హిట్టు కోసం అల్లాడిపోయాడు విజయ్ దేవరకొండ. ఈ రౌడీ హీరో ఒక్కడేనా? అటు హీరోయిన్ సమంత, ఇటు డైరెక్టర్ శివ నిర్వాణ.. అందరూ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూశారు. ఎట్టకేలకు వీరి ముగ్గురికీ ఖుషి రూపంలో సక్సెస్ దొరికింది. సెప్టెంబర్ 1న విడుదలైన ఖుషి సినిమాకు సానుకూల స్పందన లభిస్తోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.
ఈ క్రమంలో విజయ్‌తో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఒక అమ్మాయి అయితే ఏకంగా విజయ్‌ను హత్తుకునేందుకు ప్రయత్నించింది. బాడీగార్డులు ఆమెను అడ్డుకోవడంతో చివరకు ఫోటో దిగి సంతృప్తి చెందింది. దర్శనానంతరం హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'ఈ ఏడాది మా ఫ్యామిలీకి చాలా కలిసొచ్చింది. మా బ్రదర్ బేబీ మూవీ, నేను నటించిన ఖుషి రెండూ సక్సెస్ అయ్యాయి. అందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు మా కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నాను.
కొన్నేండ్ల కిందట నేను యాదాద్రికి వచ్చినప్పుడు గుడి ఇంత బాగా లేదు. పునర్నిర్మాణంలో యాదాద్రిని అద్భుతమైన ఆలయంగా తీర్చిదిద్దిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాం. మా మైత్రీ సంస్థకు కూడా ఈ ఏడాది కలిసొచ్చింది. వాళ్ల రెండు సినిమాలకు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అలాగే ఇప్పుడు ఖుషి హిట్ అయ్యింది. మాలాగే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని దేవుడిని కోరుకున్నా' అని చెప్పాడు.
చదవండి: హీరోయిన్ సమంత ఎక్కడ?.. విజయ్ దేవరకొండను ప్రశ్నించిన నాగ్.. రూ.35 లక్షలు ఆఫర్..
Comments
Please login to add a commentAdd a comment