
‘హెచ్‌సీఎల్ గ్లోబల్ డెలివరీ సెంటర్’ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఏడాదిలోనే భారీగా పెట్టుబడులు సాధించాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు. ఈ విషయంలో గతంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేసినా కూడా.. ప్రపంచం మొత్తం అంగీకరిస్తోంది. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన రాష్ట్రంగా మారుస్తానని నేను చెప్పినపుడు చాలా మంది సాధ్యం కాదని అనుమానాలు వ్యక్తం చేశారు.
సీఎంగా నేను దావోస్‌లో రెండుసార్లు పర్యటించి భారీ పెట్టుబడులు సాధించా.. తొలి ఏడాది రూ.41వేల కోట్లు, రెండో సారి రూ.1.78లక్షల కోట్ల ఎంఓయూలపై సంతకాలు జరిగాయి’అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దీనితో హైదరాబాద్ రైజింగ్ ఇకపై ఆగదని ప్రపంచం మొత్తం నమ్ముతోందని చెప్పారు. సీఎం గురువారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో మంత్రి శ్రీధర్‌బాబుతో కలసి ‘హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గ్లోబల్ డెలివరీ సెంటర్’ను ప్రారంభించి మాట్లాడారు.
పెద్ద కల అవుతుందన్నారు...
‘‘మా పోటీ ముంబై, ఢిల్లీ, బెంగళూరు లేదా చెన్నైతో కాదని నేను చెప్పినప్పుడు కొంతమంది అది పెద్ద కల అవుతుందన్నారు. మనం ఈవీ అడాప్షన్‌లో హైదరాబాద్‌ను నంబర్ వన్‌గా చేశాం. రాష్ట్రాన్ని డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, స్కిల్స్, మాన్యుఫాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్‌కు హబ్‌గా మారుస్తున్నాం. కేవలం ఏడాదిలోనే తెలంగాణకు దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయి.
ఉద్యోగ కల్పనలో నంబర్ వన్‌గా నిలిచాం..’’అని సీఎం రేవంత్ చెప్పారు. ఇక్కడ దగ్గర అత్యధిక కృత్రిమ మేధ వినియోగం, అత్యల్ప ద్రవ్యోల్బణం ఉన్నాయన్నారు. 60 దేశాల్లో 2.2 లక్షల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్‌సీఎల్ టెక్ 2007లో భారత్‌లో అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదిగిందని చెప్పారు. హెచ్‌సీఎల్ నూతన క్యాంపస్ 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు ఐదు వేల మంది ఉద్యోగులతో హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు.
గ్లోబల్ వ్యాల్యూ సెంటర్లుగా జీసీసీలు: శ్రీధర్‌బాబు
తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించేలా జీసీసీలను గ్లోబల్ వాల్యూ సెంటర్లుగా మార్చుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు చెప్పారు. ‘‘ఏఐ, మెషీన్ లెరి్నంగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీలలో తెలంగాణను హబ్‌గా మార్చి పెట్టుబడులను ఆకర్షిస్తాం. త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించేందుకు స్విట్జర్లాండ్‌కు చెందిన దిగ్గజ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం.
నైపుణ్య శిక్షణ కోసం నెలకొల్పిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కూడా భాగస్వామ్యం వహించాలి. తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తాం’’అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఎల్ టెక్ సీఈఓ, ఎండీ సి.విజయ్‌కుమార్, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment