
ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతీ శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది. తాజాగా సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో తన సోదరుడు విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీస్టార్ చిత్రం గురించి ఆయన కామెంట్ చేశాడు.
కొద్దిరోజుల క్రితం విడుదలైన 'ఫ్యామిలీస్టార్'కు కావాలనే నెగెటివ్ టాక్‌తో ప్రచారం చేశారు. ఆ సినిమా విడదల కావడానికి 48 గంటల ముందు నుంచే పబ్లిక్ మాట్లాడిని పాత వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. గతంలో విజయ్ సినిమాలకు సంబంధించిన మాటలను తీసుకొచ్చి ఫ్యామిలీస్టార్ రిజల్ట్, రివ్యూలు అంటూ తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టారు. అలాంటి సమయంలో ప్రేక్షకుల్లో కూడా కాస్త నిరుత్సాహం కనిపించింది.

కనీసం సినిమా చూసిన తర్వాత అయినా అలా రివ్యూస్ ఇచ్చి ఉంటే.. నిజంగానే ప్రేక్షకులకు మూవీ నచ్చలేదేమోనని అనుకునే వాళ్లం. అలాంటిది ఫ్యామిలీస్టార్ విడుదలకు ముందే కావాలని టార్గెట్ చేసి కొందురు ఎందుకు ఎటాక్ చేశారో తెలియడం లేదు. ఇలాంటి పద్ధతి చిత్ర పరిశ్రమకు చాలా ప్రమాదకరం. ఇలాంటి పని ఎందుకు, ఎవరు చేస్తున్నారో తెలుసుకునేందుకు సైబర్‌క్రైమ్‌కు వారికి ఫిర్యాదు కూడా చేశాం. భవిష్యత్‌లో విజయ్ నుంచి మూడు సినిమాలు వస్తున్నాయి. అవన్నీ మీకు నచ్చుతాయని కోరుకుంటున్నాను. అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment