Allu Arjun And Vijay Devarakonda About Puneeth Rajkumar: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి పట్ల అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ సంతాపం వ్యక్తం చేశారు. పుష్పక విమానం ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న అల్లు అర్జున్ ఈ సందర్భంగా పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పునీత్‌తో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఆయన మా ఇంటికి వచ్చేవారు. కలిసి భోజనం చేసేవాళ్లం.
నేను బెంగళూరుకు వెళ్లినప్పుడు కలిసేవాళ్లం. ఇద్దరికి ఒకరంటే ఒకరికి గౌరవం. ఓ డ్యాన్స్ కార్యక్రమానికి ఇద్దరం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించాం. ఎప్పుడు కలిసినా బెంగళూరు రమ్మనేవారు. అలాంటిది అకస్మాత్తుగా ఆయన లేరనే వార్త తెలిసి షాక్‌కి గురయ్యాను. పునీత్ గొప్ప వ్యక్తి అని, ఆయన చిత్ర పరిశ్రమకు గర్వకారణం అని తెలిపారు.
ఇక విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..కొన్నాళ్ల క్రితం ఇంటికి ఆహ్వానిస్తే వెళ్లి తనతో రెండు, మూడు గంటలు మాట్లాడాను. ఆయన అకస్మాత్తుగా ఈ లోకం నుంచి వెళ్లిపోవడం కలిచివేసింది. ఏదో ఒకరోజు ఈ లోకం నుంచి మనం వెళ్లిపోతాం. ఉన్నంతకాలం కలిసి పనిచేద్దాం. సంతోషంగా ఉందాం. ప్రేమిద్దాం..ఇతరకులకు మద్ధతుగా నిలుద్దాం అని విజయ్ అన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలు
చిన్న వయసులోనే వదిలివెళ్లడం బాధాకరం: చిరంజీవి
Comments
Please login to add a commentAdd a comment