Technical assistance
-
అల్పాదాయ దేశాలకు ఆర్థిక వనరులు అందించాలి
న్యూఢిల్లీ: సాంకేతిక సహాయం, ఇతరత్రా సర్వీసుల ద్వారా అల్పాదాయ సభ్య దేశాలకు ఆర్థిక వనరులు అందుబాటులో ఉండేలా తోడ్పాటు అందించాలని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌కి (ఏఐఐబీ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. క్లయింట్ అవసరాలకు అనుగుణంగా సేవలు అందించే విధానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని పేర్కొన్నారు. ఉజ్బెకిస్తాన్‌లో ఏఐఐబీ బోర్డు గవర్నర్ల 9వ వార్షిక సమావేశం జరగనున్న నేపథ్యంలో బ్యాంక్ ప్రెసిడెంట్ జిన్ లికున్‌తో భేటీ సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మైక్రో బ్లాగింగ్ సైటు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. తొమ్మిదేళ్ల స్వల్ప వ్యవధిలోనే రుణ కార్యకలాపాలను ఏఐఐబీ వేగవంతంగా విస్తరించిందని మంత్రి ప్రశంసించారు. అలాగే సంస్థ గవర్నెన్స్ ప్రమాణాలు పాటించడంలోను, వృద్ధి సాధనలోను భారత్ కీలకపాత్ర పోషిస్తోందని బ్యాంకు తెలిపింది. మరోవైపు, ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ అల్ కువారీతో కూడా సీతారామన్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. ఏఐఐబీలో భారత్ రెండో అతి పెద్ద వాటాదారు, అతి పెద్ద క్లయింట్‌గాను ఉంది. ఆసియా దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థిక వనరులను అందించే బహుళపక్ష డెవలప్మెంట్ బ్యాంకుగా, బీజింగ్ కేంద్రంగా ఏఐఐబీ ఏర్పడింది. ఇందులో చైనాకు అత్యధికంగా 2,97,804 షేర్లు ఉండగా, భారత్‌కు 83,673 షేర్లు ఉన్నాయి. -
రహస్య కెమెరాలను ఇలా పట్టేయవచ్చు!
హోటల్ గదిలో రహస్యంగా స్పై కెమెరాలను అమర్చిన సంఘటనలు ఇటీవల మనం కొన్ని వినే ఉంటాం. కంటికి నేరుగా కనిపించని ఈ కెమెరాల సాయంతో మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను షూట్ చేసి రకరకాల నేరాలకు పాల్పడుతున్న విషయమూ మనం వార్తల్లో చూసుంటాం. అయితే ఇ రహస్యంగా అమర్చిన కెమెరాల గురించి తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు నిపుణులు. అమెరికాలోని ఓ ఛానల్ ఈమధ్యే ఈ అంశంపై ఓ ప్రయోగమూ చేసింది. స్పైకామ్లను ఏర్పాటు చేసేందుకు అవకాశాలున్న ప్రాంతాలు, వాటిని గుర్తించేందుకు ఉన్న పద్ధతులను కూడా ఇలా వివరించింది... ఎక్కడెక్కడ అమర్చే అవకాశాలు స్పైక్యామ్‌లు చాలా చిన్నవిగా ఉంటాయి పైగా కొనుగోలు చేయడం సులభం. ఉదాహరణకు, హోటల్స్‌లో ఫోటో ప్రేమ్‌లు, గడియారాలు, కెమెరాను స్మోక్ డిటెక్టర్లు, ఎయిర్ ఫిల్టర్ పరికరాలు, పుస్తకాలు, గోడపై ఏదైనా, డెస్క్ ప్లాంట్, టిష్యూ బాక్స్, స్టఫ్డ్ టెడ్డీ బేర్, డిజిటల్ టీవీ బాక్స్, హెయిర్ డ్రైయర్, వాల్ క్లాక్, పెన్ లేదా క్లాత్‌లో ఆఖరికి టూత్ బ్రష్ హోల్డర్‌లో దీన్ని దాచవచ్చు. అంతేకాదు బాత్రూమ్ షవర్లు, పైకప్పులు, తలుపు రంధ్రాలు, డెస్క్ పాన్‌లో కూడా హిడెన్ కెమెరాలు అమర్చి ఉంటాయి. ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒక రూంలో 27 రహస్య కెమెరాలను అమర్చిన సీఎన్‌బీసీ టీం మొత్తం 5 రౌండ్లలో వివిధ సాధనాల ద్వారా పరీక్షించింది. దీని ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. నేకెడ్ ఐ టెస్ట్ నేకెడ్ ఐ లేదా బేర్ ఐ లేదా అన్ ఎయిడెడ్ ఐ అని కూడా అంటాం. భూతద్దం లాంటివి ఏమీ లేకుండా మన కళ్లతోనే పరిసరాలను జాగ్రత్తగా గమనించడం. అనుమానం వచ్చిన వస్తువులను చెక్ చేసుకోవడం. దీని ద్వారా ఈ టీం ఒక కెమెరాను మాత్రమే గుర్తించింది. మొబైల్ ఫోన్ వైఫై నెట్‌వర్క్‌లను స్కాన్ చేసే ‘ఫింగ్’యాప్ ద్వారా కెమెరా లెన్స్‌ను గుర్తుపట్టొచ్చు. ఇది ఎన్ని కెమెరాలున్నాయో ఇది ఇట్టే గుర్తు పడుతుంది. అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పలేదు. ఇందుకు స్మార్ట్‌ఫోన్‌లోని ఫ్లాష్‌లైట్‌ను వాడవచ్చు. ఈ విధానం ద్వారా ఫింగ్ 22 డివైస్‌లు వైఫైకి కనెక్ట్ అయినట్టు గుర్తించింది కానీ, కెమెరాలు ఎక్కడ ఉన్నదీ కనిపెట్టలేదు. ఇంటి ప్రధాన నెట్వర్క్ కాకుండా, కెమెరా కోసం రెండో వైర్లెస్ నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేశారట. అయినా కూడా కెమెరాల ఉనికిని గుర్తించింది. ఈ పద్దతిలో టీం మూడు కెమెరాలను గుర్తించగలిగింది. ఒకటి వైఫై డివైస్, రెండు షర్ట్ బటన్, టెడ్డీ బేర్‌లో మూడోది దొరికింది. రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్ దీని ద్వారా స్పై కెమెరాను గుర్తించగానే బీప్ సౌండ్ సంకేతాన్నందిస్తుంది. కెమెరాలను ఆన్ చేసి, Wi-Fiకి కనెక్ట్ అయినపుడు మాత్రమే కనిపిస్తాయి.ఎస్డీ కార్డ్‌లను ఉపయోగించే కెమెరాలను గుర్తించలేవు.అంతర్నిర్మిత లెన్స్ డిటెక్టర్ కూడా ఉంటుంది. లెన్స్ డిటెక్టర్ ప్రాథమిక లెన్స్ డిటెక్టర్, చౌకైనది, పోర్టబుల్ , ఉపయోగించడానికి సులభమైనది. ఇన్ఫ్రా రెడ్ కాంతిని విడుదల చేస్తుంది, తద్వారా కెమెరా లెన్స్ గుర్తించినపుడు ఎరుపు డాట్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా రెండు కెమెరాలను మాత్రమే కనుగొంది టీం. అధునాతన లెన్స్ డిటెక్టర్ బైనాక్యులర్లను పోలి ఉండే అధునాతన లెన్స్ డిటెక్టర్. ఇది కెమెరా లెన్స్ నుండి ప్రతిబింబించే కాంతిని కూడా పెంచుతుంది. అయితే, ఈ పరికరం దూరం నుండి పని చేస్తుంది. అలాగే తక్కువ-కాంతి లేదా చీకటిలోమాత్రమే కెమెరాలను గుర్తించగలదు. అదీ కూడా ఒక ప్రత్యేక యాంగిల్లో చూసినపుడు మాత్రమే కెమెరాలను గుర్తించడం సులభమైంది ఈ పద్దతిలో టిష్యూ బాక్స్, లెదర్ బ్యాగ్, డెస్క్ కింద ఫైల్స్మధ్య ఇలా మొత్తం 11 కెమెరాలను టీం గుర్తించింది. -
సాగులో.. సాంకేతికత.. ప్రయొజనాలు అధికం
సంగారెడ్డి: పంట సాగులో ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు కూలీల సమస్యను అధిగమించి అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా డ్రోన్లను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎరువులు, పురుగు మందుల పిచికారీకి కూలీలు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. దీంతో ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు కూలీల సమస్యను అధిగమించి అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు సాంకేతికత బాట పడుతున్నారు. మందులు పిచికారీ చేసేందుకు డ్రోన్లు చాలా ఉపయోగపడుతున్నాయి. సంగారెడ్డి జిల్లాతో ఇప్పటికే చాలా మంది రైతులు డ్రోన్లను వినియోగించడం విశేషం. డ్రోన్ వినియోగంతో ప్రయోజనాలెన్నో .. ఎకరా విస్తీర్ణంలో పురుగు మందుల పిచికారీ ఆరు నిమిషాల్లో పూర్తవుతుంది. ఎరువులకై తే 12 నిమిషాల సమయం పడుతుంది. అంతే కాకుండా రోజుకు 2530 ఎకరాల్లో పిచికారీ చేసేందుకు వీలు ఉంటుంది. మనుషులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. డ్రోన్ ద్వారా ఎరువులు, పురుగు మందులు ఒకేసారి పిచికారీ చేయడం ద్వారా సులభంగా, చీడపీడల నివారణ అవుతుంది. ఎత్తు పల్లాలతో కూడిన పంట పొలాల్లోనూ సులభంగా మందులు చల్లవచ్చు. డ్రోన్ల ద్వారా పురుగుమందుల పిచికారీకి ఎకరాకు రూ.500 నుంచి రూ.1000 వరకు ఖర్చవుతుంది. అదే కూలీకై తే రూ.800 రూ.1500) వరకు చెల్లించాల్సి వస్తుంది. రిమోట్ సాయంతో పనిచేసే ఈ డ్రోన్ల వల్ల పురుగు మందుల వృథా తగ్గడమే కాకుండా తగినంత ఎత్తు నుంచి పిచికారీ చేయడంతో సాగుకు సక్రమంగా మందు అందుతుంది. -
ఆర్ఈ/మ్యాక్స్‌తో హౌసింగ్‌డాట్‌కామ్ ఒప్పందం
న్యూఢిల్లీ: ప్రాపర్టీ పోర్టల్ హౌసింగ్‌డాట్‌కామ్ తాజాగా రియల్ ఎస్టేట్ బ్రోకరేజి సంస్థ ఆర్ఈ/ఎంఏఎక్స్తో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం ఆర్ఈ/ఎంఏఎక్స్ తమ దగ్గరున్న ప్రాపర్టీలను హౌసింగ్‌డాట్‌కామ్ సైటులో పొందుపరుస్తుంది. ప్రతిగా హౌసింగ్‌డాట్‌కామ్ సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాల్లో ఆర్ఈ/మ్యాక్స్‌కి కార్యకలాపాలు ఉన్నాయి. 6,500 కార్యాలయాలు.. 1,00,000 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉన్నారు. నచ్చిన ఇంటి అన్వేషణ నుంచి కొనుగోలుదాకా అన్ని అంశాల్లోనూ గృహ కొనుగోలుదారులకు అవసరమైన సేవలు అందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని హౌసింగ్‌డాట్‌కామ్ సీవోవో రిషభ్ గుప్తా, ఆర్ఈ/ఎంఏఎక్స్ ఇండియా చైర్మన్ శామ్ చోప్రా తెలిపారు.