam19 & @ShraddhaSrinath is a class act. Congratulations all 👏👏 — Sudheer Babu (@isudheerbabu) 19 April 2019 Just watched #Jersey, Outstanding in every aspect. Congrats to the whole team 👏👏👏👏👏 @NameisNani @vamsi84 @gowtam19 @haarikahassine @anirudhofficial — sudheer varma (@sudheerkvarma) 19 April 2019 #JERSEY is a wonderful sports drama, @NameisNani gari honest performance really touching & takes the film to next level. Dir @gowtam19 is genuine in every frame of the film @anirudhofficial BGM is brilliant ,Congratulations to my friends @vamsi84 @SitharaEnts for the success pic.twitter.com/wa79naIQ2h — Maruthi director (@DirectorMaruthi) 19 April 2019 -
‘జెర్సీ’ ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జెర్సీ. మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని మిడిల్ ఏజ్ క్రికెటర్‌గా కనిపించనున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. నాని మార్క్ నేచురల్ పర్ఫామెన్స్, పిరియాడిక్ నేటివిటీ, ఎమోషనల్ సీన్స్ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న జెర్సీ సినిమాలో నానికి జోడిగా కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని 36 ఏళ్ల వ్యక్తిగా ఓ కుర్రాడికి తండ్రిగా నటిస్తుండటం విశేషం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నాడు. -
‘జెర్సీ’ వెనుక కష్టాలు
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జెర్సీ. మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని మిడిల్ ఏజ్ క్రికెటర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న జెర్సీ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈటీజర్ అయిన టీజర్ సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. తాజాగా జెర్సీ సినిమాలో క్రికెటర్‌గా నటించేందుకు నాని పడిన కష్టం, సినిమాను తెరకెక్కించేందుకు సాంకేతిక నిపుణులు పడిన కష్టానికి సంబంధించిన వీడియోను జర్నీ ఆఫ్ జెర్సీ పేరుతో రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ వీడియోలో నాని 70 రోజుల పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేయటం, షూటింగ్ గాయపడటం లాంటి అంశాలు ఉన్నాయి. కేవలం క్లైమాక్స్‌లో వచ్చే క్రికెట్ ఎపిసోడ్‌ను మాత్రమే 24 రోజుల పాటు తెరకెక్కించినట్టుగా వెల్లడించారు. 2 అంతర్జాతీయ స్టేడియాలు, మరో 5 డొమాస్టిక్ స్టేడియాల్లో ఈ చిత్రకరణ జరిగినట్టుగా తెలిపారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో నానికి జోడిగా కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నాడు. -
‘ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు’
ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలలో పిరియాడిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. అదే జానర్లో తెరకెక్కుతున్న మరో ఇంట్రస్టింగ్ మూవీ జెర్సీ. వరుస విజయాలతో సూపర్ ఫాంలో కనిపించిన యంగ్ హీరో నాని ఇటీవల కాస్త తడబడుతున్నాడు. తన రేంజ్ కు తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న నేచురల్ స్టార్ హీరోగా పిరియాడిక్ జానర్లో తెరకెక్కుతున్న సినిమా జెర్సీ. మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ నటి శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. నూతన సంవత్సర కానుకగా జనవరి 1న జెర్సీ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. క్రికెట్ కావాలనుకునే ఓ వ్యక్తి కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని.. అర్జున్ పాత్రలో కనిపిస్తున్నాడు. టీజర్ చూస్తే తన కలను నేరవేర్చుకునేందుకు అర్జున్ పడిన కష్టాన్ని ఎమోషనల్‌గా తెరకెక్కించనట్టుగా అనిపిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. -
నాని స్క్రిప్ట్ రాస్తున్నాడా...?
నేచురల్ స్టార్ నాని హీరోగానే కాక ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. అ! సినిమాతో అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న నాని ప్రస్తుతానికి హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా నాని స్క్రిప్ట్ రైటర్ అవతారం ఎత్తినట్టుగా వార్తలు వినిపించాయి. త్వరలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు నాని. ఈ సినిమాకు విక్రమ్‌తో కలిసి నాని రచయితగా పనిచేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై దర్శకుడు విక్రమ్‌కుమార్ క్లారిటీ ఇచ్చారు. నాని స్క్రిప్ట్ వర్క్ లో ఇన్వాల్ కావటం లేదని చెప్పారు. ప్రస్తుతం నాని జెర్సీ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. నాని క్రికెటర్‌గా నటిస్తున్న ఈసినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. -
నాని కొత్త సినిమా మొదలైంది
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జెర్సీ. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ యూటర్న్ ఫేం శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ రోజు(బుధవారం) ఉదయం ఫిలిం నగర్‌లోని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఈసినిమా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. రేపటి నుండి రెగ్యులర్‌గా షూటింగ్ జరుగుతుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సత్యరాజ్, బ్రహ్మాజీ, రోనిత్ కామ్రా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. -
మళ్లీ ప్రేమకథలో..
‘ఐయామ్ ఇన్ లవ్.. ఐయామ్ ఇన్ లవ్’ అంటున్నారు సుమంత్. రియల్ లైఫ్‌లో కాదులెండి.. రీల్ లైఫ్‌లో. హీరోగా సుమంత్ డిఫరెంట్ సినిమాల్లో నటించినా... ఆయనకు ప్రేమకథలు ఎక్కువ పేరు తీసుకొచ్చాయి. లేటెస్ట్గా మరో ప్రేమకథా చిత్రంలో నటించడానికి అంగీకరించారు సుమంత్. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్‌యాదవ్ నక్కా నిర్మించనున్న ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేఎల్ దామోదరప్రసాద్ క్లాప్ ఇవ్వగా, చిత్రనిర్మాత రాహుల్ తల్లి సావిత్రి కెమేరా స్విచ్చాన్ చేశారు. ఈ నెలాఖరున చిత్రీకరణ ప్రారంభించను న్నారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీశైలం యాదవ్, కాదంబరి కిరణ్, ప్రవీణ్ (వెంకట్) యాదవ్, బందరు బాబీ పాల్గొన్నారు. సుమంత్‌కు జోడీగా ఆకాంక్ష సింగ్ నటించనున్న ఈ సినిమాలో అన్నపూర్ణ, కాదంబరి కిరణ్, ‘మిర్చి’ కిరణ్, అభినవ్, అప్పాజీ అంబరీష తదితరులు ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి పాటలు: కృష్ణకాంత్, సంగీతం: శ్రవణ్.