
భారత స్టార్ ప్లేయర్ అభయ్ సింగ్ తన కెరీర్‌లో ఎనిమిదో ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్‌ఎ) సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. కెనడాలోని టొరంటోలో జరిగిన గుడ్‌ఫెలో క్లాసిక్ టోర్నీలో అభయ్ సింగ్ విజేతగా నిలిచాడు.
40 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో 25 ఏళ్ల అభయ్ 11–7, 11–9, 11–9తో మోరిస్ డేవ్‌రెడ్ (వేల్స్)పై విజయం సాధించాడు. ఈ ఏడాది అభయ్‌కిది రెండో టైటిల్. గత నెలలో ముంబైలో జరిగిన జేఎస్‌డబ్ల్యూ విల్లింగ్డన్ టోర్నీలోనూ అభయ్ టైటిల్ గెలిచాడు.