
లక్నో: సయ్యద్ మోదీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల్లో తొలి రౌండ్‌లో రాహుల్ 21–13, 21–17తో కార్తికేయ (భారత్)పై... రెండో రౌండ్‌లో 21–10, 21–16తో ఆర్యమాన్ (భారత్)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన ఆలాప్ మిశ్రా, అన్సల్ యాదవ్ కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో హైదరాబాద్ అమ్మాయి ప్రాషి జోషికి నిరాశ ఎదురైంది. తొలి రౌండ్‌లో ప్రాషి 21–19, 18–21, 8–21తో భారత్‌కే చెందిన తన్వీ
లాడ్ చేతిలో ఓడిపోయింది.
ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్, లక్ష్య సేన్ : అన్ని విభాగాల్లో నేటి నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు జరుగుతాయి. పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, లక్ష్య సేన్ బరిలోకి దిగకుండానే నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. కశ్యప్‌తో ఆడాల్సిన లూకాస్ కోర్వీ (ఫ్రాన్స్)... లక్ష్య సేన్‌తో ఆడాల్సిన థామస్ రుక్సెల్ (ఫ్రాన్స్) టోర్నీ నుంచి వైదొలగడంతో భారత ఆటగాళ్లకు తొలి రౌండ్‌లో ‘వాకోవర్’ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment