
హౌసింగ్.కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా జాసన్ కొఠారి
న్యూఢిల్లీ: ప్రముఖ రియల్టీ పోర్టల్ హౌసింగ్.కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా జాసన్ కొఠారి నియమితులయ్యారు. గతంలో జాసన్ కొఠారి వాలియంట్ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈవోగా వ్యవహరించేవారు. ప్రస్తుతం ఆయన పలు స్టార్టప్స్‌కు పర్సనల్ ఇన్వెస్టర్‌గా కూడా ఉన్నారు. జాసన్ నియామకం వల్ల కంపెనీకి ఎంతో ప్రయోజనం కలుగుతుందని హౌసింగ్.కామ్ తాత్కాలిక సీఈవో రిషబ్ గుప్తా ధీమా వ్యక్తంచేశారు.