హౌసింగ్.కామ్‌లో జనప్రియ ఫ్లాట్లు! | janapriya flats in housing.com! | Sakshi
Sakshi News home page

హౌసింగ్.కామ్‌లో జనప్రియ ఫ్లాట్లు!

Published Fri, Mar 27 2015 2:32 AM | Last Updated on Thu, Oct 4 2018 4:27 PM

హౌసింగ్.కామ్‌లో జనప్రియ ఫ్లాట్లు! - Sakshi

హౌసింగ్.కామ్‌లో జనప్రియ ఫ్లాట్లు!

రూ.520 కోట్లు ఫ్లాట్లను విక్రయించేందుకు ఒప్పందం
 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హౌసింగ్.కామ్‌లో తమ సంస్థ నిర్మించిన పలు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లను విక్రయించడానికి హైదరాబాద్‌కు చెందిన జనప్రియ ఇంజనీర్స్ సిండికేట్ నిర్మాణ సంస్థ సిద్ధమైంది. ఈమేరకు ఏడాది పాటు రూ.520 కోట్ల విలువైన ఫ్లాట్లను విక్రయించేందుకు హౌసింగ్.కామ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని జనప్రియ సీఎండీ కే రవీందర్ రెడ్డి చెప్పారు.

గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో హౌసింగ్.కామ్ సీఎఫ్‌ఓ అజీమ్ జైనుల్‌భాయ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. జనప్రియ సంస్థకు చెందిన ఆర్కాడియా, క్లాసిక్ హోమ్స్, లేక్ ఫ్రంట్, మెట్రోపొలిస్, సిల్వర్ క్రెస్ట్ ప్రాజెక్ట్‌లు సుమారు 1,900 ప్రాపర్టీలు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇందులో రూ.16.95 లక్షల నుంచి రూ.56 లక్షల విలువ గల 3 పడక గదుల ఇళ్లు, విల్లాలు, రో-హౌజెస్‌లున్నాయి. బుకింగ్ ధరను రూ.21 వేలుగా నిర్ణయించామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement