హైదరాబాద్: రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడులకే ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్ మండలి నరెడ్కో సాయంతో హౌసింగ్ డాట్ కామ్ నిర్వహించిన సర్వేలో.. రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడికి మొదటి ప్రాధాన్యమిస్తామని 48 శాతం మంది తెలిపారు. ఆ తర్వాత 19 శాతం మంది డిపాజిట్లలో పెట్టుబడులు పెడతామని చెప్పగా, 18 శాతం మంది స్టాక్స్‌లో, 15 శాతం మంది బంగారానికి తమ ప్రాధాన్యమని తెలిపారు.
ముఖ్యంగా గడిచిన ఏడాదిన్నర కాలంలో గృహ రుణాలపై వడ్డీ రేట్లు గణనీయంగా పెరిగిపోయిన నేపథ్యంలో పన్ను ప్రోత్సాహకాలు క్పలించాలని, సులభతర చెల్లింపులకు అవకాశం కలి్పంచాలని కోరుకుంటున్నట్టు ఈ సర్వేలో తెలిసింది. అలాగే, డెవలపర్లు ఇచ్చే ఆఫర్లకూ మొగ్గు చూపిస్తున్నారు. సర్వేలోని వివరాలతో హౌసింగ్ డాట్ కామ్ ఒక నివేదికను విడుదల చేసింది.
స్టాంప్‌డ్యూటీ, జీఎస్‌టీ పరంగా రాయితీలు, సులభతర తిరిగి చెల్లింపుల ప్లాన్లు వచ్చే ఆరు నెలల్లో ఇళ్ల కొనుగోలుకు వినియోగదారులను ప్రేరేపించే అంశాలని ఈ సర్వే తెలిపింది. నిర్మాణంలో ఉన్న ఇళ్ల కంటే ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లకే వినియోగదారుల ప్రాధాన్యం పెరిగింది. మాడ్యులర్ కిచెన్‌లు, తాము కోరుకున్న విధంగా వుడ్ వర్క్ చేసి ఇవ్వడం కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో హౌసింగ్ డాట్ కామ్ ఈ సర్వే నిర్వహించింది.
సొంతిల్లుకు ప్రాధాన్యం..
‘‘చరిత్రను చూస్తే పెట్టుబడులకు రియల్ ఎస్టేట్ మూలస్తంభంగా ఉంటోంది. కరోనా మహమ్మారి దీని ప్రాధాన్యాన్ని మరింత పెంచింది. ఎంతో మందికి సొంతిల్లు ప్రాధాన్య లక్ష్యంగా మారిపోయింది. హైబ్రిడ్ పని నమూనాలు, భద్రత, రక్షణ అనేవి రియల్ ఎస్టేట్‌ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాయి’’అని హౌసింగ్ డాట్ కామ్ గ్రూప్ సీఈవో ధృవ్ అగర్వాల్ తెలిపారు. దశాబ్ద కాలం పాటు స్తబ్దత తర్వాత ఇటీవలి కాలంలో ఇళ్ల ధరలు పుంజుకుంటున్నట్టు చెప్పారు. గడిచిన ఏడాది కాలంలో రుణాలపై రేట్లు 2.5 శాతం పెరిగినప్పటికీ రియల్ ఎస్టేట్ మార్కెట్ బలంగా నిలబడినట్టు చెప్పారు.
పెంటప్ డిమాండ్‌కు తోడు, కొత్త డిమాండ్ ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు అగర్వాల్ వెల్లడించారు. ‘‘ఇటీవలి జీ20 సదస్సు ఆర్థిక వ్యవస్థను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది విధానాలు, పెట్టుబడుల పరంగా భారత రియల్ ఎస్టేట్ ముఖచిత్రాన్ని మార్చేస్తుంది. కరోనా సమయంతో పోలిస్తే వినియోగదారుల్లో విశ్వాసం మరింత పెరిగింది. 48 శాతం మందికి రియల్ ఎస్టేట్ ప్రాధాన్య పెట్టుబడిగా కొనసాగుతోంది. ప్రాపరీ్ట, వడ్డీ రేట్లు పెరగడంతో సమీప కాలంలో కొనుగోళ్లకు జీఎస్‌టీ, స్టాంప్ డ్యూటీ ఎత్తివేత కీలకంగా పనిచేస్తాయి’’అని నరెడ్కో ప్రెసిడెంట్ రాజన్ బండేల్కర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment