SCERT
-
ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో సీఎం జగన్
తిరుపతిలో జరిగిన ఇండియాటూడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రెండో సారి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడం ఖాయమని ప్రకటించారు. తమ ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ప్రజలను ధైర్యంగా అడుగుతున్నానని సీఎం జగన్ చెప్పారు. తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తామన్న సీఎం జగన్.. విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చామని చెప్పారు. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించామని, మేని ఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చామని తెలిపారు. మా ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు ఇది నిదర్శనమని చెప్పిన సీఎం జగన్... కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుందని, విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినట్టే.. తమ కుటుంబాన్ని కూడా విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ చెప్పినదాంట్లో ముఖ్యాంశాలు పిల్లలు ఓటర్లు కాదు కాబట్టి.. వారిపైన పెద్దగా శ్రద్ధ పెట్టరు అయితే విద్య అలాంటి అంశాలపై దృష్టి పెట్టకపోతే పేదరికాన్ని నిర్మూలించలేం నేను ఏ హామీ ఇచ్చాను, ఏం చేశాను అన్నది చూడాలి మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99.4 శాతం అమలు చేశాను అమలు చేయడమే కాదు, వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగాను ఇది మా ప్రభుత్వానికున్న విశ్వసనీయత ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయాన్ని, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం వివక్ష లేకుండా, అవినీతి లేకుండా అర్హత ఉన్నవారికి డీబీటీ ద్వారా పథకాలు అందించాం డీబీటీ అన్నది ఒక విజయవంతమైన అంశం అయితే విద్య, వైద్యం, మహిళా సాధికారితల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాం అన్నిటికంటే మించి వివక్ష లేకుండా పారదర్శకతతో ప్రత్యక్ష నగదు బదిలీ అమలు చేశాం కచ్చితంగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు, వాటి అమలు గురించీ కూడా విపక్షాలు మాట్లాడలేవు ఇదే బడ్జెట్ గతంలోనూ ఉంది..ఇప్పుడూ ఉంది కాని మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు కాని ఈ ప్రభుత్వం మాత్రమే ఇవన్నీ చేయగలిగింది చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది నాకు లేనే లేదు చంద్రబాబుపై అవినీతి ఆరోపణల విషయం కోర్టుకు చేరింది ఆ ఆరోపణలు, ఆధారాలను చూసి కోర్టు నిర్ణయం తీసుకుని రిమాండ్ విధించింది అలాంటప్పుడు ప్రతీకారం ఎలా అవుతుంది.? సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలను చూస్తాయి కదా? వాటిని చూసి కన్విన్స్ అయితేనే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ఉనికి పెద్దగా లేదు పోటీ మా పార్టీకి, టీడీపీ- జనసేన కూటమికి మధ్యే ఉంటుంది ప్రతి పార్టీ కూడా సర్వేలు చేస్తుంది వాటి ఫలితాల ఆధారంగా మార్పులు, చేర్పులు చేస్తుంది ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు కాని కొందరు స్థానిక నాయకుల విషయంలో ప్రజలకు కొంత అసంతృప్తి ఉంది అంతేకాకుండా సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా కొన్ని మార్పులు చేశాం చివరిదశలో మార్పులు చేసి అయోమయం సృష్టించే కన్నా, ముందుగానే నిర్ణయిస్తున్నాం జాతీయ రాజకీయాలు విషయంలో మా విధానం స్పష్టం: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేం రాజీపడబోం ప్రజల ప్రయోజనాల విషయంలోనే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్తున్నాం: కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతూ ఉంటుంది అది ఆ పార్టీ సంప్రదాయంగా గమనిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు విభజించి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించాలనుకుంది అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు నేను కాంగ్రెస్‌నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్నకు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు వారు పాఠాలు నేర్వలేదు కాంగ్రెస్ పార్టీ ఏపీ సారథ్య బాధ్యతలు మా సోదరికి ఇచ్చారు కాని అధికారం అనేది దేవుడు ఇచ్చేది దేవుడ్ని నేను బలంగా నమ్మతాను ఆయనే అన్నీ చూస్తాడు ఇండియాటుడే తరపున రాజ్‌దీప్ ప్రశ్నలు, ముఖ్యమంత్రి జగన్ సమాధానాలు సవివరంగా.. రాజ్‌దీప్ : తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో విద్యపై సదస్సు నిర్వహించడం సంతోషకరం, చదువుతో వచ్చే మార్పు ఏంటన్నది కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఆ మార్పే చోటు చేసుకోబోతుంది. ఏపీలోని అత్యంత సామాన్య విద్యార్థులు అమెరికాలోని వాషింగ్టన్ డీసీని పర్యటించడం గొప్ప విషయం సీఎం జగన్ : ఇండియా టుడే జర్నలిస్టులు తిరుపతిలోని ప్రభుత్వ పాఠశాలలు చూడడం గొప్ప విషయం పేదరికం తొలగించేందుకు చదువుపై పెట్టుబడి పెట్టడం మినహా మరో మార్గం లేదన్నది నా బలమైన నమ్మకం నాణ్యమైన విద్య అందుకోవడం ప్రతీ ఒక్కరి హక్కు కావాలి పేదలు చదివేది ఒకటయితే, ధనిక పిల్లలు చదివేది మరొకటి పేదలకు తెలుగు మీడియంలో బోధన జరిగేది, ధనిక పిల్లలు ఇంగ్లీషులో చదివేవారు రాజ్‌దీప్ : మూడో తరగతి నుంచే గ్లోబల్ ఎగ్జామ్ టోఫెల్ లాంటిపై అవగాహన కల్పించేలా చేసిన మార్పులపై విమర్శలొచ్చాయి. తెలుగు మీడియంలోనే బోధించాలని విమర్శలు చేశారు కదా.? సీఎం జగన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధించేలా చేయరాదని విమర్శించే వాళ్ల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు? నన్ను, ప్రభుత్వ విధానాలను విమర్శించే ముందు మీ విధానాలను ప్రశ్నించుకోండి రాజ్‌దీప్ : అకస్మాత్తుగా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే విద్యార్థులు పాఠశాల మానేసే ప్రమాదం లేదా? సీఎం జగన్ : ఇలా జరక్కుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. పాఠ్యపుస్తకాల్లో ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లీష్ పెట్టాం. మా బోధనకు అదనంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బైజూస్ అంశాలను చేర్చాం. పాఠశాలలు అన్నింటిలోనూ సౌకర్యాలు మెరుగుపరిచాం. ఒక విధంగా చెప్పాలంటే సమగ్ర ప్రణాళికతో వీటిని అమల్లోకి తెచ్చాం. నాడు-నేడు తీసుకొచ్చి పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచాం. 62వేల తరగతి గదులుంటే .. 40 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ టీవీలు ఏర్పాటు చేశాం. ఈ నెలాఖరుకల్లా మిగతా చోట కూడా పూర్తవుతాయి. టీచర్లకు తగిన శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా ప్రణాళికకు ఒక సమగ్ర రూపం తీసుకొచ్చాం. 8వ తరగతి విద్యార్థులందరికీ ఒక ఆధునికమైన టాబ్ నేర్చుకునేందుకు అందించాం. రాజ్‌దీప్ : 8వ తరగతి విద్యార్థికి టాబ్ ఇచ్చారా? కోవిడ్ సమయంలో తగిన సాధన సంపత్తి (టీవీలు, మొబైళ్లు, టెక్నాలజీ) లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు? ఏపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు కదా.? వచ్చే మూడేళ్లలో పదో తరగతి విద్యార్థులందరికీ టాబ్లు ఉంటాయని నమ్మకంగా చెప్పగలరా? సీఎం జగన్ : 8వ తరగతి, 9వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే టాబ్‌లున్నాయి. డిసెంబర్ 21న టాబ్లు ఇచ్చాం. నా పుట్టిన రోజు నాడు నేనే తరగతి గదికి వెళ్లి పిల్లలను కలిసి వాళ్లకు టాబ్ అందజేస్తాం. రాజ్‌దీప్ : ప్రభుత్వాల్లో పనులు అంత వేగంగా జరగవని చెబుతారు, మీరు మీ యంత్రాంగాన్ని తగిన విధంగా ప్రోత్సహిస్తున్నారా? IB సిలబస్ కూడా ప్రవేశపెట్టారా? అది కేవలం కొన్ని నగరాల్లోనే అందుబాటులో ఉంది కదా.? అయితే ఇదంతా తొందరపడి చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.. తల్లితండ్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇంత మంచి అవకాశం ఎలా వచ్చిందని.? సీఎం జగన్ : ఐబీ సిలబస్ మన రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుతో చేతులు కలిపింది. IB అన్నది ప్రస్తుతం ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నాం. జూన్ 2025 తర్వాత మొదటి తరగతిలో IB సిలబస్ ప్రవేశపెడతాం. అక్కడి నుంచి దశలవారీగా ఏడో తరగతి వరకు ప్రవేశపెడతాం. ఐదేళ్ల తర్వాత మన రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో బ్యాక్యులరేట్ సర్టిఫెకెట్ కోసం పోటీ పడతారు. ఈ ప్రయత్నం ఎందుకంటే.. విద్యలో నాణ్యత అనేది చాలా ముఖ్యం. అదే లేకుంటే మా రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడలేరు కదా.. ఈ పోటీలో కేవలం ధనికులు మాత్రమే గెలిచే పరిస్థితి ఉండకూడదు, అణగారిన వర్గాల వారికి కూడా అవకాశం దక్కాలి రాజ్‌దీప్ : అది గొప్ప దార్శనికతే. గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల పల్లె నుంచి వచ్చిన విద్యార్థి పోటీ పడాలన్న ఆలోచన మంచిదే. కానీ విద్యార్థులకు మంచి బోధన అందించేందుకు నాణ్యమైన ఉపాధ్యాయులు ఉన్నారనుకుంటున్నారా? సీఎం జగన్ : ఒక మంచి ఆలోచనకు మావంతు ప్రయత్నం జోడిస్తున్నాం. IB, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయి. IBతో చర్చలు జరిపి మాతో కలిసి పని చేసేలా వారిని ఒప్పించాం. ఇందుకు వారిని అభినందిస్తున్నాను. ఫలితంగా IB తన అధికారిక కార్యాలయాన్ని SCERTతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తోంది. ఇది విప్లవాత్మకమైన మార్పుకు నాంది. 2035 నాటికి IBలో చదువుకున్న విద్యార్థులు పదో తరగతిలో ప్రవేశిస్తారు. ఈ లక్ష్యంతోనే మేం పని చేస్తున్నాం. రాజ్‌దీప్ : ఈ పన్నెండేళ్ల ప్రాజెక్టులో IB తో కలిసి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నది మీ ఆలోచనా? దీనికి పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయి, తగినన్ని మీ దగ్గర నిధులున్నాయా? సీఎం జగన్ : ముందు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ.. చిన్న నుంచి పెద్ద తరగతుల వారికి IB బోధన ఇస్తున్నాం ఆ తర్వాత 11, 12 తరగతుల వరకు IB సిలబస్ బోధన అందుతుంది ఇది ప్రభుత్వ ప్రాజెక్టు అన్న విషయం IBకి కూడా తెలుసు. వాళ్లు కూడా ప్రభుత్వంలో భాగమైనందున.. మిగిలిన వారి వద్ద తీసుకునే స్థాయిలో రాయల్టీలాంటివి ఉండకపోవచ్చు. అట్టడుగు స్థాయి విద్యార్థులకు కూడా అంతర్జాతీయ స్థాయి విద్యను అందించవచ్చన్నది ప్రపంచానికి తెలిపేందుకు ఏపీ ప్రభుత్వం, IB కలిసి చేస్తున్న ప్రయత్నం ఇది. ఇక నిధుల విషయానికొస్తే.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు దాదాపు రూ.14వేల కోట్ల నిధులు అవసరమవుతాయి. ఇప్పటివరకు రూ.8200 కోట్లను ఖర్చు పెట్టాం. నాడు-నేడు తొలిదశలో భాగంగా మొత్తం 44వేల పాఠశాలల్లో 15వేల పాఠశాలలు పూర్తయ్యాయి. రెండో దశలో భాగంగా 16వేల పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి. మార్చి నాటికి రెండో దశ పూర్తవుతుంది. వచ్చే ఏడాది మిగిలిన పాఠశాలల్లో పనులు చేపడుతాం. రాజ్‌దీప్ : 2018లో ఏపీలో పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల శాతం 84.48, ఆ ఏడాది జాతీయ సగటు 99.21. ఈ పరిస్థితుల్లో డ్రాపవుట్లను అరికట్టేందుకు ఏం చేస్తున్నారు? జగనన్న అమ్మ ఒడిలా నేరుగా లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుస్తారా? ఆ డబ్బును పిల్లల చదువుకు ఖర్చు పెట్టేలా చూస్తారా? సీఎం జగన్ : మేం పగ్గాలు చేపట్టేనాటికి రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి అట్టడుగున ఉంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మధ్యాహ్నా భోజన పథకాలు, అమ్మ ఒడి లాంటి వాటి సాయంతో డ్రాప్ అవుట్లను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. మా రాష్ట్రంలో అమలవుతోన్న మధ్యాహ్న భోజన పథకం చాలా వినూత్నమైంది. గోరు ముద్ద పేరుతో ఇస్తోన్న ఈ పథకంలో ఒక్కో రోజు ఒక్కో మెనూతో పౌష్టికాహరం అందిస్తున్నాం. అవసరమయితే రాష్ట్రంలోని ఏ పాఠశాలకైనా మీరు వెళ్లి పరిశీలించుకోవచ్చు. రాజ్‌దీప్ : ఈ పథకాల అమలును ఎలా పర్యవేక్షిస్తున్నారు? గతంలో ప్రభుత్వాలు పాఠశాలలపై పెద్దగా దృష్టి పెట్టలేదు కదా.? నాకిపుడు అర్థమైంది మీరు ఢిల్లీలో ఎందుకు తక్కువ సమయం గడుపుతారన్నది అయితే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గతంలోనూ ఒక సమస్య ఉండేది, ఈ రాష్ట్ర యువతకు నిరుద్యోగం సమస్య ఎక్కువ. ఒక దశలో 35% దాకా ఉండేది. ఈ నేపథ్యంలో వీరికి నైపుణ్యాలు అందించడం, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడం ఒక సవాలేనా? సీఎం జగన్ : ఈ విషయాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా చూస్తోంది. నేనే స్వయంగా పాఠశాలలను పర్యవేక్షిస్తున్నాను. కలెక్టర్లతో నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నాను. మేం పాఠశాల విద్య మీద మాత్రమే కాదు ఉన్నత విద్యపైనా దృష్టి పెట్టాం. ఉద్యోగాలకు అవసరమైనట్టుగా బోధనాంశాల్లో మార్పులు చేశాం. మూడేళ్ల డిగ్రీ కోర్సుల్లో భాగంగా ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశాం. అన్ని డిగ్రీలను నాలుగేళ్లు చేస్తున్నాం, ఆన్లైన్ కోర్సులు ఇస్తున్నాం. ఇందులో భాగంగానే త్వరలో ఎడెక్స్తోనూ ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. పిల్లలు ఆన్లైన్లో మరిన్ని కోర్సులు నేర్చుకునేందుకు 1800 సబ్జెక్టుల్లో కోర్సులను అందించడానికి ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం బీకాం నేర్చుకునేవారికి అసెట్ మేనేజ్ మెంట్ తదితర అంశాలను నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం ఇవన్నీకూడా పాఠ్యప్రణాళికలో భాగం చేస్తున్నాం: ------------- విద్యారంగంలో ఏపీ కొత్త ఒరవడి 5.12pm, జనవరి 24, 2024 విద్యా రంగంలో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలపై ఇంట్రో ఏపీలో విద్యారంగంలో సమూల మార్పులు, విద్యా రంగంలో ఆంధ్ర మోడల్, కొత్త ఒరవడి సృష్టించిన సీఎం జగన్ ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌కు సీఎం జగన్ 5.11pm, జనవరి 24, 2024 ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చర్చ తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ 5.10pm, జనవరి 24, 2024 మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న సీఎం జగన్ తిరుపతిలోని ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ Updates: ►ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం జగన్ ►ఏపీ విద్యారంగంలో తీసుకువచ్చిన నూతన విధానం, మన బడి నాడు - నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, టోఫెల్ శిక్షణ మొదలైన అంశాలపై చర్చ ►దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యారంగంలో తీసుకువచ్చిన నూతన విధానంపై ఇండియా టుడే సమ్మిట్ ప్రతినిధులు ప్రశంస ►రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ ►మరి కొద్దిసేపట్లో తాజ్ హోటల్లో జరిగే ఇండియా టుడే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌కు హాజరుకానున్న సీఎం జగన్ ►తిరుపతి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొననున్న సీఎం సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు తిరుపతికి వెళ్లనున్నారు. అక్కడే జరిగే ఇండియా టుడే విద్యా సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు పర్యటన వివరాలను సీఎంవో తెలియజేసింది. బుధవారం సాయంత్రం తాడేపల్లి నుంచి బయల్దేరి సీఎం జగన్ తిరుపతికి( Tirupati ) బయలుదేరతారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి తాజ్ హోటల్‌కు వెళ్తారు. అక్కడ జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమ్మిట్ లో పాల్గొంటారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి ప్రయాణం అవుతారు. సీఎం రాక నేపథ్యంలో.. తిరుపతిలో అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు. -
ఏపీ విద్యా పథకాలు అద్భుతం.. ఢిల్లీ విద్యావేత్తల బృందం ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న వివిధ విద్యా కార్యక్రమాలు, పథకాలు, వాటిని సమగ్రంగా అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థలు అద్భుతంగా ఉన్నాయని ఢిల్లీకి చెందిన విద్యావేత్తల బృందం ప్రశంసించింది. రాష్ట్ర విద్యా వ్యవస్థలో అమలవుతున్న వివిధ పథకాలు, స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఢిల్లీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో 60 మంది విద్యావేత్తల బృందం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విజయవాడలో 28 మంది సభ్యుల బృందం గత రెండు రోజులుగా కృష్ణా జిల్లాలోని పెనమలూరు, నిడమానూరు పాఠశాలలను సందర్శించింది. ఈ బృందానికి రాష్ట్ర ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాపరెడ్డి ఆహా్వనం పలికారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, డిజిటల్ విద్య, జగనన్న అమ్మఒడి, మన బడి నాడు–నేడు, ద్వి భాషా పాఠ్యపుస్తకాలు, విద్యార్థుల సహ పాఠ్య కార్యక్రమాలను బృందం పరిశీలించింది. పెనమలూరు విద్యార్థుల డ్రమ్స్, నిడమానూరులో యోగా ప్రదర్శనలను ఆసక్తితో తిలకించింది. అనంతరం రాష్ట్ర ఎస్సీఈఆర్టీలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను ఈ బృందం పరిశీలించింది. ఎస్సీఈఆర్టీ అధ్యాపక బృందంతో వివిధ బోధన విధానాల గురించి పరస్పరం అభిప్రాయాలు పంచుకుంది. ఢిల్లీలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల గురించి కూడా బృందం వివరించింది. అనంతరం సమగ్ర శిక్ష కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఎస్పీడీ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. సాల్ట్ పథకంలో భాగంగా వివిధ ప్రముఖ సంస్థలు విద్యాశాఖతో కలిసి పనిచేస్తున్న అంశాల మీద అవగాహన కలి్పంచారు. మృదుల భరద్వాజ్ ఆధ్వర్యంలో పర్యటిస్తున్న ఈ బృందం రాష్ట్రంలో అమలవుతున్న పథకాల పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఇక్కడ జరుగుతున్న మంచి విధానాలపై తమ రాష్ట్ర అధికారులకు నివేదిక సమరి్పస్తామని మృదుల భరద్వాజ్ చెప్పారు. -
టెన్త్‌లో ఆరా? పదకొండు పేపర్లా? ఎస్సీఈఆర్టీ మొగ్గు ఎటువైపు?
సాక్షి, హైదరాబాద్: మార్చిలో నిర్వహించాల్సిన టెన్త్ వార్షిక పరీక్షలపై ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఆరు పేపర్లా? 11 పేపర్లతో పరీక్ష నిర్వహించాలా? అనే అంశంపై తర్జన భర్జనలు పడుతున్నారు. గురువారం సమావేశమైన రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎస్సీఈఆర్టీ) అధికారులు.. ఈ ఏడాది వరకు 11 పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడినట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో ప్రధానోపాధ్యాయులు ఇచ్చిన సలహా మేరకు ముందుకు వెళ్ళాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపేందుకు ఎస్సీఈఆర్టీ సిద్ధమైనట్లు తెలిసింది. అయితే పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు మాత్రం ఈ ప్రతిపాదనలపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లతోనే పరీక్షలు జరపాలని భావిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఇలా ప్రతి సందర్భంలోనూ ఎస్సీఈఆర్టీ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ మధ్య సమన్వయం కొరవడుతుండటం గమనార్హం. తొలుత 11 పేపర్లకే షెడ్యూల్! ఈ ఏడాది స్కూల్స్ ఆరంభంలోనే 9, 10 తరగతులకు పరీక్షలపై పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. గతంలో మాదిరి 11 పేపర్లతోనే పరీక్షలు ఉంటాయని తెలిపింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగానే నవంబర్ 1వ తేదీ నుంచి జరిగే ఎస్ఏ– 1 పరీక్ష ప్రశ్నపత్రాలను జిల్లా అధికారులు రూపొందించి, కొన్ని చోట్ల ప్రింటింగ్‌కు కూడా పంపారు. అయితే ఈ సమయంలోనే ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా సమయంలో ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా విద్యార్థులకు సరళంగా ఉండేలా, వారిపై భారం తగ్గించేలా ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. హెచ్‌ఎంల్లో వ్యతిరేకత 11 పేపర్లకు సిద్ధమైన నేపథ్యంలో, ప్రశ్నపత్రాల ప్రింటింగ్‌కు ఆర్డర్లు కూడా ఇచ్చిన తర్వాత పేపర్లు తగ్గించడం ఇబ్బంది కల్గిస్తుందని పలు జిల్లాల హెచ్ఎంలు అభిప్రాయపడ్డారు. దీనివల్ల విద్యార్థులు కూడా గందరగోళంలో పడే వీలుందని స్పష్టం చేశారు. దీంతో ఎస్ఏ–1 వరకూ 11 పేపర్లతో పరీక్షలు నిర్వహించి, ఎస్ఏ–2 (వార్షిక పరీక్షలు) మాత్రం ఆరు పేపర్లతో నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. దీనిపై ఎస్సీఈఆర్టీ జిల్లాల వారీగా అభిప్రాయాలు తెలుసుకుంది. వార్షిక పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఎస్ఏ–1 తోడ్పడుతుందని, ఎస్ఏ–1 ఒక రకంగా, ఎస్ఏ–2 మరో రకంగా ప్రశ్న పత్రాలు ఉంటే విద్యార్థులు ఇబ్బందుల్లో పడే వీలుందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీన్ని ఆధారంగా చేసుకునే ఎస్సీఈఆర్టీ రెండు పరీక్షలను 11 పేపర్లతోనే నిర్వహిస్తే బాగుంటుందనే ప్రతిపాదనను సిద్ధం చేసింది. కానీ పాఠశాల విద్యాశాఖ విముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. దీనిపై నాన్చకుండా విధానం ఏదైనా ముందే స్పష్టత ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. అప్పుడే ఆ మేరకు వార్షిక పరీక్షలకు సిద్ధమయ్యే వీలుంటుందని అంటున్నారు. -
దసరా సెలవులను 9 రోజులకు కుదించాలి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా దసరా సెలవులను తగ్గించాలని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యు కేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్–ఎస్సీఈఆర్టీ) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి మంగళవారం పాఠశాల విద్య డైరెక్టర్‌కు ఓ లేఖ రాశారు. జూలైలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ నెల 11 నుంచి 16 రోజులపాటు సెలవులు, ఈ నెల 17న జాతీయ సమైక్యతాదినోత్సవాన్ని పురస్కరించుకుని మరో సెలవు.. ఇలా అనుకోకుండా వచ్చిన సెలవుల వల్ల స్కూళ్లు మూతపడ్డాయని పేర్కొన్నారు. 2022–23 విద్యా క్యాలెండర్ ప్రకారం 230 రోజులు పాఠశా లల పనిదినాలుగా ఉండాలని, అనుకోకుండా ఇచ్చిన సెలవుల వల్ల విద్యార్థుల బోధనకు నష్టం జరిగే అవకాశముందని పాఠశాల డైరెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ కారణంగా ఈ నెల 26వ తేదీ నుంచి 14 రోజులపాటు ఇవ్వాల్సిన దసరా సెలవులను అక్టోబర్ 1 నుంచి 9 వరకూ ఇస్తే (9 రోజులు) సరి పోతుందని ప్రతిపాదించారు. వచ్చే నవంబర్, డిసెంబర్, 2023 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో రెండో శనివారం కూడా పనిదినాలుగా చేయడం వల్ల మరో 5 రోజులు బోధనకు వీలుంటుందని సూచించారు. ఈ ప్రతిపాదనలపై సరైన నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. -
టెట్ ఒకసారి రాస్తే చాలు
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్ ఎలిజిబులిటీ టెస్టు–టెట్)ను ఇకపై అభ్యర్థులు ఒక్కసారి రాసి ఉత్తీర్ణులైతే చాలు.. స్కోరు పెంపునకు మినహా మళ్లీమళ్లీ రాయాల్సిన అవసరంలేదు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) కొత్త నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టంచేశాయి. దీని ప్రకారం అభ్యర్థులు ఒకసారి ఆ పరీక్షలో ఉత్తీర్ణులైతే ఇక డీఎస్సీకి అర్హులైనట్లే. టెట్‌లో ఉత్తీర్ణత ధ్రువపత్రాల చెల్లుబాటును ఎన్సీటీఈ జీవితకాలానికి పెంచిన నేపథ్యంలో అభ్యర్థులకు ఈ వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఎన్సీటీఈ కొత్త నిబంధనల అనంతరం రాష్ట్రంలో తొలిసారిగా టెట్‌ను ఈ ఏడాది ఆగస్టులో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 16 నుంచి టెట్–ఆగస్టు 2022కు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది. జులై 16 వరకు వీటిని స్వీకరిస్తారు. గతంలోని టెట్‌లకు రాష్ట్ర విద్యాపరిశోధనా శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన సిలబస్‌ను అమలుచేయగా ఈసారి పూర్తిగా ఎన్సీటీఈ సిలబస్‌లోనే పరీక్షల నిర్వహణ జరగనుంది. వేర్వేరుగా టెట్ అర్హత నిబంధనలు టెట్ అర్హత నిబంధనలను రాష్ట్ర అధికారులు వెల్లడించారు. వాటి ప్రకారం.. ► ఉపాధ్యాయ అర్హత పరీక్ష నాలుగు పేపర్ల కింద (పేపర్–1ఏ, పేపర్–1బీ, పేపర్–2ఏ, పేపర్–2బీ) నిర్వహించనున్నారు. ► 1–5 తరగతులకు సంబంధించి రెగ్యులర్ టీచర్లకు పేపర్–1ఏ, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు పేపర్–1బీని అభ్యర్థులు రాయాలి. ► ఇక 6–8 తరగతుల రెగ్యులర్ టీచర్లకు పేపర్–2ఏ, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు పేపర్–2బీ పరీక్షను రాయాలి. ► 2010 తరువాత ఇంటర్మీడియెట్ రాసిన అభ్యర్థులకు 50 శాతం మార్కులు తప్పనిసరి. ► అదే 2002 నుంచి 2010లోపు ఇంటర్మీడియెట్ అభ్యర్థులకు 45 శాతం మార్కులు వస్తే చాలు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం మార్కుల మినహాయింపు ఉంటుంది. ► ఇది కేవలం ఇంటర్–డీఈడీ అర్హతల వారికి మాత్రమే వర్తిస్తుంది. అదే డిగ్రీ–బీఈడీ చేసిన అభ్యర్థులకు మాత్రం డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాల్సిందే. ► పేపర్–1ఏకు 8 రకాల క్వాలిఫికేషన్ అంశాలను కూడా ఏపీటెట్లో పొందుపరిచారు. ► ఇంటర్మీడియెట్, డీఎడ్, డిగ్రీ, పీజీ బీఈడీల కాంబినేషన్లలో ఈ అర్హతలున్న వారు టెట్‌ను రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ► అలాగే.. పేపర్–1బీకి 10 రకాల కాంబినేషన్లలో అర్హతలను టెట్‌లో ప్రకటించారు. ► పేపర్–2ఏ, పేపర్–2బీలలో కూడా వేర్వేరు అర్హతా ప్రమాణాలను పొందుపరిచారు. టెట్ అర్హత మార్కులు యథాతథం టెట్ అర్హత మార్కుల్లో ఎన్సీటీఈ మార్గదర్శకాల మేరకు గతంలోని నిబంధనలనే యథాతథంగా కొనసాగిస్తారు. జనరల్ కేటగిరీలోని వారికి 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ తదితర కేటగిరీల వారికి 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. వారినే టెట్‌లో ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. వీరికిచ్చే ధ్రువపత్రాల చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండేది. ఆ తర్వాత మళ్లీ టెట్ రాసి అర్హత సాధించాల్సి వచ్చేది. అయితే, గత ఏడాదిలో ఎన్సీటీఈ ఈ నిబంధనను మార్చి టెట్ సర్టిఫికెట్ చెల్లుబాటును జీవితకాలానికి పెంచింది. దీంతో అభ్యర్థులు ఒకసారి ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఆ తదుపరి డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా దరఖాస్తు చేసేందుకు అర్హులే. అయితే, డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తున్నందున అభ్యర్థులు టెట్‌లో పాల్గొని తమ స్కోరును పెంచుకోవచ్చు. ఆగస్టు 6 నుంచి పరీక్షలు.. సెప్టెంబర్ 14న ఫలితాలు ఇక టెట్ పరీక్షలను ఆగస్టు 6 నుంచి ప్రారంభించేలా పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలు ఆగస్టు 21 వరకు జరుగుతాయి. రోజుకు రెండు సెషన్లలో ఉ.9.30 నుంచి 12 వరకు, మ.2.30 నుంచి 5 వరకు నిర్వహిస్తారు. తుది ఫలితాలను సెప్టెంబర్ 14న ప్రకటిస్తారు. -
పాఠాలు.. ప్రాక్టికల్‌గా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చదువుకు మరింత పదును పెట్టేందుకు విద్యా శాఖ నడుం బిగిస్తోంది. అర్థమయ్యే బోధనా విధానాలే కాకుండా, ఏమాత్రం కష్టం లేని పరీక్ష పద్ధతులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్రం ఇప్పటికే జాతీయ విద్యా విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. స్థానిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాలు ఈ విధానాన్ని మార్చుకుంటున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సరికొత్త విద్యా విధానంపై కసరత్తు మొదలు పెట్టింది. కరోనా కారణంగా పాఠశాలల్లో బోధన, పరీక్ష విధానాలను మార్చుకోవడం అనివార్యమైంది. గడిచిన రెండేళ్లుగా సిలబస్‌ను కుదించడం, ఐచ్ఛిక ప్రశ్నలతో పరీక్షలు నిర్వహించడం తప్పని సరైంది. నిజానికి ఈ తరహా బోధన పద్ధతులను సీబీఎస్సీ ఇప్పటికే అమలు చేస్తోంది. తరగతి పాఠాల కన్నా, సృజనాత్మకత పెంచే ప్రాజెక్టులను చేపట్టింది. ఇవన్నీ సత్ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు గుర్తించారు. ముందున్న సవాళ్లు ఎన్నో.. రాష్ట్రంలో ఆధునిక బోధన విధానం ప్రస్తుతం అమల్లో ఉన్నా, ఆచరణలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని అధికారులు అంటున్నారు. నిజానికి పాఠశాల విద్యలో నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనే విద్యార్థి సృజనాత్మకతను అంచనా వేస్తారు. ప్రాజెక్టు వర్క్, రాత పని విధానం, ఏ కోణంలో ఆసక్తిగా ఉన్నారో తెలుస్తుంది. ప్రతి పాఠ్యాంశం ముగిసిన తర్వాత ప్రాజెక్టు వర్క్ ఇస్తారు. దీన్నే కీలకం చేయాలని కేంద్ర విద్యా విధానం చెబుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న అరకొర మౌలిక వసతులు దీనికి అడ్డంకిగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు 6వ తరగతిలో సంఖ్యా విధానం బోధిస్తారు. దీన్ని ప్రాక్టికల్‌గా తెలుసుకునేందుకు విద్యార్థులు గ్రామ పంచాయతీకి వెళ్లి, అక్కడ మ్యాప్ ద్వారా ఏ గ్రామానికి ఎంత దూరం ఉందనేది లెక్కించాలి. ఈ పని కోసం విద్యార్థులను తీసుకెళ్లేందుకు వాహనం కావాలి. ఒక రోజంతా ఉపాధ్యాయుడు వెచ్చించాలి. పాఠశాల విద్యలో సైన్స్ సబ్జెక్టులో భూసార పరీక్ష గురించి ఉపాధ్యాయుడు బోధిస్తాడు. భూసార పరీక్ష లేబొరేటరీకి వెళ్లి పరీక్ష విధానాన్ని స్వయంగా విద్యార్థులు పరిశీలించాలని, దీనికే ప్రాధాన్యం ఇవ్వాలని కొత్త విద్యా విధానం చెబుతోంది. పరిష్కారం ఏమిటి? సృజనాత్మక విద్యా విధానం అమలుకు సాంకేతికతను జోడించడమే సరైన మార్గమని విద్యా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు గ్రామాల మధ్య దూరం తెలుసుకోవడానికి పంచాయతీ దాకా వెళ్లే బదులు స్కూల్లోనే ఇంటర్నెట్ ద్వారా గూగుల్ మ్యాప్స్‌తో పరిశీలించే విధానం ప్రవేశపెట్టాలని సూచిస్తున్నారు. ఇది సాధ్యపడాలంటే హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలి. అధ్యాపకులకు సాంకేతిక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కోణంలోనూ ఆలోచన చేస్తున్నామని ఎస్సీఈఆర్టీ అధికారి ఒకరు తెలిపారు. అదే విధంగా క్షేత్రం స్థాయిలో నేర్చుకునే సృజనాత్మకతనే పరీక్షగా భావించి, దానికే ఎక్కువ మార్కులు ఉండేలా చూడాలని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సాధ్యమైనంత వరకు క్షేత్రస్థాయిలో ఎక్కువ నేర్చుకుని, పాఠ్యాంశాలు తక్కువగా ఉన్నప్పుడు పరీక్షల్లో మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు ఎక్కువ ఇవ్వడం మంచిదని పేర్కొంటున్నారు. స్కూళ్లకు నిధులివ్వాలి నేటి అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు అవసరమే. ఇప్పటికే మన పాఠ్య ప్రణాళిక ప్రొగ్రెసివ్‌గానే ఉంది. కార్యాచరణలో దాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు స్కూళ్లకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి. మారుమూల పల్లెల్లోనూ సాంకేతిక విద్యా బోధన, ఆన్లైన్ విధానాలను తీసుకురావాలి. రాజా భానుచందర్ ప్రకాశ్, రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు) -
పాఠ్యాంశాలపై తప్పుడు ప్రచారం: పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ప్రభుత్వాన్ని అప్రతిష్ణపాలు చేసేలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై విద్యా శాఖ తరపున స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యా శాఖ ఫిర్యాదుపై ఇబ్రహింపట్నం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాల పరిచయం కోసం అన్ని మతాల పండగలకి సమాన ప్రాధాన్యనిస్తూ తెలుగు వాచకంలో రెండవ తరగతి నుంచి ఏడో తరగతి వరకు పాఠ్యపుస్తకాల రూపకల్పన చేశామన్నారు. చదవండి: దుర్గమ్మ పాఠ్యాంశాలను తొలగించలేదు పాఠ్యపుస్తకాలలో హిందూ పండుగలు - 7, ముస్లిమ్ పండుగలు - 2 , క్రిస్టియన్ పండుగలు - 2, సవరల పండుగ- ఒకటి చొప్పున పాఠ్యాంశాలు ఉన్నాయని తెలిపారు. మొత్తం 12 పండగలు గురించి పాఠ్యాంశాల్లో పొందుపరిచి అన్ని మతాలకి సమ ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. ఇందులో నుంచి ఒక్క పండగ మాత్రమే ఎంపిక చేసి హిందూ మతానికి అన్యాయం జరుగుతున్నట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. అందుకోసమే ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. చదవండి: శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేయకపోతే కృష్ణా జలాలు వృథా -
ఈ విద్యాసంవత్సరంలో 188 పనిదినాలు
సాక్షి, అమరావతి: ప్రస్తుత (2021–22) విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 188 పనిదినాలు ఉండగా సెలవులు 70 రోజులు ఉన్నాయి. ఇక బేస్‌లైన్ పరీక్షలతోపాటు ఫార్మేటివ్ (నిర్మాణాత్మక) పరీక్షలు 4, సమ్మేటివ్ (సంగ్రహణాత్మక) పరీక్షలు 2తో పాటు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈనెల 16న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం జెడ్పీ స్కూలులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ అకడమిక్ క్యాలెండర్‌ను, పాఠ్యప్రణాళికను ఎస్సీఈఆర్టీ తీర్చిదిద్దింది. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి సారథ్యంలో వివిధ విభాగాల నిపుణులు 35 మంది దీని రూపకల్పనలో భాగస్వాములయ్యారు. పాలన ప్రణాళిక, యాజమాన్యాల వారీగా రాష్ట్రంలోని పాఠశాలలు, జిల్లా ఉపాధ్యాయ విద్యాశిక్షణ సంస్థలు, ఉపాధ్యాయుల వివరాలను ఈసారి కొత్తగా చేర్చారు. విద్యాహక్కు చట్టం, బాలలహక్కుల చట్టం నియమ నిబంధనలతో పాటు కేంద్రం నూతన విద్యావిధానంలో సూచించిన విధంగా సమ్మిళిత విద్యాంశాలను ఈ విద్యాప్రణాళికలో పొందుపరిచారు. 6 రకాల స్కూళ్ల గురించి.. పాఠశాలల భద్రత, విపత్తు నిర్వహణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కార్యక్రమాలు, సమగ్రశిక్ష, వయోజన విద్య, ఉపాధ్యాయ శిక్షణ, ఉపాధ్యాయుల సామర్థ్యాలు మెరుగుపర్చడం, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, కెరీర్ గైడెన్స్, యూడైస్ చైల్డ్ ఇన్ఫో, దీక్ష వంటి అంశాలను విపులీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, సంస్కరణలలో అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య, కొత్తగా రూపొందించిన వివిధ యాప్‌లు, పాఠ్యప్రణాళికా సంస్కరణలు, గ్రంథాలయాలు, చదవడంపై ఆసక్తి వంటి అంశాలను వివరించారు. భవిష్యత్తు ప్రణాళికలు పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నూతన విద్యావిధానంలోని 6 రకాల స్కూళ్లు, నాడు–నేడు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, రంగోత్సవం, కళాఉత్సవ్, ద ఇండియా టాయ్ ఫెయిర్ ఏకభారత్ శ్రేష్ఠభారత్, మాసాంతపు వేడుక, కరోనా కాలంలో, కరోనా అనంతరం విద్యాకార్యక్రమాలు, ఆటల పోటీలు, సైన్సు ఫెయిర్లు, క్విజ్, వక్తృత్వపోటీలు, క్షేత్ర పర్యటనలు, ఆరోగ్య కార్యక్రమాల గురించి తెలిపారు. 1, 3వ శనివారాలు నోబ్యాగ్ డే ప్రతి స్కూలులో పాఠ్యబోధనతో స్వీయ పఠనం, పర్యవేక్షక పఠనం, పోటీ పరీక్షలకు సన్నద్ధతతోపాటు నీటిగంట, ఆటలు, పునశ్చరణ, సవరణాత్మక బోధన, గ్రంథాలయ కృత్యాలు నిర్వహించేలా ఈ విద్యాప్రణాళికను రూపొందించారు. ఒకటి, 3వ శనివారాలను నోబ్యాగ్ డేగా నిర్వహించనున్నారు. 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు వారానికి ఒకసారి కెరీర్ గైడెన్స్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. ఉదయం 8 నుంచి 8.45 గంటల వరకు నిర్వహించే సహపాఠ్య కార్యక్రమాలు విద్యార్థుల ఐచ్ఛికం ప్రకారం జరగాలని నిర్దేశించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకొనేలా చూడడంతోపాటు వాటిపై వారికి అవగాహన కలిగించాలని సూచించారు. ఫౌండేషన్ స్కూళ్లపై మరింత శ్రద్ధ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెడుతున్న ఫౌండేషన్ స్కూళ్ల నిర్వహణలో మరింత శ్రద్ధ తీసుకొనేలా విద్యాక్యాలెండర్లో అంశాలను పొందుపరిచారు. దీని ప్రకారం.. ఉదయాన్నే గ్రీట్ అండ్ మీట్ కింద ఉపాధ్యాయుడు పిల్లలకు స్వాగతం చెప్పాలి. ప్రతి పిల్లవాడిని పేరుతో పలకరిస్తూ కథలు చెప్పాలి. సామూహిక కృత్యాలు నిర్వహించాలి. తరగతి గదిలోనే బుక్ ఏరియా, డాల్స్ ఏరియా, డిస్కవరీ ఏరియా, బ్లాక్ బిల్డింగ్ ఏరియా, మ్యూజిక్ అండ్ మూవ్మెంటు ఏరియాలుగా చేసి పిల్లలు వారికి నచ్చిన ఏరియాలో ఆడుకునేలా చేసి వారి అభీష్టాలను గమనించాలి. వస్తువులను లెక్కించేలా, గుర్తించేలా చేయాలి. వస్తువులను చూడడం, తాకడం, శబ్దాలను వినడం, పదార్థాల వాసన, రుచి చూసి చెప్పడం వంటివి చేయించాలి. భోజన సమయంలో చేతులు కడుక్కోవడం, శుభ్రం చేసుకోవడం నేర్పాలి. భాషా నైపుణ్యాలను అలవర్చాలి. చివరిగా పాఠశాలను వదిలిన సమయంలో పునశ్చరణ, గుడ్‌బై చెప్పడం వంటివి చేయించాలి. -
విద్యార్థులకు వీడియో పాఠాలు
సాక్షి, అమరావతి: లాక్డౌన్, ఇతర కారణాలతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమవుతున్న నేపథ్యంలో వారు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అనేక వినూత్న కార్యక్రమాలను కొనసాగిస్తోంది. విద్యార్థులు ఆన్లైన్ వేదికల ద్వారా తమ అభ్యసన కార్యక్రమాలను కొనసాగించేలా విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ద్వారా వీటిని అమల్లోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో మరిన్ని కార్యక్రమాలకు ఎస్సీఈఆర్టీ శ్రీకారం చుట్టింది. ► వివిధ తరగతుల పాఠ్యాంశాల బోధనపై ఎస్సీఈఆర్టీ వీడియోలను తయారుచేయిస్తోంది. ► సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుల ద్వారా వీడియో పాఠ్యాంశాలు రూపొందించనుంది. ► ఈ వీడియో పాఠ్యాంశాలను విద్యాశాఖ ఏర్పాటుచేసే గూగుల్ లింక్‌కు యాడ్ చేస్తారు. ► ఉపాధ్యాయులు తమ ఫోన్ల ద్వారా కూడా పాఠాలు చెప్పి వాటిని ఎడిట్ చేసి పంపించవచ్చు. ► 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం ఇటువంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ► ఆసక్తి ఉన్న టీచర్లకు మార్గదర్శనం చేస్తున్నారు. ► దీనివల్ల పిల్లలు పాఠశాలలకు రాలేకపోయినా వీడియో పాఠాల ద్వారా అంశాలను నేర్చుకోగలుగుతారు. ‘టెన్త్ విద్యార్థులకు వాట్సప్ ద్వారా పరీక్షలకు సన్నద్ధత’ ► ప్రస్తుతం టెన్త్ పరీక్షలు రాయాల్సిన విద్యార్థులకు దూరదర్శన్ ద్వారా పాఠ్యాంశాలు బోధిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం పాఠశాలల్లో విద్యార్థులను వాట్సప్ గ్రూపులుగా ఏర్పాటుచేశారు. ప్రతి సబ్జెక్టు టీచర్ ఈ గ్రూపులో ఉంటారు. ► గతంలోని పబ్లిక్ పరీక్షల మోడల్ పేపర్లను ఈ వాట్సప్ గ్రూపుల్లో పంపిస్తున్నారు. ► మరుసటి రోజు దూరదర్శన్‌లో ఆ మోడల్ పేపర్లలోని ప్రశ్నలను నిపుణులతో చెప్పించడంతోపాటు ప్రశ్నలను అర్థంచేసుకొని సమాధానాలు ఎలా రాయాలో నేర్పిస్తున్నారు. ► దూరదర్శన్ ఉదయం సెషన్లో ప్రశ్నలు చెప్పడంతో పాటు వాటికి పిల్లలతో హోమ్‌వర్కు చేయించడానికి కొన్ని అంశాలను ఇస్తారు. ► మధ్యాహ్నం రెండో సెషన్లో ఉదయం మోడల్ పేపర్లో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఎలా రాశారు. తప్పులు ఎక్కడ ఉన్నాయి. వాటిని ఎలా సరిచేసుకోవాలో రివ్యూ చేయిస్తారు. ► టీచర్లకు తల్లిదండ్రులకు కూడా ఈ కార్యక్రమం వల్ల కొంత బాధ్యత పెరుగుతుంది. ఎస్సీఈఆర్టీ నుంచి వచ్చే మోడల్ పేపర్‌ను ఆ సబ్జెక్టు చూసే టీచర్ వాట్సప్ గ్రూపులోని పిల్లలకు పంపిస్తారు. -
ఇంగ్లిష్ మీడియానికే ఓటు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) 58 పేజీల నివేదికను ప్రభుత్వానికి సోమవారం సమర్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో అనేక అంశాలపై సమగ్రంగా విశ్లేషణ చేయడంతోపాటు పాఠశాల స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమం ఎంత అవసరమో నొక్కి చెప్పింది. 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రానున్న విద్యా సంవత్సరం నుంచి ఏ మాధ్యమంలో బోధన కావాలనే విషయమై ప్రభుత్వం ఇటీవలే విద్యార్థుల తలిదండ్రుల నుంచి లిఖితపూర్వక ఆప్షన్లను సేకరించగా.. 96.17 శాతం మంది ఆంగ్ల మాధ్యమంలోనే బోధన ఉండాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ దృష్ట్యా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు వీలుగా సిఫార్సులతో కూడిన నివేదిక ఇవ్వాలని ఎస్సీఈఆర్టీని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎస్సీఈఆర్టీ సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. నివేదికలో ఏముందంటే.. ► అన్ని రకాల సమగ్ర విశ్లేషణల అనంతరం ఎస్సీఈఆర్టీ ఈ దిగువ విషయాలను నివేదికలో పొందుపర్చినట్లు తెలిసింది. విద్యార్థులు మాతృభాషలో ప్రావీణ్యం పొందేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూనే ఇతర సబ్జెక్టుల్లో సమగ్ర నైపుణ్యానికి ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉండాలని సిఫార్సు చేసింది. దీని ద్వారానే అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయని స్పష్టం చేసినట్లు సమాచారం. ఆ వివరాలిలా. ► ఆంగ్ల మాధ్యమం వల్ల విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు, ప్రమాణాలు అభివృద్ధి చెందుతాయి. ► దీనివల్ల రాజ్యాంగం నిర్దేశించిన విలువలు విద్యార్థుల్లో పెరుగుతాయి. విద్యార్థుల్లో సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. ► శారీరక, మానసిక సామర్థ్యాల పెంపు దిశగా.. విద్యార్థి కేంద్రంగా బోధన జరగాలి. అభ్యసనం అనేది వివిధ ప్రక్రియలను చేపట్టడం ద్వారా కొనసాగాలి. ► విద్యార్థుల్లో ఒత్తిడి, భయం, ఆందోళన లేకుండా తమ భావాలను స్వేచ్ఛగా.. తడబాటుకు తావు లేకుండా చెప్పగలగాలి. ► నిరంతర సమగ్ర మూల్యాంకన విధానంలో విద్యార్థులు సాధిస్తున్న జ్ఞాన సముపార్జనను ఎల్లప్పుడూ పర్యవేక్షించటం ద్వారా వారిలో సామర్థ్యాలు ఏ మేరకు పెరుగుతున్నాయో కూడా తెలుసుకోవచ్చు. ► ఈ దృష్ట్యా ప్రభుత్వం 1నుంచి 10 తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని దశలవారీగా ప్రవేశ పెట్టాలి. ► ఇందుకు సంబంధించి ఎస్సీఈఆర్టీ 1నుంచి 6వరకు ఆంగ్ల మాధ్యమం పాఠ్య పుస్తకాలను అభివృద్ధి చేయించింది. ► ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా మాధ్యమం స్కూళ్లు యథాతథంగా కొనసాగుతాయి. ఆ స్కూళ్లలో విద్యార్థుల ఆప్షన్లకు అనుగుణంగా ఆంగ్ల మాధ్యమం తరగతులు సమాంతరంగా కొనసాగించవచ్చు. ► తెలుగు సబ్జెక్టును 1నుంచి 10 తరగతి వరకు తప్పనిసరిచేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ తెలుగు సబ్జెక్టు పాఠ్య పుస్తకాలను ఇప్పటికే పునర్నిర్మితం చేసి మాతృభాష మరింత పటిష్టమయ్యేలా తీర్చిదిద్దింది. ► బోధనాభ్యసన ప్రక్రియలను పరిపుష్టం చేయడం, ప్రభుత్వ పథకాల ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి పర్చడం వంటి చర్యలు ఫలితాలిస్తాయి. ► విద్యార్థులకు వర్క్ బుక్స్, స్కూల్ కిట్స్, అభివృద్ధిపర్చిన పాఠ్య పుస్తకాలు, పౌష్టికతతో కూడిన మధ్యాహ్న భోజనం వంటివి దీనికి మరింత తోడ్పాటునిస్తాయి. ► ఐసీటీ వేదికల ఆధారంగా టీచర్ల సామర్థ్యాలు పెంచేందుకు వీలుగా వారికిచ్చిన అనేక శిక్షణ కార్యక్రమాలు ఇందుకు ఉపకరిస్తాయి. ► తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ విద్యార్థులు పురోగతిపై వారికి వివరిస్తూ చర్చిస్తూ ఉండాలి. -
టెన్త్ ప్రశ్నపత్రంలోనే బిట్ పేపర్
సాక్షి, అమరావతి: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇకపై ఒకే ప్రశ్నపత్రం ఉంటుంది. గతంలో సాధారణ ప్రశ్నలకు, బిట్ పేపర్‌కు వేర్వేరుగా పత్రాలు ఇచ్చేవారు. ఇక నుంచి ఒకే పత్రంలో సాధారణ ప్రశ్నలు, బిట్ ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) బ్లూప్రింట్‌ను సిద్ధం చేసింది. ఆరో తరగతి నుంచి టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్ష వరకు అనుసరించాల్సిన విధానం, పబ్లిక్ పరీక్షల విధానాన్ని ఇందులో పొందుపరిచింది. దీనిపై అన్ని జిల్లాల విద్యాధికారులతో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఎస్సీఈఆర్టీ మంగళవారం ఇచ్చిన సర్క్యులర్‌లో ముఖ్యాంశాలు - టెన్త్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులకు వెయిటేజీ ఉండదు - ప్రీఫైనల్, పబ్లిక్ పరీక్షల్లో ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుంది - ప్రస్తుతమున్న 11 పేపర్లు యథాతథంగా ఉంటాయి - ఫస్ట్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, అన్ని నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులలో రెండేసి పేపర్లు ఉంటాయి - సెకండ్ లాంగ్వేజ్‌లో ఒకే పేపర్ 100 మార్కులకు ఉంటుంది - కాంపోజిట్ కోర్సు 1వ పేపర్ 70 మార్కులకు, 2వ పేపర్ 30 మార్కులకు ఉంటుంది - బిట్ పేపర్ ప్రత్యేకంగా ఉండదు. ఒకే పత్రంలో అన్ని కేటగిరీల ప్రశ్నలుంటాయి - ప్రతి పరీక్షకు 2.45 గంటల సమయం ఇస్తారు. (15 నిముషాలు ప్రశ్నపత్రం చదువుకోవడానికి, 2.30 గంటలు సమాధానాలు రాసేందుకు) - ఓరియంటల్ ఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్/ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు పరీక్ష మాత్రం 3.15 గంటలు ఉంటుంది. - ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ 2వ పేపర్ 1.45 గంటలు ఉంటుంది - సెకండ్ లాంగ్వేజ్‌కు 3.15 గంటలు - వార్షిక పరీక్షల్లో విద్యార్థులు సమాధానాలు రాసేందుకు 24 పేజీల బుక్లెట్ అందిస్తారు. - మార్కుల మెమోలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లను సబ్జెక్టు వారీగా, పేపర్ల వారీగా పొందుపరుస్తారు. - ఆయా సబ్జెక్టుల్లో 1, 2వ పేపర్లలో వచ్చినవి కలిపి పాస్ మార్కులను నిర్ణయిస్తారు. పేపర్ల వారీగా పాస్‌మార్కులను పరిగణనలోకి తీసుకోరు. -
ఇండియా కొత్త మ్యాప్‌ల వినియోగంపై ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన ఇండియా కొత్త మ్యాప్‌ను వినియోగించాలని ఆర్జేడీలు, డీఈవోలను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆదేశించింది. ఈ మేరకు సర్వే ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి మ్యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది. విద్యాశాఖ కార్యాలయాలతోపాటు అన్ని పాఠశాలల్లోనూ నూతన మ్యాప్‌ను ఉపయోగించాలని స్పష్టం చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠ్య పుస్తకాల్లోనూ ఇదే మ్యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. -
సమ్మేటివ్-1లో తప్పులకు మార్కులు
ఒంగోలు : సమ్మేటివ్-1కు నిర్వహించిన ఉమ్మడి ప్రశ్నాపత్రాల్లో తప్పులు దొర్లడంతో వాటికి మార్కులను కలపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎస్సీఈఆర్టీకి తప్పులు దొర్లాయంటూ అందిన సమాచారం మేరకు వాటిని పరిశీలించి విద్యార్థులకు మార్కులు కలిపేందుకు నిర్ణయించారు. తరగతులు వారీగా, సబ్జెక్టుల వారీగా వీటికి మార్కులను కలిపేలా ఉపాధ్యాయులకు సూచించాలని ఎస్సీఈఆర్టీ అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు సూచించింది. ► 6వ తరగతి ఇంగ్లీషులో 10, 11సి(2) ప్రశ్న స్పష్టంగా లేదని దానికి మార్కులు కలపనున్నారు. లెక్కలు పరీక్షలో 18వ ప్రశ్నకు మార్కులు కలుస్తాయి. ► 8వ తరగతిలో లెక్కలులో 24వ ప్రశ్నకు మార్కులు కలపాలి. ► 10వ తరగతి ఇంగ్లీషు సబ్జెక్టుకు సంబంధించి 5(ఎ) కి మార్కులు కలుస్తాయి. బయోగ్రాఫికల్ స్కెచ్ అండ్ హింట్స్ స్టోరీ సమ్మేటివ్–2 సిలబస్‌కు సంబంధించినది. లెక్కలు–1లో 30వ ప్రశ్నకు మార్కులు కలపాలి. పేపర్–2లో 13(ఎ) ప్రశ్నకు ఒకటిన్నర ఖచ్చితమైన సమాధానం. దీనికి కూడా మార్కులు కలపాలి. 18వ ప్రశ్న తప్పుగా వచ్చింది. దీనికి మార్కులు కలపాలి. సమ్మేటివ్–2 సిలబస్ విడుదల సమ్మేటివ్–2 సిలబస్‌ను స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషనల్ రీసెర్చి ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) ప్రకటించింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సబ్జెక్టుల వారీగా 30 శాతం ప్రశ్నలు ఏ పాఠాల నుంచి వస్తాయి, 70 శాతం ప్రశ్నలను ఏ పాఠాల నుంచి ఇస్తారనేది కూడా పొందుపరిచారు. విద్యార్థుల ప్రిపరేషన్‌కు, ఉపాధ్యాయుల బోధనా ప్రణాళికను దృష్టిలో ఉంచుకొని సిలబస్‌ను ముందుగానే ప్రకటించారు. -
24న జిల్లాస్థాయి జాతీయ సైన్స్ సెమినార్
విద్యారణ్యపురి : రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్సీఈఆర్టీ) ఆదేశానుసారం సుస్థి ర ఆహార భద్రతలో పప్పు ధాన్యాలు – అవకాశాలు సవాళ్లు అనే అంశంపై జిల్లా స్థాయి జాతీయ సైన్స్ సెమినార్‌ను ఈనెల 24న హన్మకొండ డైట్ కళాశాలలో నిర్వహించనున్నట్లు డీఈఓ పి. రాజీవ్ తెలిపారు. ఈ సెమినార్లో పాల్గొనేందుకు 8, 9, 10 తరగతుల విద్యార్థులే అర్హులన్నారు. పాఠశాల స్థాయిలో ఈసైన్స్ సెమినార్‌ను ఈనెల 11 లోగా, డివి జన్ స్థాయిలో ఈనెల 18 లోగా నిర్వహించుకోవాలన్నారు. పాఠశాల స్థాయిలో హెచ్ఎం లు, ప్రిన్సిపాల్స్, డివిజన్ స్థాయిలో డిప్యూటీ ఈఓల ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంటుం దన్నారు. పాఠశాల స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన వారు డివిజన్ స్థాయికి అర్హులని, డివిజన్ స్థాయిలో మొదటి ఐదు స్థానా ల్లో నిలిచిన వారు జిల్లాస్థాయికి అర్హులని వివరించారు. జిల్లాస్థాయి సె మినార్‌లో మొదటి, రెండు స్థానాలు లభించి న విద్యార్థులను ఈనెల 30న నిర్వహించే రాష్ట్ర స్థాయి జాతీయ సెమినార్‌కు పంపిస్తామని, ఒక్కో విద్యార్థి ఆరు నిమిషాలు మాట్లాడాలని, నిపుణులు ప్రశ్నలు అడుగుతారని తెలిపారు. -
నర్సరీ నుంచి ప్రభుత్వ పాఠ్య పుస్తకాలే
♦ తప్పనిసరి చేయనున్న ఎస్సీఈఆర్టీ ♦ ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలు వినియోగిస్తే చర్యలు సాక్షి, హైదరాబాద్: నర్సరీ విద్యార్థికి బ్యాలెన్స్డ్ డైట్‌పై ప్రాజెక్టు వర్క్... ఎల్కేజీ విద్యార్థికి జనరల్ నాలెడ్జిపై మరో ప్రాజెక్టు. మాటలే సరిగ్గా రాని వయసులో అశాస్త్రీయ పద్ధతిలో విద్యా బోధన. ఇష్టారాజ్యంగా ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలతో కుస్తీలు. ఆట, పాటలు, అలవాట్లు నేర్పించాల్సిన వయస్సులో ఇష్టారాజ్యంగా చదువులు... పిల్లలపై మానసిక ఒత్తిడి. ఇదీ రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు, ప్లే స్కూళ్లలో ప్రస్తుతం అమలు చేస్తున్న విద్యా విధానం. స్వయంగా విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) అధికారుల పరిశీలనలో వెల్లడైన వాస్తవాలు. అందుకే రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ నుంచి ఇష్టారాజ్యంగా సిలబస్‌ను అమలును కట్టడి చేసేందుకు ఎస్సీఈఆర్టీ కసరత్తు ప్రారంభించింది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీల్లోనూ ప్రభుత్వం సూచించే సిలబస్‌నే బోధించేలా చర్యలు చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. 80 శాతం మెదడు అభివృద్ధి చెందే వయసు పిల్లలకు వినడం.. పరిశీలించడం.. మాట్లాడించడం నేర్పించాలన్న మాంటిస్సోరీ విధానాన్ని పక్కనబెట్టి అశాస్త్రీయ విధానాలతో.. అనవసరపు ఒత్తిడిని తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి బోధించాల్సిన సిలబస్ రూపకల్పనకు ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదు శాస్త్రీయ పద్ధతిలో ప్రభుత్వం రూపొందించే సిలబస్‌లోనే అన్ని ప్రైవేటు పాఠశాలల్లో బోధన కొనసాగించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి (జూన్) దీనిని పక్కాగా అమలు చే యనుంది. ఇందుకు భిన్నంగా వ్యవహరించే ప్లే స్కూళ్లు, ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను వినియోగించే పాఠశాలలపై కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధం అవుతోంది. వచ్చే నెలాఖరుకు సిలబస్ రెడీ... ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్లేస్కూల్ లిఫ్ట్‌లో విద్యార్థి పడి మరణించిన నేపథ ్యంలో విద్యాశాఖ ప్లే స్కూళ్లు, ప్రీప్రైమరీ విద్యాబోధన, ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేస్తున్న విధానాలపై తీవ్రంగా స్పందించింది. ఇందులో భాగంగాా ప్రతి ప్లేస్కూలూ గుర్తింపు పొందాల్సిందేనని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే దాదాపు అన్ని ప్రైవేటు పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీల్లో ఆశాస్త్రీయ విధానంలో విద్యా బోధన కొనసాగుతుందని, అది విద్యార్థులపై ఒత్తిడిని పెంచడమే కాకుండా వారి మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న విషయాన్ని గుర్తించింది. అవసరమైన సిలబస్‌ను రూపొందించాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే వివిధ వర్గాలు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలతో వర్క్‌షాప్ నిర్వహించనుంది. అలాగే ప్రస్తుతం వివిధ ప్లేస్కూళ్లు, ప్రైవేటు పాఠశాలలు అమలు చేస్తున్న పబ్లిషర్ల పుస్తకాలను పరిశీలించేందుకు చర్యలు చేపడుతోంది. మరోవైపు కర్ణాటకలో ప్రీప్రైమరీకి బోధించేందుకు రూపొందించిన సిలబస్‌ను కూడా పరిశీలించి, శాస్త్రీయ పద్ధతిలో సిలబస్‌ను రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మొత్తానికి వచ్చే నెలాఖరులోగా సిలబస్‌ను సిద్ధం చేసి, పుస్తకాల ముద్రణకు చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. తద్వారా వచ్చే జూన్ 13న పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి శాస్త్రీయ విధానంలో రూపొందించిన పుస్తకాలను అందుబాటులోకి తే సుకువచ్చేందుకు ఎస్సీఈఆర్టీ చర్యలు చేపడుతోంది. వాటి అమలు పర్యవేక్షణ బాధ్యతలను డీఈవోలు తీసుకోవాలని, అమలు చేయని పాఠశాలలపై కఠిన చర్యలు చేపట్టేలా నిబంధనలు తీసుకురాబోతోంది. -
పాఠశాల విద్యలో ‘రా’
సైన్స్, మ్యాథ్స్‌లకు ప్రాధాన్యమిస్తూ కొత్త పథకానికి కేంద్రం శ్రీకారం సాక్షి, హైదరాబాద్: ఒకటి నుంచి 12వ తరగతి వరకు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులకు ప్రాధాన్యం పెంచుతూ, వాటిపై ఆసక్తిని పెంపొందించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ (రా) పేరుతో కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అవసరమైన చర్యలపై ఇటీవల ఢిల్లీలో వివిధ రాష్ట్రాల విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) అధికారులతో సమావేశాన్ని నిర్వహించింది. ఈ పథకం కింద సైన్స్, మ్యాథ్స్, టెక్నాలజీ సబ్జెక్టులపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచి, ఆయా రంగాల వైపు వారిని మళ్లించాలని స్పష్టం చేసింది. నూతన పథకంలో భాగంగా కేంద్రం చేసిన సూచనల్లో ముఖ్యాంశాలివి... * 6 నుంచి 18 ఏళ్ల వయస్సు పిల్లలే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేయాలి. * ముఖ్యంగా పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకున్న విద్యార్థులకు ఆయా రంగాలకు సంబంధించిన అంశాలపై బోధన, స్టడీ టూర్లు, విజిటింగ్ల వంటి కార్యక్రమాలను నిర్వహించాలి. * తరగతి బోధనే కాకుండా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచే కార్యక్రమాలు, ప్రయోగ పద్ధతులను అమలు చేయాలి. * పాఠశాలల్లో సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్‌లను అభివృద్ధి పరచాలి. నాణ్యతా ప్రమాణాలు పెంచాలి. * టీచింగ్ లెర్నింగ్ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేలా చర్యలు చేపట్టాలి. * ఉన్నత విద్యా రంగానికి చెందిన వారితోనూ పాఠశాలల్లో పాఠాలు చెప్పించాలి. టీచర్ సర్కిళ్లు, సైన్స్, మ్యాథ్స్ క్లబ్బులు ఏర్పాటు చేయాలి * ఒలింపియాడ్ వంటి పోటీలకు విద్యార్థులను సిద్ధం చేయాలి. స్కూళ్లలో సరిపడా సైన్స్, మ్యాథ్స్ టీచర్లను నియమించాలి. పాఠ్యాంశాల రూపకల్పనకు కసరత్తు ఈ కార్యక్రమాలన్నింటికీ అనుగుణంగా సిలబస్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా పాఠ్య పుస్తకాల్లో ప్రధానంగా 11 విభాగాలకు చెందిన వివిధ అంశాల్లో మార్పులు అవసరమని జాతీయ విద్యా పరిశోధన, ఎన్సీఈఆర్టీ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఆ దిశగా రాష్ట్ర విద్యా పరిశోధన, ఎస్సీఈఆర్టీ కసరత్తు చేస్తోంది.