విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'వీడీ12' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోయే ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేసింది చిత్ర బృందం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుకుంటున్న ఈ మూవీ త్వరోలోనే సెట్స్‌పై రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే లైగర్‌తో ఫ్యాన్స్‌ను నిరాశ పరిచిన విజయ్ ఈసారి గట్టి హిట్ కొట్టాలని ఆశగా ఎదురు చూస్తున్నాడు.
చదవండి: చిరంజీవి మెసేజ్‌ను అవాయిడ్ చేసిన స్టార్ యాంకర్! అసలేం జరిగిందంటే..
ఈ నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి మూవీ కోసం విజయ్ స్పెషల్‌గా ట్యూషన్‌కు వెళ్లనున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం జానపద గాయకుడు, రచయిత పెంచల్ దాస్‌ను విజయ్ సంప్రదించబోతున్నట్లు ఫిలిం దూనియాలో వినికిడి. వీడీ12 మూవీ కథ చిత్తూరు ప్రాంతం చూట్టు తిరుగుతుందట. ఇందులో విజయ చిత్తూరు యువకుడిగా బాడీ లాగ్వేజ్, ఆ యాసలోనే మాట్లాడాల్సి ఉంటుందట. తెలంగాణ స్టాంట్‌లో అదరగొట్టే విజయ్‌కి చిత్తూరు యాస రావడం కొంచం కష్టమే. ఇందుకోసం విజయ్ గట్టిగానే కసరత్తు చేయాల్సి ఉంటుంది. అందుకోసం పెంచల్ దాస్ దగ్గర స్పెషల్‌గా ట్రెయినింగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట.
చదవండి: విజయ్ వారసుడు ఓటీటీ స్ట్రీమింగ్ ఇక్కడే! అంతకు ముందే రిలీజ్?
ఈ నేపథ్యంలో త్వరలోనే విజయ్ అయనను కలిసి ట్యూషన్ తీసుకోనున్నాడట. కాగా అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చిత్తూరు యాసలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అయితే సీక్రెట్ బన్ని పంచల్ దాస్ దగ్గర ఈ ట్రెయిన్ అయ్యాడు. అయితే ఈ వార్తలు బయటకు రాకుండ బన్నీ జాగ్రత్త పడ్డాడు. ఇప్పుడు అల్లు అర్జున్ బాటలోనే విజయ్ కూడా చిత్తూరు యాస నేర్చుకునేందుకు సిద్దమయ్యాడిన సినీవర్గాల నుంచి సమాచారం. మరి వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే మూవీ టీం, విజయ్ నుంచి క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాలి. కాగా విజయ్ మరోవైపు ఖుషి మూవీతో బిజీగా ఉన్నాడు. ఇందులో విజయ్ జోడిగా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment