న్యూఢిల్లీ: ప్రాపర్టీటెక్నాలజీ (ప్రాప్‌టెక్) సంస్థల్లోకి గతేడాది పెట్టుబడుల ప్రవాహం స్వల్పంగా తగ్గింది. 3 శాతం క్షీణించి 719 మిలియన్ డాలర్లకు పరిమితమైంది. 2021లో ప్రాప్‌టెక్ సంస్థలు 742 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాయి. హౌసింగ్‌డాట్‌కామ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశి్చతులు నెలకొన్నప్పటికీ ప్రాప్‌టెక్ సంస్థల్లోకి పెట్టుబడుల రాక స్వల్పంగానే తగ్గినట్లు హౌసింగ్‌డాట్‌కామ్ గ్రూప్ సీఈవో ధృవ్ అగర్వాలా తెలిపారు.
గడిచిన దశాబ్ద కాలంలో, ముఖ్యంగా గత మూడేళ్లలో వినూత్న టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా పురోగమించిందని ఆయన పేర్కొన్నారు. కో-వర్కింగ్ విభాగం భారీగా విస్తరించిందని తెలిపారు. కోవిడ్-19 సమయంలో స్కూళ్లు, కాలేజీలు మూతబడటంతో తాత్కాలికంగా సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ విద్యా సంస్థలు, ఆఫీసులు తెరుచుకున్నా కో-లివింగ్ విభాగం చెప్పుకోతగ్గ స్థాయిలో కోలుకుందని అగర్వాలా పేర్కొన్నారు. నివేదిక ప్రకారం 2009లో ప్రాప్‌టెక్‌లో 0.2 మిలియన్ డాలర్లు రాగా.. 2020లో 551 మిలియన్ డాలర్లు వచ్చాయి. (భారీ లాభాల్లోకి ఇండిగో: ఆదాయంలోనూ కొత్త రికార్డ్)
వృద్ధికి మరింత అవకాశం..
దేశీయంగా ప్రాప్‌టెక్ ప్రస్తుతం తొలి దశల్లోనే ఉందని కానీ వృద్ధి చెందడానికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని కో-లివింగ్ సంస్థ సెటిల్ సహ వ్యవస్థాపకుడు అభిõÙక్ త్రిపాఠి చెప్పారు. రియల్ ఎస్టేట్‌కి సంబంధించి ప్రస్తుతం అన్ని దశల్లోనూ టెక్నాలజీ వినియోగం పెరిగిందని హౌసింగ్‌డాట్‌కామ్ రీసెర్చ్ విభాగం హెడ్ అంకిత సూద్ తెలిపారు. మరోవైపు అంతర్జాతీయంగా ఎకానమీల్లో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొనడంతో ఇన్వెస్టర్లు గత అనుభవాల రీత్యా కొంత కాలంగా డీల్స్ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని స్టార్టప్ సంస్థ రిలాయ్ వ్యవస్థాపకుడు అఖిల్ సరాఫ్ తెలిపారు. వ్యయాల భారం భారీగా ఉన్న స్టార్టప్‌లు సవాళ్లు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. (ఆన్‌లైన్ గేమింగ్: జీఎస్‌టీ కౌన్సిల్ కీలక నిర్ణయం)
రియల్టిలో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు డౌన్
రియల్ ఎస్టేట్‌లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు జూన్ త్రైమాసికంలో గణనీయంగా తగ్గాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలి్చనప్పుడు 41 శాతం క్షీణించి 1.6 బిలియన్ డాలర్లకు (రూ.13,120 కోట్లు) పరిమితమయ్యాయి. కానీ, ఈ ఏడాది మార్చి త్రైమాసికంతో పోలి్చచూసినప్పుడు 33 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఈ వివరాలను ప్రాపర్టీ కన్సల్టెంట్ ‘వెస్టియన్’ విడుదల చేసింది. జూన్ త్రైమాసికంలో వచ్చిన పెట్టుబడుల్లో ఎక్కువ శాతం విదేశీ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచే ఉన్నాయి.
92 శాతం పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లే సమకూర్చడం గమనార్హం. భారత వృద్ధి పట్ల విదేశీ ఇన్వెస్టర్లలో ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శమని వెస్టియన్ పేర్కొంది. క్రితం ఏడాది జూన్ త్రైమాసికంలో రియల్ ఎస్టేట్‌లోకి వచ్చిన ఇనిస్టిట్యూషనల్ పెట్టుబడులు 2.7 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఇవి 1.2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అనిశి్చత పరిస్థితుల్లోనూ భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ బలమైన పనితీరు చూపించినట్టు, మార్చి త్రైమాసికంతో పోలి్చనప్పుడు జూన్ క్వార్టర్‌లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరగడమే ఇందుకు నిదర్శమని వెస్టియన్ పేర్కొంది. (నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!)
రానున్న త్రైమాసికాల్లో బలమైన పనితీరు
జీడీపీ స్థిరమైన పనితీరు, పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇస్తున్న మద్దతుతో రానున్న త్రైమాసికాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో మరింత బలమైన పనితీరు సాధ్యపడుతుందని వెస్టియన్ సీఈవో శ్రీనివాస్‌రావు అభిప్రాయపడ్డారు. ఆఫీస్ స్పేస్, కోవర్కింగ్, రిటైల్, హోటల్స్ ప్రాజెక్టులు జూన్ త్రైమాసికంలో 88 శాతం పెట్టుబడులను ఆకర్షించాయి. ముఖ్యంగా క్రితం ఏడాది ఇదే కాలంలో పోలి్చనప్పుడు జూన్ క్వార్టర్‌లో వాణిజ్య రియల్ ఎసేŠట్ట్ ఆస్తుల్లోకి వచ్చిన సంస్థాగత పెట్టుబడులు 1.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇండ్రస్టియల్, వేర్ హౌసింగ్‌లో పెట్టుబడులు గణనీయంగా తగ్గి 134 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కానీ, క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ విభాగంలోకి వచి్చన పెట్టుబడులు బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం.
ప్రాప్‌టెక్ కంపెనీల్లోకి తగ్గిన నిధులు, రియల్టిలో పెట్టుబడులు ఢమాల్
Published Thu, Aug 3 2023 3:55 AM | Last Updated on Thu, Aug 3 2023 10:53 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment