
‘ఆధార్’ అనుసంధానానికే తొలి ప్రాధాన్యం
విజయనగరం అర్బన్:పింఛన్‌దారులకు అర్హత కోసం ఆధార్ కార్డుల అనుసంధాన ప్రక్రియకు ప్రాధాన్యం ఇచ్చి, వచ్చేనెల నుంచి అర్హులను చేయాలని సెర్ప్ రాష్ట్ర అధికారి మురళి పిలుపునిచ్చారు. ఎంపీడీఓలు, ఐకేపీ మండల స్థాయి సిబ్బందితో డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చేనెల నుంచి పింఛన్‌దారులకు ఇచ్చే పింఛన్ సొమ్ము పెంచుతున్న నేపథ్యంలో అర్హులకు మాత్రమే అందాలనే లక్ష్యంతో ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలనే నిబంధనను తీసుకొచ్చామని తెలిపారు.
వివిధ రకాల పింఛన్ లబ్ధిదారులకు అవగాహన పరిచి ఈ నెల 15వ తేదీలోగా ఆధార్ అనుసంధానం చేయించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. నెలాఖరులోగా అనుసంధానం కాకపోతే వచ్చేనెల నుంచి పింఛన్ ఆగి పోతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని వి ధుల్లో ఈ ప్రక్రియకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. డీఆర్‌డీఏ పీడీ జ్యోతి మాట్లాడుతూ జాతీయ సాంఘిక భద్రతా పింఛను పథకం ద్వారా వివిధ వర్గాలకు చెందిన 2.78 లక్షల మంది లబ్ధిదారులకు జిల్లాలో పింఛన్ అందుతోందని చెప్పారు.
వీరిలో తాజాగా 1.37 లక్షల మంది వరకు ఆధార్ అనుసంధానం చేసుకున్నారని, మిగిలిన వారిని కూడా వారం రోజుల్లో చేర్పించే విధంగా అందరూ కృషిచేయాలని కోరారు. ప్రత్యేకించి మండల, ఈ-సేవాకేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఆధార్‌కార్డుల పంపిణీ విభాగాల్లో సంబంధిత పింఛన్‌దారులకు తొలి ప్రాధాన్యం ఇచ్చి ఆధార్‌కార్డులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ అధికారులు ప్రసాద్, సుధాకర్, ఎంపీడీఓలు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.