దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రధానమంత్రి గతి శక్తి పథకం ఎంతో ఉపయోగపడిందని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. 2029 నాటికి మౌలిక సదుపాయాల వృద్ధికి జీడీపీలో 6.5 శాతం ఇన్వెస్ట్ చేస్తారని అంచనావేస్తూ నివేదిక విడుదల చేసింది.
నివేదికలోని వివరాల ప్రకారం..ప్రధానమంత్రి గతి శక్తి పథకంతో భారతదేశ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్నాయి. హైవే, రైల్వే, ఓడరేవులు వంటి సదుపాయాలు మెరుగయ్యాయి. ‘మల్టీ మోడల్ కనెక్టివిటీ’తో భారత రవాణా వ్యవస్థ దూసుకుపోతుంది. దేశ జీడీపీలో మౌలిక సదుపాయాల కల్పనకు 2023-24లో 5.3 శాతం వెచ్చించారు. క్రమంగా ఇది పెరుగుతూ 2029 నాటికి 6.5 శాతానికి చేరుతుంది. దాని ఫలితంగా రాబోయే ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థ భారీగా పెరుగుతుంది.
‘ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం..భారత షిప్‌యార్డ్‌ల్లో కంటైనర్లు ఉండే సగటు సమయాన్ని ముడు రోజులకు తగ్గించారు. అందుకోసం హైవేలు, రైల్వేలు ఎంతో తోడ్పడుతున్నాయి. ఇది యూఏఈ, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో నాలుగు రోజులు, యూఎస్‌ఏలో ఏడు రోజులు, జర్మనీలో పది రోజులుగా ఉంది. భారతీయ ఓడరేవుల ‘టర్నరౌండ్ సమయం(అన్‌లోడ్ చేసి లోడ్ చేయడానికి పట్టే సమయం)’ 0.9 రోజులకు చేరుకుంది. ఇది యూఎస్‌ఏలో 1.5 రోజులుగా, ఆస్ట్రేలియాలో 1.7 రోజులుగా, సింగపూర్‌లో ఒక రోజుగా ఉంది. అక్టోబరు 2021లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పీఎం గతి శక్తి పథకాన్ని ప్రారంభించారు. దీని కింద ఇప్పటివరకు పోర్ట్‌లు, షిప్పింగ్ రంగాల్లో రూ.60,900 కోట్ల విలువైన 101 ప్రాజెక్టులు గుర్తించారు. ఏప్రిల్ 2023 నాటికి రూ.8,900 కోట్ల విలువైన 26 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రూ.15,340 కోట్ల విలువైన 42 ప్రాజెక్టులు అభివృద్ధిలో ఉన్నాయి. రూ.36,640 కోట్ల విలువైన 33 ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి’ అని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.
ఇదీ చదవండి: ఇన్‌స్టా పోస్ట్ వైరల్ కావాలంటే.. సీఈఓ సూచన
సాగరమాల కార్యక్రమం కింద రూ.1.12 లక్షల కోట్ల విలువైన 220 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రూ.2.21 లక్షల కోట్ల విలువైన 231 ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి. రూ.2.07 లక్షల కోట్ల విలువైన 351 ప్రాజెక్టులు మూల్యాంకన దశలో ఉన్నాయని మోర్గాన్ స్టాన్లీ నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment