నేచురల్ స్టార్ నాని హీరోగానే కాక ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. అ! సినిమాతో అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న నాని ప్రస్తుతానికి హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా నాని స్క్రిప్ట్ రైటర్ అవతారం ఎత్తినట్టుగా వార్తలు వినిపించాయి. త్వరలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు నాని. ఈ సినిమాకు విక్రమ్‌తో కలిసి నాని రచయితగా పనిచేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ విషయంపై దర్శకుడు విక్రమ్‌కుమార్ క్లారిటీ ఇచ్చారు. నాని స్క్రిప్ట్ వర్క్ లో ఇన్వాల్ కావటం లేదని చెప్పారు. ప్రస్తుతం నాని జెర్సీ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నాని క్రికెటర్‌గా నటిస్తున్న ఈసినిమా సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది.
Comments
Please login to add a commentAdd a comment