Vijay Devarakonda and His Brother Answered the Most Searched Questions on Google - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై స్పందించిన రౌడీ హీరో

Published Sat, Nov 6 2021 6:09 PM | Last Updated on Sat, Nov 6 2021 7:32 PM

Deverakonda Brothers Answer Most Google Searched Questions - Sakshi

Vijay Devarakonda Reveals About His Break Up: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన బ్రేకప్‌ను బయటపెట్టేశాడు. తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ నటించిన పుష్పక విమానం సినిమాకు విజయ్‌ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో దేవరకొండ బ్రదర్స్‌ ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయారు. తాజాగా తమ గురించి  గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేసిన పలు ప్రశ్నలకు దేవరకొండ బ్రదర్స్‌ సమాధానాలు ఇచ్చారు.

ఇందులో భాగంగా అర్జున్‌ రెడ్డి హీరో విజయ్‌ దేవరకొండ డేటింగ్‌లో ఉన్నారా? సింగిలా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. 'ఈ మధ్యే నా హార్ట్‌ బ్రేక్‌ అయ్యింది. అందుకే కొంచెం బాధలో ఉన్నా' అని తెలిపాడు. అంతేకాకుండా ఈ విషయం ఇప్పటివరకు ఎవరికి తెలియదని కూడా చెప్పుకొచ్చాడు.దీంతో దేవరకొండతో బ్రేకప్‌ అయిన ఆ అమ్మాయి ఎవరా అని ఫ్యాన్స్‌ మళ్లీ ఆలోచనలో పడ్డారు. మరోవైపు ఆనంద్‌ దేవరకొండ..తాను ఇంకా సింగిల్‌ అంటూ  తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై క్లారిటీ ఇచ్చాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement