‘జెర్సీ’ ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్‌ | Nani Jersey Movie Trailer Gets Superb Response | Sakshi
Sakshi News home page

‘జెర్సీ’ ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్‌

Published Fri, Apr 12 2019 12:25 PM | Last Updated on Fri, Apr 12 2019 12:25 PM

Nani Jersey Movie Trailer Gets Superb Response - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జెర్సీ. మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని మిడిల్‌ ఏజ్‌ క్రికెటర్‌గా కనిపించనున్నాడు. తాజాగా రిలీజ్‌ అయిన ఈ సినిమా ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్‌ వస్తోంది. నాని మార్క్‌ నేచురల్‌ పర్ఫామెన్స్‌, పిరియాడిక్‌ నేటివిటీ, ఎమోషనల్‌ సీన్స్‌ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న జెర్సీ సినిమాలో నానికి జోడిగా కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని 36 ఏళ్ల వ్యక్తిగా ఓ కుర్రాడికి తండ్రిగా నటిస్తుండటం విశేషం. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ  అనిరుధ్ రవిచంద్రన్‌ సంగీతమందిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement