న్యూఢిల్లీ: ప్రాపర్టీటెక్ కంపెనీ హౌసింగ్.కామ్ కస్టమర్లకు క్రెడిట్‌పై అద్దె చెల్లించే సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు ఫిన్‌టెక్ సంస్థ నీరోతో చేతులు కలిపింది. వెరసి కస్టమర్లకు ప్రస్తుతం అద్దె చెల్లించు– తదుపరి దశలో తిరిగి చెల్లించు(రెంట్ నౌ పే లేటర్– ఆర్‌ఎన్‌పీఎల్) సేవలను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం పలు ఫిన్‌టెక్ కంపెనీలు క్రెడిట్ కార్డుల తరహాలో ప్రస్తుత కొనుగోలుకి తరువాత చెల్లింపు(బయ్ నౌ పే లేటర్– బీపీఎన్‌ఎల్) సర్వీసులు అందిస్తున్న సంగతి తెలిసిందే.
బెంగళూరు సంస్థ నీరోతో ఒప్పందం ద్వారా ఆస్ట్రేలియన్ కంపెనీ ఆర్‌ఈఏలో భాగమైన హౌసింగ్.కామ్ కస్టమర్లకు తాజాగా ఆర్‌ఎన్‌పీఎల్ సేవలను ప్రారంభించింది. దీంతో కస్టమర్లకు ఎలాంటి కన్వినెన్స్ ఫీజు లేకుండా 40 రోజుల క్రెడిట్ ద్వారా అద్దెను చెల్లించేందుకు వీలు కల్పిస్తోంది. అంతేకాకుండా అద్దె చెల్లింపులను అవసరమైతే కస్టమర్లు సులభ వాయిదా పద్ధతి(ఈఎంఐ)లోకి మార్పిడి చేసుకునేందుకు అవకాశమున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. దేశీయంగా 4 శాతం ప్రజలకే క్రెడిట్ కార్డులున్నందున రెంట్ నౌ పే లేటర్ సర్వీసు వినియోగదారులకు ప్రయోజనకరంగా నిలవనున్నట్లు వివరించింది. హౌసింగ్.కామ్ ఇప్పటికే క్రెడిట్ కార్డుల ద్వారా అద్దె చెల్లింపులకు తెరతీసిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment