ఫ్రీ చార్జ్ సీఈవో ఈయనే
న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజం స్నాప్ డీల్ అనుబంధ సంస్థ ప్రీ చార్జ్ సీఈవో నియామకాన్ని చేపట్టింది. మాజీ రియల్ ఎస్టేట్ పోర్టల్ హౌసింగ్ .కామ్ ఎగ్జిక్యూటివ్ జాసన్ కొఠారి కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇటీవల ఈ పదవికి గోవింద్ రాజన్ రాజీనామా చేయడంతో కంపెనీ ఈ నియామకాన్ని చేపట్టింది.
జాసన్‌ను సీఈవోగా ఎంపిక చేయడం ఆనందంగాఉందని స్పాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ బాల్ తెలిపారు. ఆయన ఒక బలమైన వ్యూహాత్మక మరియు బహుముఖ వ్యాపార నాయకుడని, ఇప్పటికే రెండు విజయవంతమైన సంస్థలకు సీఈవోగా, వ్యాపారవేత్తగా ఉన్నారని కొనియాడారు. సంస్థలో మరో 20 మిలియన్ డాలర్లు పెట్టేందుకు యోచిస్తున్నట్టు స్నాప్‌డీల్ ప్రకటించింది.
మరోవైపు భారతదేశ డిజిటల్ చెల్లింపుల విప్లవం లో ఫ్రీఛార్జ్ సంస్థ ఒక కీలక పాత్ర పోషించనుందని కొఠారి అంచనా వేశారు. డిజిటల్ పరిశ్రమ 2025 నాటికి 1 ట్రిలియన్ డాలర్లను సాధిస్తుందని తెలిపారు.
కాగా 2015 ఆగష్టులో ప్రీ చార్జ్ సీఈఓగా గోవిందరాజన్ బాధ్యతలను స్వీకరించారు. దాదాపుగా ఏడాదిన్నర పాటు ఆయన విశేష సేవలను అందించారు. ప్రధాన ప్రత్యర్థి అమెజాన్ నుంచి గట్టిపోటీతోపాటు సాఫ్ట్ బ్యాంక్ పెట్టుబడులను ఉపసంహరించు కోవడం ఫ్రీచార్జ్ ఇబ్బందుల్లో పడింది. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా పెట్టుబడుల కొరత తీవ్రత కారణంగా 2016 మార్చి నాటికి రూ. 235 కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. అయితే ఈ ఏడాది జనవరిలో గోవింద రాజన్ రాజీనామా చేయడంతొ ఆయన స్థానంలో నూతన సిఈఓగా జాసన్ కొఠారిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.