ఈ అన్నదమ్ములను గుర్తుపట్టారా? ఇద్దరూ హీరోలే! | Tollywood Brothers Childhood Photo Goes Viral | Sakshi
Sakshi News home page

Tollywood Heroes: ఒకరు సైడ్‌ క్యారెక్టర్‌ నుంచి హీరోగా.. మరొకరు మాత్రం డైరెక్ట్‌ హీరోగా ఎంట్రీ!

Published Mon, Jul 17 2023 1:10 PM | Last Updated on Mon, Jul 17 2023 1:28 PM

Tollywood Brothers Childhood Photo Goes Viral - Sakshi

ఈ ఫోటోలో ఉన్న ఇద్దర్ని గుర్తుపట్టారా? వీరిద్దరూ టాలీవుడ్‌ హీరోలే! ఒకరి భుజంపై మరొకరు చేతులు వేసుకుని కులాసాగా నవ్వులు చిందిస్తూ ఫోటో దిగిన వీళ్లు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మంచి స్థానంలో ఉన్నారు. పెద్దోడు సైడ్‌ క్యారెక్టర్లు చేసుకుంటూ నేడు టాప్‌ హీరో స్థాయికి వస్తే చిన్నోడు డైరెక్ట్‌ హీరోగా సినిమా చేసి సక్సెస్‌ అయ్యాడు. ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వాలన్న అన్న కల అడియాసలు కాగా తమ్ముడు మాత్రం ఓ మంచి ప్రేమకథతో మరో హిట్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకీ ఈ అన్నదమ్ములెవరో ఈపాటికే అర్థమై ఉంటుంది. పొడుగ్గా ఉన్న పిల్లోడు విజయ్‌ దేవరకొండ కాగా తన పక్కన ఉన్న చిన్నోడు ఆనంద్‌ దేవరకొండ.

నువ్విలా, లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించిన విజయ్‌ దేవరకొండకు ఎవడే సుబ్రమణ్యం సినిమాలో మంచి రోల్‌ పడింది. ఈ పాత్ర బాగా క్లిక్‌ అవ్వడంతో విజయ్‌కు గుర్తింపు లభించింది. తర్వాత పెళ్లి చూపులుతో సినిమాతో హీరోగా క్రేజ్‌ రాగా, అర్జున్‌ రెడ్డితో తన లెవలే మారిపోయింది. ఈ సినిమాతో రౌడీ హీరోగా మారిన విజయ్‌.. గీత గోవిందంతో మరో హిట్‌ అందుకున్నాడు. కానీ తర్వాత వరుస అపజయాలు అతడిని వెంటాడాయి. లైగర్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టాలన్న ఆశ కూడా నెరవేరలేదు. ప్రస్తుతం ఇతడు సమంతతో ఖుషీ సినిమా చేస్తున్నాడు.

ఇక విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ విషయానికి వస్తే.. దొరసాని చిత్రంతో వెండితెరపై హీరోగా రంగప్రవేశం చేశాడు. మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌, పుష్పక విమానం, హైవే.. ఇలా డిఫరెంట్‌ కథలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తూ వస్తున్న ఇతడు తాజాగా బేబీ సినిమాతో బంపర్‌ హిట్‌ అందుకున్నాడు. మొదట్లో అన్న పేరును నిలబెట్టాలంటూ ఆనంద్‌పై ఒత్తిడి తెచ్చిన జనాలు.. ఇప్పుడు తమ్ముడిని చూసి కథలు సెలక్ట్‌ చేసుకో, సక్సెస్‌ సాధించుకో అని విజయ్‌కు హితబోధ చేస్తున్నారు. ఏదేమైనా ఈ అన్నదమ్ములిద్దరికీ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్‌ ఉంది.

చదవండి: బిగ్‌బాస్‌లోకి కి ఈ జంట ఎంట్రీ ఖాయం.. ఎవరంటే?
హిట్‌ కోసం నిరీక్షణ.. ఈసారైనా హీరోయిన్‌కు సక్సెస్‌ సొంతమవుతుందా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement