nero
-
క్రెడిట్‌పై అద్దె చెల్లించవచ్చు
న్యూఢిల్లీ: ప్రాపర్టీటెక్ కంపెనీ హౌసింగ్.కామ్ కస్టమర్లకు క్రెడిట్‌పై అద్దె చెల్లించే సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు ఫిన్‌టెక్ సంస్థ నీరోతో చేతులు కలిపింది. వెరసి కస్టమర్లకు ప్రస్తుతం అద్దె చెల్లించు– తదుపరి దశలో తిరిగి చెల్లించు(రెంట్ నౌ పే లేటర్– ఆర్ఎన్పీఎల్) సేవలను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం పలు ఫిన్‌టెక్ కంపెనీలు క్రెడిట్ కార్డుల తరహాలో ప్రస్తుత కొనుగోలుకి తరువాత చెల్లింపు(బయ్ నౌ పే లేటర్– బీపీఎన్ఎల్) సర్వీసులు అందిస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరు సంస్థ నీరోతో ఒప్పందం ద్వారా ఆస్ట్రేలియన్ కంపెనీ ఆర్ఈఏలో భాగమైన హౌసింగ్.కామ్ కస్టమర్లకు తాజాగా ఆర్ఎన్పీఎల్ సేవలను ప్రారంభించింది. దీంతో కస్టమర్లకు ఎలాంటి కన్వినెన్స్ ఫీజు లేకుండా 40 రోజుల క్రెడిట్ ద్వారా అద్దెను చెల్లించేందుకు వీలు కల్పిస్తోంది. అంతేకాకుండా అద్దె చెల్లింపులను అవసరమైతే కస్టమర్లు సులభ వాయిదా పద్ధతి(ఈఎంఐ)లోకి మార్పిడి చేసుకునేందుకు అవకాశమున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. దేశీయంగా 4 శాతం ప్రజలకే క్రెడిట్ కార్డులున్నందున రెంట్ నౌ పే లేటర్ సర్వీసు వినియోగదారులకు ప్రయోజనకరంగా నిలవనున్నట్లు వివరించింది. హౌసింగ్.కామ్ ఇప్పటికే క్రెడిట్ కార్డుల ద్వారా అద్దె చెల్లింపులకు తెరతీసిన విషయం విదితమే. -
మరణంలోనూ యాజమానికి తోడుగా..
ఎడిన్బర్గ్ : మరణంలోనూ యాజమానికి తోడుగా నిలిచిందో శునకం. యాజమాని చనిపోయిన 15 నిమిషాల్లోపే వెన్నెముక విరగ్గొట్టుకుని చనిపోయింది నిరో అనే ఓ బుల్డాగ్. వివరాల్లోకి వెళితే.. స్కాట్లాండ్కు చెందిన స్టువర్ట్ హట్చిసన్ అనే వ్యక్తి నిరో అనే ఫ్రెంచ్ బుల్‌డాగ్‌తో పాటు మరో రెండు కుక్కలను పెంచుకునే వాడు. నిరో అంటే అతడికి ఓ ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. అది కూడా అంతే! అతడిని విడిచి ఒక్కనిమిషం కూడా ఉండేది కాదు. ఇదిలా ఉండగా 2011లో స్టువర్ట్‌కు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స చేయించుకుంటునప్పటికి అది కాస్తా పెరిగి ఎముకకు వ్యాపించింది. దీంతో అతడి కుటుంబసభ్యులు నిరోను మిగిలిన రెండు కుక్కలను వేరేవాళ్లకు దత్తతకు ఇచ్చేశారు. స్టువర్ట్ గత నెలలో బ్రెయిన్ ట్యూమర్ కారణంగా మరణించాడు. యాజమాని మీద ప్రేమో లేక యాధృచ్ఛికమో తెలీదు కానీ, సరిగ్గా అతడు మరణించిన 15 నిమిషాల్లో నిరో వెన్నెముక విరగ్గొట్టుకుని మరణించింది. దీనిపై స్టువర్ట్ తల్లి ఫియానా కొనెఘన్ మాట్లాడుతూ.. ‘‘ నా కొడుకు సరిగ్గా మధ్యాహ్నం 1:15నిమిషాలకు మరణించాడు. అతడు మరణించిన దాదాపు 15 నిమిషాలకే నిరో వెన్నెముక విరగ్గొట్టుకుని మరణించింది. అతడు మొత్తం మూడు కుక్కలను పెంచుకునేవాడు. కానీ, నిరో అంటే అతడికి ప్రత్యేకమైన అభిమానం. అది ఎల్లప్పుడు అతని వెంటే ఉండేది. అతడు చనిపోయే నాలుగు వారాల ముందు అతన్ని ఇంటికి తీసుకొచ్చాము. ఇంట్లో కళ్లు మూయాలన్నది అతడి చివరికోరిక’’ అని తెలిపిందామె. -
నీరో చక్రవర్తిలా కేసీఆర్ సంబరాలు చేస్తారా?
► కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మండిపాటు ► తెలంగాణ ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు న్యూఢిల్లీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను భారీ ఎత్తున నిర్వహించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా వివిధ పత్రికలలో వందల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రకటనలు ఇచ్చారని ఆయన అన్నారు. ఒకవైపు పేద ప్రజలు చనిపోతుంటే.. నీరో చక్రవర్తిలా సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ తీరు సిగ్గుచేటని దుమ్మెత్తి పోశారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆయన ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలు వెల్లడించారు. గడిచిన రెండేళ్లలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ధి పొందడం మనమంతా చూశామని అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వడదెబ్బకు ప్రజలు చనిపోతున్నారని, రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతోందని డిగ్గీ రాజా చెప్పారు. అంతకుముందు ఆయన తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆమోదించినందుకు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. Greetings to all in Telengana and we thank Sonia Gandhi to give Statehood accepting the long standing demand of the People of Telengana. — digvijaya singh (@digvijaya_28) 2 June 2016 In two years we have seen only KCR Family benefiting. Farmers are committing suicides people are dying of heat stroke unemployment growing. — digvijaya singh (@digvijaya_28) 2 June 2016 KCR celebrating and putting huge ads worth 100s of crores.Another Nero in the celebration mode when poor people are dying. Shame on you KCR! — digvijaya singh (@digvijaya_28) 2 June 2016