ఆర్‌ఈ/మ్యాక్స్‌తో హౌసింగ్‌డాట్‌కామ్ ఒప్పందం | Housing.com Agreement with RE / Max | Sakshi
Sakshi News home page

ఆర్‌ఈ/మ్యాక్స్‌తో హౌసింగ్‌డాట్‌కామ్ ఒప్పందం

Published Tue, Jul 21 2015 12:52 AM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM

Housing.com Agreement with RE / Max

న్యూఢిల్లీ: ప్రాపర్టీ పోర్టల్ హౌసింగ్‌డాట్‌కామ్ తాజాగా రియల్ ఎస్టేట్ బ్రోకరేజి సంస్థ ఆర్‌ఈ/ఎంఏఎక్స్‌తో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం ఆర్‌ఈ/ఎంఏఎక్స్ తమ దగ్గరున్న ప్రాపర్టీలను హౌసింగ్‌డాట్‌కామ్ సైటులో పొందుపరుస్తుంది. ప్రతిగా హౌసింగ్‌డాట్‌కామ్ సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాల్లో ఆర్‌ఈ/మ్యాక్స్‌కి కార్యకలాపాలు ఉన్నాయి. 6,500 కార్యాలయాలు.. 1,00,000 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉన్నారు. నచ్చిన ఇంటి అన్వేషణ నుంచి కొనుగోలుదాకా అన్ని అంశాల్లోనూ గృహ కొనుగోలుదారులకు అవసరమైన సేవలు అందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని హౌసింగ్‌డాట్‌కామ్ సీవోవో రిషభ్ గుప్తా, ఆర్‌ఈ/ఎంఏఎక్స్ ఇండియా చైర్మన్ శామ్ చోప్రా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement