తెలంగాణ అభివృద్ధికే తొలి ప్రాధాన్యం: దత్తాత్రేయ | telangana-development-is-my-first-priority-says-bandaru-dattatreya | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 16 2014 5:11 PM | Last Updated on Thu, Mar 21 2024 6:38 PM

తెలంగాణ రాష్ట్ర అభివృద్దికే తాను మొదటి ప్రాధాన్యమిస్తానని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. శ్రమయేవ జయతే పథకంతో కార్మికులకు న్యాయం చేస్తామని, కార్మికుల సంక్షేమ పథకాలు నేరుగా అందించే ప్రయత్నం చేస్తామని దత్తాత్రేయ చెప్పారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. మెట్రో రైలు తన కలల ప్రాజెక్ట్ అని అన్నారు. తెలంగాణలో బీడీ కార్మికుల గృహనిర్మాణానికి లక్ష రూపాయలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటానని దత్తాత్రేయ చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement