
చిట్టబోయిన రాహుల్ యాదవ్
వీవీ నాథూ స్మారక అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ సింగిల్స్ టైటిల్ గెలిచాడు. పుణేలో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రాహుల్ యాదవ్ 21–14, 16–21, 21–15తో ఆలాప్ మిశ్రా (మధ్యప్రదేశ్)పై గెలుపొందాడు. ఆర్‌బీఐ తరఫున బరిలోకి దిగిన హైదరాబాద్ అమ్మాయి కె.మనీషా మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఫైనల్లో మనీషా–సాన్యామ్ శుక్లా (ఎయిరిండియా) ద్వయం 22–20, 21–18తో షేక్ గౌస్ (ఆంధ్రప్రదేశ్)–పూజ (ఎయిరిండియా) జంటపై నెగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment