Nani's New Movie Jersy Started - Sakshi
Sakshi News home page

Published Wed, Oct 17 2018 10:51 AM | Last Updated on Wed, Oct 17 2018 1:07 PM

Nani Jersey Has Completed Its Formal Pooja - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జెర్సీ. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ యూటర్న్  ఫేం శ్రద్ధా శ్రీనాధ్‌ హీరోయిన్‌ గా నటిస్తున్నారు. ఈ రోజు(బుధవారం) ఉదయం ఫిలిం నగర్‌లోని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఈసినిమా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హజరయ్యారు.

రేపటి నుండి రెగ్యులర్‌గా షూటింగ్‌ జరుగుతుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సత్యరాజ్‌, బ్రహ్మాజీ, రోనిత్‌ కామ్రా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/5

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement