First priority
-
హసీనాను రప్పించడమే ప్రాథమ్యం
ఢాకా: భారత్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించడమే తమ తొలి ప్రాధాన్యత అని ఆ దేశ ప్రభుత్వం ఉద్ఘాటించింది. హసీనాను విచారించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తామని దేశ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి షఫీకుల్ ఆలం తెలిపారు. ‘‘హసీనా పార్టీ అవామీ లీగ్ భవితవ్యంపై నీడలు కమ్ముకున్నాయి. ఆ పార్టీ దేశ రాజకీయ ముఖచిత్రంలో ఉండాలా, వద్దా అనేది ప్రజలతో పాటు ఇతర పారీ్టలు నిర్ణయిస్తాయి. హత్యలు, అదృశ్యాలు, నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందే’’అని నొక్కి చెప్పారు. హసీనా ప్రభుత్వం మానవాళిపై నేరాలకు పాల్పడుతోందంటూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఇచ్చిన నివేదికను ఉదాహరించారు. ఈ నేపథ్యంలో హసీనాను అప్పగించే విషయమై భారత్‌పై ఒత్తిడి పెరిగిందన్నారు. యూనస్‌కు శిక్ష తప్పదు: హసీనా మహమ్మద్ యూనస్ బంగ్లాలో అరాచకాలకు పాల్పడుతున్నారని హసీనా ఆరోపించారు. ‘‘నన్ను అధికారానికి దూరం చేసే కుట్రలో భాగంగానే హత్యలకు పాల్పడ్డారు. అందుకు కారణమైన ‘దుండగుడు’యూనస్‌ను, ఇతరులను బంగ్లా గడ్డపై శిక్షిస్తా’’అని ప్రతినబూనారు. జూలై తిరుగుబాటులో మరణించిన పోలీసుల కుటుంబాలతో ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె వర్చువల్‌గా పాల్గొన్నారు. మృతుల భార్యలతో ముఖాముఖి మాట్లాడారు. యూనస్ వచ్చాక గతంలో ఎన్నడూ లేనంతగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. 2024 తిరుగుబాటు నేపథ్యంలో తన ప్రభుత్వం కుప్పకూలడంతో హసీనా భారత్‌కు పారిపోయి వచ్చి ఆశ్రయం పొందుతుండటం తెలిసిందే. ‘‘విచారణ కమిటీలన్నింటినీ యూనస్ రద్దు చేశారు. ప్రజలను చంపడానికి ఉగ్రవాదులను మధ్యంతర ప్రభుత్వం విడుదల చేసింది. వారు బంగ్లాను నాశనం చేస్తున్నారు. హత్యాయత్నం నుంచి నేను త్రుటిలో తప్పించుకున్నా. ఏదో మంచి చేయడానికే దేవుడు నన్ను బతికించాడని భావిస్తున్నా. నేను బంగ్లా తిరిగొచ్చాక సమస్యలన్నీ పరిష్కరిస్తా’’ఆమె ప్రకటించారు. -
పీపుల్స్ సీఎం..అధికారాన్ని బాధ్యతగా స్వీకరించిన జగన్
-
రియల్ ఎస్టేట్‌కే అధిక ప్రాధాన్యం
హైదరాబాద్: రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడులకే ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్ మండలి నరెడ్కో సాయంతో హౌసింగ్ డాట్ కామ్ నిర్వహించిన సర్వేలో.. రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడికి మొదటి ప్రాధాన్యమిస్తామని 48 శాతం మంది తెలిపారు. ఆ తర్వాత 19 శాతం మంది డిపాజిట్లలో పెట్టుబడులు పెడతామని చెప్పగా, 18 శాతం మంది స్టాక్స్‌లో, 15 శాతం మంది బంగారానికి తమ ప్రాధాన్యమని తెలిపారు. ముఖ్యంగా గడిచిన ఏడాదిన్నర కాలంలో గృహ రుణాలపై వడ్డీ రేట్లు గణనీయంగా పెరిగిపోయిన నేపథ్యంలో పన్ను ప్రోత్సాహకాలు క్పలించాలని, సులభతర చెల్లింపులకు అవకాశం కలి్పంచాలని కోరుకుంటున్నట్టు ఈ సర్వేలో తెలిసింది. అలాగే, డెవలపర్లు ఇచ్చే ఆఫర్లకూ మొగ్గు చూపిస్తున్నారు. సర్వేలోని వివరాలతో హౌసింగ్ డాట్ కామ్ ఒక నివేదికను విడుదల చేసింది. స్టాంప్‌డ్యూటీ, జీఎస్టీ పరంగా రాయితీలు, సులభతర తిరిగి చెల్లింపుల ప్లాన్లు వచ్చే ఆరు నెలల్లో ఇళ్ల కొనుగోలుకు వినియోగదారులను ప్రేరేపించే అంశాలని ఈ సర్వే తెలిపింది. నిర్మాణంలో ఉన్న ఇళ్ల కంటే ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లకే వినియోగదారుల ప్రాధాన్యం పెరిగింది. మాడ్యులర్ కిచెన్లు, తాము కోరుకున్న విధంగా వుడ్ వర్క్ చేసి ఇవ్వడం కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో హౌసింగ్ డాట్ కామ్ ఈ సర్వే నిర్వహించింది. సొంతిల్లుకు ప్రాధాన్యం.. ‘‘చరిత్రను చూస్తే పెట్టుబడులకు రియల్ ఎస్టేట్ మూలస్తంభంగా ఉంటోంది. కరోనా మహమ్మారి దీని ప్రాధాన్యాన్ని మరింత పెంచింది. ఎంతో మందికి సొంతిల్లు ప్రాధాన్య లక్ష్యంగా మారిపోయింది. హైబ్రిడ్ పని నమూనాలు, భద్రత, రక్షణ అనేవి రియల్ ఎస్టేట్‌ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాయి’’అని హౌసింగ్ డాట్ కామ్ గ్రూప్ సీఈవో ధృవ్ అగర్వాల్ తెలిపారు. దశాబ్ద కాలం పాటు స్తబ్దత తర్వాత ఇటీవలి కాలంలో ఇళ్ల ధరలు పుంజుకుంటున్నట్టు చెప్పారు. గడిచిన ఏడాది కాలంలో రుణాలపై రేట్లు 2.5 శాతం పెరిగినప్పటికీ రియల్ ఎస్టేట్ మార్కెట్ బలంగా నిలబడినట్టు చెప్పారు. పెంటప్ డిమాండ్‌కు తోడు, కొత్త డిమాండ్ ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు అగర్వాల్ వెల్లడించారు. ‘‘ఇటీవలి జీ20 సదస్సు ఆర్థిక వ్యవస్థను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది విధానాలు, పెట్టుబడుల పరంగా భారత రియల్ ఎస్టేట్ ముఖచిత్రాన్ని మార్చేస్తుంది. కరోనా సమయంతో పోలిస్తే వినియోగదారుల్లో విశ్వాసం మరింత పెరిగింది. 48 శాతం మందికి రియల్ ఎస్టేట్ ప్రాధాన్య పెట్టుబడిగా కొనసాగుతోంది. ప్రాపరీ్ట, వడ్డీ రేట్లు పెరగడంతో సమీప కాలంలో కొనుగోళ్లకు జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ ఎత్తివేత కీలకంగా పనిచేస్తాయి’’అని నరెడ్కో ప్రెసిడెంట్ రాజన్ బండేల్కర్ పేర్కొన్నారు. -
ప్రథమ ప్రాధాన్య ఓట్లపైనే దృష్టి
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. సభలు, సమావేశాలే కాకుండా క్షేత్రస్థాయిలోని ప్రతి ఓటర్ను కలిసేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. అనుబంధ సంఘాల కార్యకర్తలను క్షేత్రస్థాయికి పంపి మరీ గ్రాడ్యుయేట్ ఓట్లను బీజేపీ అభ్యర్థులకు ఎక్కువ మొత్తంలో పడేలా ప్రణాళికలు రూపొందించుకుంది. ముఖ్యంగా ప్రథమ ప్రాధాన్య ఓట్లు రాబట్టుకోవడమే లక్ష్యంగా విస్తృత ప్రచారం చేస్తోంది. రంగంలోకి సంఘ్ పరివార్.. బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆ పార్టీ అనుబంధ సంఘాలూ రంగంలోకి దిగాయి. చాపకింద నీరులా సంఘ్‌పరివార్ ప్రచారం నిర్వహి స్తోంది. ఇప్పటికే 25 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని కమలం పార్టీ నియమించింది. ఇటు నియోజకవర్గాల వారీగా ఇప్పటికే సమావేశాలను పూర్తి చేసుకున్న ఆ పార్టీ.. మేధావుల సదస్సులను నిర్వహిస్తోంది. లాయర్లు, డాక్టర్లు ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నేతలు విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఇక సంఘ్ పరివార్ నేతలు పోలింగ్ బూత్‌ల వారీగా సమీక్షలతో పాటు క్షేత్రస్థాయిలో ఓటర్లకు టచ్‌లో ఉంటూ ప్రథమ ప్రాధాన్య ఓట్లను రాబట్టుకునేలా ప్రచారం చేస్తున్నారు. అవే ప్రధాన అస్త్రాలుగా.. ప్రస్తుతమున్న సిట్టింగ్ స్థానంతో పాటు మరో ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేలా కమలనాథులు ఎప్పటికప్పుడు ప్రచార ప్రణాళికలను అమలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల్లో వ్యతిరేకత అంశాలనే ప్రధాన ప్రచారాస్త్రాలుగా చేసుకొని బీజేపీ ముందుకెళ్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జి తరుణ్ చుగ్, ఇతర ముఖ్య నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. మరోవైపు కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, రమేశ్ పోఖ్రియాల్ ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. మరికొందరు జాతీయ స్థాయి నేతలు కూడా రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్‌ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, టీఆర్ఎస్ అభ్యర్థులనే తమ ప్రత్యర్థులుగా చూస్తూ బీజేపీ ప్రచారం చేస్తోంది. ఉద్యోగులు, నిరుద్యోగులు ఏ వర్గం వారూ టీఆర్ఎస్ పాలనలో సంతోషంగా లేరని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇటు పెట్రోల్ ధరల పెంపు అంశాన్ని టీఆర్ఎస్ నేతలు ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలకు బీజేపీ సోషల్ మీడియా విభాగం గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. గత ప్రభుత్వాల కారణంగానే ధరల పెరుగుదల తప్పడం లేదని చెబుతోంది. తమపై విమర్శలు చేసే ముందుకు పెట్రోల్ ధరల పెంపుతో రాష్ట్రానికి వచ్చే వ్యాట్ (పన్నులు) ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నిస్తోంది. -
ప్రథమ ప్రాధాన్యత ఓటుతోనే గెలవాలి
సాక్షి, హైదరాబాద్: ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలో ప్రచార పరంగా ఇతరులతో పోలిస్తే మనం ముందంజలో ఉన్నాం. అయితే కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా, అలసత్వానికి తావు లేకుండా మరింత లోతుగా పార్టీ వ్యూహం, ప్రణాళికను అమలు చేయండి. ప్రథమ ప్రాధాన్యత ఓటుతోనే మనం గెలుపొందాలి. పోలింగ్‌కు కేవలం 14 రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందున ప్రతి ఓటరును కలిసేలా పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయండి..’అని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉమ్మడి మూడు జిల్లాల పరిధిలోని మంత్రులు, ప్రభుత్వ చీఫ్ విప్‌లు, విప్‌లను ఆదేశించారు. ఆదివారం ప్రగతి భవన్లో వరంగల్– ఖమ్మం– నల్లగొండ’పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచార తీరుతెన్నులపై ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్‌లు బోడకుంటి వెంకటేశ్వర్లు, దాస్యం వినయ్ భాస్కర్, విప్ గొంగిడి సునీత, రేగ కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్.. పోలింగ్ తేదీ వరకు అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. చివరి నిమిషం వరకు అప్రమత్తంగా ఉండాలి ‘సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల ఎన్నికలు కొంత భిన్నంగా ఉంటాయి. ప్రతి ఓటరును కలిసి మన ఎజెండాను వివరించడంతో పాటు పోలింగ్‌లో పాల్గొనేలా కార్యాచరణ సిద్ధం చేసుకోండి. గతంలో దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కొంత అతి విశ్వాసంతో వెళ్లడంతో నష్టం జరిగింది. ఈసారి అది పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఓటర్లతో చివరి నిమిషం వరకు మమేకం కావాలి. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉన్నా వారి ప్రభావం పెద్దగా లేదు. ఇతర అభ్యర్ధుల్లో ఒకరిద్దరి పట్ల ఓటర్లలో కొంత సానుభూతి ఉన్నా వారికి క్షేత్ర స్థాయిలో యంత్రాంగం లేదు. 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 30 చోట్ల్ల మన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నందున పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ చివరి నిమిషం వరకు అప్రమత్తంగా వ్యవహరించాలి..’అని కేసీఆర్ సూచించారు. 50 శాతానికి పైగా ఓట్లు సాధించాలి ‘ఈ నియోజకవర్గంలో 5 లక్షల పైచిలుకు పట్టభద్ర ఓటర్లు ఉండగా, ఇందులో సుమారు 3 లక్షల మందిని మన పార్టీ యంత్రాంగం ద్వారా నమోదు చేశాం. పోలయ్యే ఓట్లలో 50%కి పైగా ఓట్లు మన అభ్యర్థి సాధించేలా క్షేత్ర స్థాయిలో శ్రమించాలి. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే పార్టీ అభ్యర్థి విజయం సాధించేలా పనిచేయండి. క్షేత్ర స్థాయిలో పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఇతర క్రియాశీల నేతలు, కార్యకర్తలు అందరినీ ప్రచారంలో భాగస్వాములను చేయాలి’అని ముఖ్యమంత్రి చెప్పారు. షెడ్యూల్ వెలువడిన తర్వాత సాగర్‌పై చర్చ! నాగార్జునసాగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడిన తర్వాత మరోమారు సమావేశమవుదామని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. పట్టభద్రుల ఎన్నికకు సంబంధించిన సమావేశం ముగిసిన తర్వాత నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, విప్ గొంగిడి సునీతతో పాటు మరో ఇద్దరు ముఖ్య నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. అయితే సాగర్ ఉప ఎన్నికపై లోతైన చర్చ జరగలేదని, ఆ నియోజకవర్గం పరిధిలో పట్టభద్రుల ఎన్నికతో పాటు ఉప ఎన్నికను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రచారం కొనసాగించాలని సూచించినట్లు తెలిసింది. -
మొబైల్స్‌దే మెజారిటీ వాటా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లో ఈ–కామర్స్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇద్దరు వినియోగదార్లలో ఒకరు తొలిసారిగా ఆన్లైన్ వేదికగా వస్తువులను కొనుగోలు చేస్తున్నవారే. ఈ ఏడాది మే–జూలైతో పోలిస్తే ఆగస్టు–అక్టోబరులో మొత్తం కస్టమర్లలో వీరి శాతం అత్యధికంగా 56 శాతానికి చేరుకుందని నీల్సన్ నివేదిక చెబుతోంది. 10 లక్షలకుపైగా జనాభా కలిగిన 52 నగరాల్లోని 1,90,000 మంది ఆన్లైన్ కస్టమర్ల షాపింగ్ తీరును ఈ నివేదికలో వివరించింది. కొత్త కస్టమర్లకు మొబైల్స్ తొలి ప్రాధాన్యతగా నిలిచింది. 28 సెప్టెంబరు–25 అక్టోబరు మధ్య ఫెస్టివ్ పీరియడ్‌లో వీరు ఖర్చు చేసిన మొత్తం విలువలో మొబైల్స్ వాటా ఏకంగా 53% ఉంది. అధిక ఆర్డర్లు ఎఫ్ఎంసీజీలో.. 2019 మే–ఆగస్టు కాలంలో జరిగిన షాపింగ్‌లో విలువ పరంగా మొబైల్స్ 48 శాతం, ఫ్యాషన్ 16 శాతం కైవసం చేసుకున్నాయి. ఇక అత్యధిక ఆర్డర్లు (పరిమాణం) ఎఫ్ఎంసీజీ విభాగంలో 56 శాతం చోటుచేసుకోవడం విశేషం. ఎఫ్ఎంసీజీలో ఎక్కువ ఆర్డర్లు 50 లక్షలు ఆపై జనాభా ఉన్న మెట్రో నగరాల నుంచే వస్తున్నాయి. 50 లక్షల లోపు జనాభా ఉన్న ప్రథమ శ్రేణి నగరాల నుంచి మొబైల్ ఫోన్ల కోసం 50 శాతం ఆర్డర్లు వస్తే.. మెట్రోల నుంచి ఇది 38 శాతంగా ఉంది. ఆన్లైన్ ఫ్యాషన్ విభాగంలో మే–అక్టోబరు మధ్య నాలుగింట మూడు భాగాలు దుస్తులు, పాదరక్షలు ఉన్నాయి. షాపింగ్ రాత్రిపూటే.. మొబైల్స్ తర్వాత ఫ్యాషన్, టీవీలు, ఎలక్ట్రానిక్స్ వంటివి కొనుగోలు చేస్తున్నారు. కొనుగోళ్ల విషయంలో రెండు, మూడవసారి మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్‌కు నూతన వినియోగదార్లు మొగ్గు చూపుతున్నారు. ఫెస్టివల్ సీజన్లో ప్రైమ్ టైంలో అంటే రాత్రి 8–11 గంటల మధ్య అత్యధికంగా 23 శాతం షాపింగ్ జరిగింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు 17 శాతం షాపింగ్ నమోదైంది. పండుగల సమయంలో మూడు నాలుగు రెట్ల అమ్మకాలు జరిగాయి. ఇండిపెండెన్స్ డే సేల్ తర్వాత సాధారణంగా నమోదైన విక్రయాలు తిరిగి ఫెస్టివ్ పీరియడ్ వచ్చే సరికి అనూహ్యంగా ఎగబాకాయి. 28 సెప్టెంబరుతో మొదలైన ఫెస్టివ్ సీజన్ తొలి వారంలో 43 శాతం సేల్స్ జరిగాయి. -
మల్టీ కెమెరా స్మార్ట్ఫోన్ల హవా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మంచి కెమెరా, పెద్ద స్క్రీన్, అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీ, ర్యామ్.. ఇవీ ఇటీవలి కాలం వరకు స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల తొలి ప్రాధాన్యతలు. ఇప్పుడీ ట్రెండ్ మారిపోయింది. సామాజిక మాధ్యమాల పుణ్యమాని అత్యాధునిక పాప్–అప్, మల్టీ కెమెరా స్మార్ట్ఫోనే వినియోగదారుల ఏకైక డిమాండ్‌గా నిలుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకేవైపు నాలుగు కెమెరాలున్న మోడళ్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి చేరాయి. ఇటీవలే అయిదు కెమెరాలతో నోకియా 9 ప్యూర్‌వ్యూ ఫోన్‌ను తీసుకొచ్చింది. 64 మెగా పిక్సెల్ కెమెరాతో కూడిన ఫోన్లు కొద్ది రోజుల్లో కస్టమర్ల చేతుల్లో క్లిక్‌మనిపించనున్నాయి. కెమెరాను కేంద్రంగా చేసుకునే మోడళ్ల రూపకల్పనలో కంపెనీలు నిమగ్నమవడం ఇక్కడ గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో కెమెరా టెక్నాలజీతోనే కంపెనీలు తమ ప్రత్యేకతను చాటుకోవాల్సిందేనని జర్మనీకి చెందిన ఆప్టికల్స్ తయారీ దిగ్గజం జాయిస్ సీఈవో మైఖేల్ కాష్‌కే స్పష్టం చేశారు. కెమెరాల సామర్థ్యం పెరగడంతో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జోరు మీదున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మారుతున్న కంపెనీల ధోరణి.. స్మార్ట్ఫోన్ల డిజైన్, ఫీచర్ల విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి. స్క్రీన్కు ఆనుకుని చుట్టుపక్కల ఉండే ప్లాస్టిక్, మెటల్‌తో కూడిన బెజెల్ తగ్గుతూ వచ్చింది. బెజెల్ లెస్ మోడళ్ల రాకతో డిస్ప్లే సైజు పెరిగింది. ర్యామ్ సామర్థ్యం 12 జీబీకి, ఇంటర్నల్ మెమరీ 256 జీబీ వరకు చేరింది. బ్యాటరీ పవర్ 5,000 ఎంఏహెచ్ దాటింది. 4కే (యూహెచ్డీ) స్క్రీన్, డెకాకోర్ ప్రాసెసర్, వైర్లెస్ చార్జింగ్ మోడళ్లూ వచ్చి చేరాయి. ఇన్ని మార్పులు వచ్చినప్పటికీ వినియోగదార్ల ప్రాధాన్యత మాత్రం కెమెరాకేనని ‘బిగ్ సి’ మొబైల్స్ సీఎండీ ఎం.బాలు చౌదరి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కంపెనీలు పోటీపడీ మరీ లెన్స్‌పై దృష్టిసారిస్తున్నాయి. అధిక మెగా పిక్సెల్‌తోపాటు మల్టిపుల్ కెమెరాల రాక అధికమైంది అని వివరించారు. మల్టిపుల్ లెన్స్ కెమెరాలు, లార్జ్ సైజ్ ఇమేజ్ సెన్సార్ల అమ్మకాల జోరుతో జపాన్‌కు చెందిన టెక్నాలజీ దిగ్గజం సోనీ కార్పొరేషన్ జూన్ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో రూ.14,490 కోట్ల నిర్వహణ లాభాలను ఆర్జించింది. ఈ మొత్తం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 18.4%అధికంగా ఉందంటే ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. మల్టీ కెమెరాలకే మొగ్గు.. ప్రపంచ స్మార్ట్‌ఫోన్ రంగంలో మల్టీ కెమెరాలు ఇప్పుడు సందడి చేస్తున్నాయి. బెజెల్ లేకుండా పూర్తి డిస్ప్లేతో ఫోన్లను అందించేందుకు పాప్–అప్ సెల్ఫీ కెమెరాలతో మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆప్టికల్ జూమ్, ఫాస్ట్ ఆటో ఫోకస్, వైడ్ యాంగిల్ వంటి ఫీచర్లతో ఇవి రంగ ప్రవేశం చేస్తున్నాయి. ఇక వెనుకవైపు రెండింటితో మొదలై అయిదు కెమెరాల స్థాయికి వచ్చిందంటే ట్రెండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ‘ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్‌లలో అందమైన ఫొటోలను పోస్ట్ చేసేందుకు కస్టమర్లు పాప్–అప్‌తోపాటు వెనుకవైపు మూడు, నాలుగు కెమెరాలున్న ఫోన్లు కోరుకుంటున్నారు. పాప్–అప్ కెమెరా మోడల్ ఇప్పుడు రూ.18 వేలకూ లభిస్తోంది’ అని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ తెలిపారు. వివిధ కంపెనీల నుంచి క్వాడ్, ట్రిపుల్ కెమెరా మోడళ్లు 90 వరకు ఉంటాయి. 48 మెగాపిక్సెల్‌తో ప్రధాన కెమెరా ఉన్న మోడళ్లు 60 దాకా ఉన్నాయి. వీటిలో చాలామటుకు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి చేరాయి. 48 ఎంపీతో కూడిన డ్యూయల్ ఫ్రంట్ కెమెరా ఫోన్లూ వచ్చి చేరాయి. 48 ఎంపీ రొటేటింగ్ పాప్–అప్ కెమెరాతో సామ్సంగ్ గెలాక్సీ ఏ80ని ఆవిష్కరించింది. 64 ఎంపీ ప్రధాన కెమెరాతో షావొమీ, రియల్మీ త్వరలో రంగంలోకి దిగుతున్నాయి. దేశంలో 2019లో 15–16 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా. -
తెలంగాణ అభివృద్ధికే తొలి ప్రాధాన్యం: దత్తాత్రేయ
-
తెలంగాణ అభివృద్ధికే తొలి ప్రాధాన్యం: దత్తాత్రేయ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్దికే తాను మొదటి ప్రాధాన్యమిస్తానని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. శ్రమయేవ జయతే పథకంతో కార్మికులకు న్యాయం చేస్తామని, కార్మికుల సంక్షేమ పథకాలు నేరుగా అందించే ప్రయత్నం చేస్తామని దత్తాత్రేయ చెప్పారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. మెట్రో రైలు తన కలల ప్రాజెక్ట్ అని అన్నారు. తెలంగాణలో బీడీ కార్మికుల గృహనిర్మాణానికి లక్ష రూపాయలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటానని దత్తాత్రేయ చెప్పారు. -
‘ఆధార్’ అనుసంధానానికే తొలి ప్రాధాన్యం
విజయనగరం అర్బన్:పింఛన్‌దారులకు అర్హత కోసం ఆధార్ కార్డుల అనుసంధాన ప్రక్రియకు ప్రాధాన్యం ఇచ్చి, వచ్చేనెల నుంచి అర్హులను చేయాలని సెర్ప్ రాష్ట్ర అధికారి మురళి పిలుపునిచ్చారు. ఎంపీడీఓలు, ఐకేపీ మండల స్థాయి సిబ్బందితో డీఆర్డీఏ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చేనెల నుంచి పింఛన్‌దారులకు ఇచ్చే పింఛన్ సొమ్ము పెంచుతున్న నేపథ్యంలో అర్హులకు మాత్రమే అందాలనే లక్ష్యంతో ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలనే నిబంధనను తీసుకొచ్చామని తెలిపారు. వివిధ రకాల పింఛన్ లబ్ధిదారులకు అవగాహన పరిచి ఈ నెల 15వ తేదీలోగా ఆధార్ అనుసంధానం చేయించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. నెలాఖరులోగా అనుసంధానం కాకపోతే వచ్చేనెల నుంచి పింఛన్ ఆగి పోతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని వి ధుల్లో ఈ ప్రక్రియకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. డీఆర్డీఏ పీడీ జ్యోతి మాట్లాడుతూ జాతీయ సాంఘిక భద్రతా పింఛను పథకం ద్వారా వివిధ వర్గాలకు చెందిన 2.78 లక్షల మంది లబ్ధిదారులకు జిల్లాలో పింఛన్ అందుతోందని చెప్పారు. వీరిలో తాజాగా 1.37 లక్షల మంది వరకు ఆధార్ అనుసంధానం చేసుకున్నారని, మిగిలిన వారిని కూడా వారం రోజుల్లో చేర్పించే విధంగా అందరూ కృషిచేయాలని కోరారు. ప్రత్యేకించి మండల, ఈ-సేవాకేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఆధార్‌కార్డుల పంపిణీ విభాగాల్లో సంబంధిత పింఛన్‌దారులకు తొలి ప్రాధాన్యం ఇచ్చి ఆధార్‌కార్డులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. కార్యక్రమంలో డీఆర్డీఏ అధికారులు ప్రసాద్, సుధాకర్, ఎంపీడీఓలు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. -
అభివృద్ధిలో తొలిప్రాధాన్యం పాలమూరుకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధిలో మహబూబ్‌నగర్ జిల్లాకు మొదటి ప్రాధాన్యం ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. బడ్జెట్లో ఈ జిల్లా అభివృద్ధికి *1500 నుంచి *2 వేల కోట్ల నిధులను కేటాయించాలని భావిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటీని పూర్తి చేయడంతోపాటు జూరాల-పాకాల ప్రాజెక్టునూ నిర్మిస్తానని తద్వారా 6.2 ల క్షల ఎకరాలకు కొత్తగా సాగునీరివ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. చిన్న నీటిపారుదల అభివృద్ధి కోసం ఒక్కో నియోజకవర్గానికి * 15 కోట్లు వెచ్చిస్తామన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేల గౌరవాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో నివాస, అధికార కార్యకలాపాలకు ఎమ్మెల్యేలకు భవనాలు నిర్మిస్తామన్నారు. ఈ మేరకు స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు లేఖ రాసినట్టు చెప్పారు. మాజీ మంత్రి డీకే అరుణ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్యేలు వంశీచంద్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, సంపత్ సోమవారం సచివాలయంలో కేసీఆర్‌ను కలిశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిన తరువాతే జూరాల-పాకాల ప్రాజెక్టు పనులు చేపట్టాలని, గద్వాలలో థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని, జిల్లాల పునర్విభజనలో భాగంగా గద్వాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. థర్మల్ పవర్ ప్లాంట్ మినహా మిగతా అంశాలపై ఆయన సానుకూలంగా స్పందించారు.