టెన్త్‌ ప్రశ్నపత్రంలోనే బిట్‌ పేపర్‌ | Bit paper is in Tenth question paper Itself | Sakshi
Sakshi News home page

టెన్త్‌ ప్రశ్నపత్రంలోనే బిట్‌ పేపర్‌

Published Wed, Feb 19 2020 5:04 AM | Last Updated on Wed, Feb 19 2020 5:05 AM

Bit paper is in Tenth question paper Itself - Sakshi

సాక్షి, అమరావతి: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇకపై ఒకే ప్రశ్నపత్రం ఉంటుంది. గతంలో సాధారణ ప్రశ్నలకు, బిట్‌ పేపర్‌కు వేర్వేరుగా పత్రాలు ఇచ్చేవారు. ఇక నుంచి ఒకే పత్రంలో సాధారణ ప్రశ్నలు, బిట్‌ ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) బ్లూప్రింట్‌ను సిద్ధం చేసింది. ఆరో తరగతి నుంచి టెన్త్‌ ప్రీ ఫైనల్‌ పరీక్ష వరకు అనుసరించాల్సిన విధానం, పబ్లిక్‌ పరీక్షల విధానాన్ని ఇందులో పొందుపరిచింది. దీనిపై అన్ని జిల్లాల విద్యాధికారులతో ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి గురువారం టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.  

ఎస్‌సీఈఆర్‌టీ మంగళవారం ఇచ్చిన సర్క్యులర్‌లో ముఖ్యాంశాలు
- టెన్త్‌ పరీక్షల్లో ఇంటర్నల్‌ మార్కులకు వెయిటేజీ ఉండదు 
- ప్రీఫైనల్, పబ్లిక్‌ పరీక్షల్లో ప్రతి పేపర్‌ 100 మార్కులకు ఉంటుంది  
- ప్రస్తుతమున్న 11 పేపర్లు యథాతథంగా ఉంటాయి 
- ఫస్ట్‌ లాంగ్వేజ్, థర్డ్‌ లాంగ్వేజ్, అన్ని నాన్‌ లాంగ్వేజ్‌ సబ్జెక్టులలో రెండేసి పేపర్లు ఉంటాయి 
- సెకండ్‌ లాంగ్వేజ్‌లో ఒకే పేపర్‌ 100 మార్కులకు ఉంటుంది 
- కాంపోజిట్‌ కోర్సు 1వ పేపర్‌ 70 మార్కులకు, 2వ పేపర్‌ 30 మార్కులకు ఉంటుంది 
బిట్‌ పేపర్‌ ప్రత్యేకంగా ఉండదు. ఒకే పత్రంలో అన్ని కేటగిరీల ప్రశ్నలుంటాయి 
- ప్రతి పరీక్షకు 2.45 గంటల సమయం ఇస్తారు. (15 నిముషాలు ప్రశ్నపత్రం చదువుకోవడానికి, 2.30 గంటలు సమాధానాలు 
రాసేందుకు) 
- ఓరియంటల్‌ ఎస్సెస్సీ మెయిన్‌ లాంగ్వేజ్‌/ఫస్ట్‌ లాంగ్వేజ్‌ కాంపోజిట్‌ కోర్సు పరీక్ష మాత్రం 3.15 గంటలు ఉంటుంది. 
- ఫస్ట్‌ లాంగ్వేజ్‌ కాంపోజిట్‌ 2వ పేపర్‌ 1.45 గంటలు ఉంటుంది 
- సెకండ్‌ లాంగ్వేజ్‌కు 3.15 గంటలు 
- వార్షిక పరీక్షల్లో విద్యార్థులు సమాధానాలు రాసేందుకు 24 పేజీల బుక్‌లెట్‌ అందిస్తారు. 
- మార్కుల మెమోలో గ్రేడ్‌లు, గ్రేడ్‌ పాయింట్లను సబ్జెక్టు వారీగా, పేపర్ల వారీగా పొందుపరుస్తారు.  
ఆయా సబ్జెక్టుల్లో 1, 2వ పేపర్లలో వచ్చినవి కలిపి పాస్‌ మార్కులను నిర్ణయిస్తారు. పేపర్ల వారీగా పాస్‌మార్కులను పరిగణనలోకి తీసుకోరు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement