Tenth Class annual exams
-
గంట ముందే రండి
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలు గురువారం ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం పూర్తి చేసింది. ఉదయం 9:30 గంటలకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు పరీక్ష సమయం కంటే కనీసం గంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఆలస్యంగా వెళ్లి నష్టపోవద్దని స్పష్టం చేశారు. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులు మాస్క్‌లు ధరించాలని, వాటర్ బాటిళ్లను అనుమతిస్తామని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సబ్బులు, లిక్విడ్ సబ్బులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అనారోగ్యంతో ఉన్న వారు ప్రత్యేక గదుల్లో పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ఎవరి సంతకం అవసరం లేకుండానే అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సమస్యలు ఉంటే తమ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌కు (040–23230942) ఫోన్ చేయవచ్చని సూచించారు. అవిభక్త కవలలు వీణావాణీలకు స్టేట్ హోం సమీపంలోని పాఠశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని, వారు సొంతంగా పరీక్ష రాస్తామని మొదట్లో చెప్పినా అది సాధ్యమయ్యే పరిస్థితి లేదన్నారు. అందుకే వారి విజ్ఞప్తి మేరకు సహాయకులను (స్క్రైబ్స్) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాధారణ పరీక్ష సమయం కంటే వారికి అదనంగా అరగంట సమయం ఇస్తామని తెలిపారు. -
రేపటి నుంచే టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ పరీక్షల విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,530 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులు అంతా ఒకేసారి రాకుండా, ఒకేచోట గుంపులుగా ఉండకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఎంత మందుగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించడమే కాకుండా పరీక్ష హాల్లోకి పంపించేలా చర్యలు చేపట్టాలని డీఈవోలను ఆదేశించినట్లు చెప్పారు. బాలురే అధికం.. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు 11,045 పాఠశాలలకు చెందిన 5,34,903 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అందులో 2,73,971 మంది బాలురు కాగా, 2,60,932 మంది బాలికలున్నారు. మొత్తం విద్యార్థులు 5,09,079 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 25,824 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. పరీక్షల నిర్వహణలో 30,500 మంది టీచర్లు ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మాల్ ప్రాక్టీస్‌ను నిరోధించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి 144 సిట్టింగ్ స్క్వాడ్స్, 4 ఫ్ల్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటుచేశారు. అధికారులతో మంత్రి సబిత సమీక్ష విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలు బాగా రాయాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షల ఏర్పాట్లపై మంగళవారం ఆమె అధికారులతో సమీక్షించారు. కోవిడ్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎవరైనా విద్యార్థులు జలుబు, దగ్గుతో బాధపడుతూ అనారోగ్యంగా ఉంటే వారి కోసం ప్రత్యేక గదుల్లో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు చేతులను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి పరీక్షా కేంద్రంలోనూ శానిటైజర్లు, లిక్విడ్ సోప్‌లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. విద్యార్థులు మాస్కులు ధరించినా, వాటర్ బాటిళ్లు తెచ్చినా అనుమతిస్తామన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లను రిజర్వులో ఉంచుతున్నామని, ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారి స్థానంలో ఇతరులను నియమిస్తామని చెప్పారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. గ్రేస్ పీరియడ్ ఉండదు.. గతంలో మాదిరిగా గ్రేస్ పీరియడ్ అంటూ ఏమీ ఉండదని, ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమయ్యాక విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని సత్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు. అందుకే విద్యార్థులు వీలైనంత ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఆలస్యంగా వచ్చి నష్టపోవద్దని చెప్పారు. కనీసం గంట ముందుగానే (ఉదయం 8:30 గంటలకల్లా) వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని.. ముందురోజే ఓ సారి పరీక్ష కేంద్రాన్ని చూసుకుంటే మంచిదని సూచించారు. ఇప్పటికే హాల్‌టికెట్లను పంపిణీ చేశామని, అందని వారు తమ వెబ్సైట్ నుంచి (www.bse. telangana.gov.in) డౌన్లోడ్ చేసుకొని నేరుగా పరీక్షలకు హాజరు కావచ్చని వెల్లడించారు. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లపై ఎవరి సంతకం అక్కర్లేదని స్పష్టంచేశారు. వేసవి దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో వైద్య సిబ్బంది.. ఇప్పటివరకు వెబ్సైట్ నుంచి 4.05 లక్షల మంది విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నట్లు సబిత వెల్లడించారు. వేసవి తీవ్రత దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో ఇద్దరు చొప్పున వైద్య సిబ్బందిని, అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలోనూ (040–23230942), జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయాల్లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూం లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్ ప్రశ్నపత్రంలోనే బిట్ పేపర్
సాక్షి, అమరావతి: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇకపై ఒకే ప్రశ్నపత్రం ఉంటుంది. గతంలో సాధారణ ప్రశ్నలకు, బిట్ పేపర్‌కు వేర్వేరుగా పత్రాలు ఇచ్చేవారు. ఇక నుంచి ఒకే పత్రంలో సాధారణ ప్రశ్నలు, బిట్ ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) బ్లూప్రింట్‌ను సిద్ధం చేసింది. ఆరో తరగతి నుంచి టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్ష వరకు అనుసరించాల్సిన విధానం, పబ్లిక్ పరీక్షల విధానాన్ని ఇందులో పొందుపరిచింది. దీనిపై అన్ని జిల్లాల విద్యాధికారులతో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఎస్సీఈఆర్టీ మంగళవారం ఇచ్చిన సర్క్యులర్‌లో ముఖ్యాంశాలు - టెన్త్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులకు వెయిటేజీ ఉండదు - ప్రీఫైనల్, పబ్లిక్ పరీక్షల్లో ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుంది - ప్రస్తుతమున్న 11 పేపర్లు యథాతథంగా ఉంటాయి - ఫస్ట్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, అన్ని నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులలో రెండేసి పేపర్లు ఉంటాయి - సెకండ్ లాంగ్వేజ్‌లో ఒకే పేపర్ 100 మార్కులకు ఉంటుంది - కాంపోజిట్ కోర్సు 1వ పేపర్ 70 మార్కులకు, 2వ పేపర్ 30 మార్కులకు ఉంటుంది - బిట్ పేపర్ ప్రత్యేకంగా ఉండదు. ఒకే పత్రంలో అన్ని కేటగిరీల ప్రశ్నలుంటాయి - ప్రతి పరీక్షకు 2.45 గంటల సమయం ఇస్తారు. (15 నిముషాలు ప్రశ్నపత్రం చదువుకోవడానికి, 2.30 గంటలు సమాధానాలు రాసేందుకు) - ఓరియంటల్ ఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్/ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు పరీక్ష మాత్రం 3.15 గంటలు ఉంటుంది. - ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ 2వ పేపర్ 1.45 గంటలు ఉంటుంది - సెకండ్ లాంగ్వేజ్‌కు 3.15 గంటలు - వార్షిక పరీక్షల్లో విద్యార్థులు సమాధానాలు రాసేందుకు 24 పేజీల బుక్లెట్ అందిస్తారు. - మార్కుల మెమోలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లను సబ్జెక్టు వారీగా, పేపర్ల వారీగా పొందుపరుస్తారు. - ఆయా సబ్జెక్టుల్లో 1, 2వ పేపర్లలో వచ్చినవి కలిపి పాస్ మార్కులను నిర్ణయిస్తారు. పేపర్ల వారీగా పాస్‌మార్కులను పరిగణనలోకి తీసుకోరు. -
క్లుప్తత.. సమగ్రత
సాక్షి, అమరావతి: పదో తరగతి వార్షిక పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు తీసుకొస్తోంది. విద్యార్థుల్లో సమగ్ర విషయావగాహన, గుణాత్మక సామర్థ్యాలు, ప్రమాణాలను అంచనా వేసేందుకు ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. సబ్జెక్టులను బట్టీపట్టి ఆన్సర్లు రాసేలా కాకుండా ఆయా అంశాలను సమగ్రంగా అర్థం చేసుకొని, అవగాహనతో సమాధానాలు రాసేలా ప్రశ్నలు అడగనుంది. పాఠశాలల్లో కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న బట్టీ విధానానికి స్వస్తి పలకనుంది. టెన్త్ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు క్లుప్తంగా, సమగ్రతతో కూడిన సమాధానాలు రాయాల్సి ఉంటుంది. వ్యాసరూప ప్రశ్నల సంఖ్య తగ్గింపు విద్యార్థులపై పరీక్షల భారం తగ్గించాలని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనిప్రకారం పరీక్షల్లో దీర్ఘ సమాధానాలుండే వ్యాసరూప సమాధానాల ప్రశ్నల సంఖ్యను తగ్గించి స్వల్ప, అతి స్వల్ప సమాధానాల ప్రశ్నల సంఖ్యను పెంచింది. 60 శాతం మేర ప్రశ్నలు ఈ కేటగిరీలోనే ఉండేలా ప్రశ్నపత్రాలను రూపొందిస్తారు. ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు ఒక్క పదంతో సమాధానమిస్తే చాలు. అతి స్వల్ప ప్రశ్నలకు ఒకటి లేదా రెండు వాక్యాల సమాధానం రాయాలి. స్వల్ప ప్రశ్నలకు రెండు నుంచి 4 వాక్యాల సమాధానమివ్వాలి. ఎస్సే ప్రశ్నలకు 8 నుంచి 10 వాక్యాల్లో సమాధానమిస్తే చాలు. అన్ని సబ్జెక్టులు 100 మార్కులకే... విద్యాహక్కు చట్టం ప్రకారం నిరంతర, సమగ్ర మూల్యాంకన(సీసీఈ) విధానాన్ని పాఠశాల విద్యాశాఖ అమలు చేస్తోంది. విద్యార్థులతో ప్రాజెక్టు వర్కులు, క్షేత్రస్థాయి పర్యటనలు, ఇతర కార్యకలాపాలు నిర్వహించి, వాటికి మార్కులు కేటాయిస్తున్నారు. ఈ ప్రాజెక్టులకు కేటాయిస్తున్న మార్కులు 20 శాతం. వాటిని వార్షిక పరీక్షలకు కలుపుతున్నారు. వార్షిక పరీక్షల్లో ఒక్కో సబ్జెక్టులో 80 మార్కులే (పేపర్–1లో 40 మార్కులు, పేపర్–2లో 40 మార్కులు) ఉంటాయి. అయితే, అంతర్గత మార్కులను రద్దు చేయాలని వచ్చిన డిమాండ్ల మేరకు ప్రభుత్వం గతంలో వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఈసారి పరీక్షలను 100 మార్కులకే నిర్వహిస్తున్నారు. ఒక్కో సబ్జెక్టులో పేపర్–1లో 50 మార్కులు, పేపర్–2లో 50 మార్కులు ఉంటాయి. ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు ఆన్సర్ షీట్లను వేర్వేరుగా ఇచ్చేవారు. మాస్ కాపీయింగ్‌ను నిరోధించడానికి విద్యాశాఖ ఈసారి బుక్లెట్లను అందించనుంది. 24 పేజీల బుక్‌లెట్‌లో విద్యార్థులు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. -
మార్చి 19 నుంచి టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్ : పదో తరగతి వార్షిక పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. 2020, మార్చి 19వ తేదీ నుంచి పరీక్షలను ప్రారంభించేలా ప్రభుత్వ పరీక్షల విభాగం టైం టేబుల్ ఖరారుచేసి ప్రకటించిం ది. ఎస్ఎస్సీ రెగ్యులర్, ప్రైవేటు, ఒకేషనల్, ఓఎస్ఎస్సీ విద్యార్థులకు ఈ టైం టేబుల్ వర్తిస్తుందని తెలిపింది. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 12:15 గంట ల వరకు కొనసాగుతాయని పే ర్కొంది. ద్వితీయ భాష పరీక్ష, ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1, పేపరు–2 పరీక్షలు మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంట ల వరకు ఉంటాయని వెల్లడించిం ది. అలాగే కాంపోజిట్ కోర్సు ప్ర థమ భాష పేపర్–2 పరీక్ష 10:45 గంటల వరకు, ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు పరీక్ష 11:30 గంటల వరకు కొనసాగుతాయని వివరించింది. విద్యార్థులకు పరీక్షలో ఆఖరి అరగంట ముందు ఆబ్జెక్టివ్ పేపర్‌ను ఇస్తారని చెప్పింది. -
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ షెడ్యూల్ ప్రకటించారు. ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరక పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. పరీక్షల షెడ్యూల్ మార్చి 23 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 మార్చి 24 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 మార్చి 26 : సెంకండ్ లాంగ్వేజ్ మార్చి 27 : ఇంగ్లీష్ పేపర్ 1 మార్చి 28 : ఇంగ్లీష్ పేపర్ 2 మార్చి 30 : గణితం పేపర్ 1 మార్చి 31 : గణితం పేపర్ 2 ఏప్రిల్ 01 : సైన్స్ పేపర్ 1 ఏప్రిల్ 03 : జనరల్ సైన్స్ పేపర్ 2 ఏప్రిల్ 04 : సోషల్ స్టడీస్ పేపర్ 1 ఏప్రిల్ 06 : సోషల్ స్టడీస్ పేపర్ 2 ఏప్రిల్ 07 : సంస్కృతం, అరబిక్, పెర్షియన్ సబ్జెక్ట్ ఏప్రిల్ 8 : ఒకేషనల్ పరీక్షలు -
అక్టోబర్ 29 వరకు టెన్త్ ఫీజు గడువు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరుకావాలనుకునే విద్యార్థులు అక్టోబర్ 29వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 13 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో నవంబర్ 27 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 11 వరకు పరీక్ష ఫీజును సంబంధిత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు చెల్లించాలని పేర్కొన్నారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు రూ.125 చెల్లించాలని, ఫెయిల్ అయిన విద్యార్థులు 3 అంతకంటే తక్కువ సబ్జెక్టులకు రూ.110, 3 కంటే ఎక్కువ సబ్జెక్టులు అయితే రూ.125 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వొకేషనల్ విద్యార్థులు రెగ్యులర్ ఫీజు రూ.125లకు అదనంగా మరో రూ.60 చెల్లించాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.24 వేల లోపు ఉంటే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.20 వేల లోపు వార్షిక ఆదాయం కలిగి ఉన్నా లేదా 2.5 ఎకరాల వెట్ ల్యాండ్ లేదా 5 ఎకరాల డ్రై ల్యాండ్ కలిగిన వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. -
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
5 నిమిషాలు దాటితే అనుమతించరు.. సాక్షి, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు నిర్వహిస్తారు. ద్వితీయ భాష, ఓరియంటల్ ఎస్సెస్సీ, కాంపొజిట్ కోర్సు పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఉంటాయి. విద్యార్థులను ఉదయం 8.45 నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. షెడ్యూల్ సమయానికి 5 నిమిషాలు దాటితే (9.35 వరకు) పరీక్షహాల్లోకి అనుమతించరు. హాల్‌టికెట్ పోగొట్టుకున్న వారు bsetelangana.org నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిపై ప్రధానోపాధ్యాయుడి సంతకం అవసరం లేదు. వాటితో నేరుగా పరీక్షకు హాజరు కావచ్చు. ఈ పరీక్షలకు మొత్తం 5,38,226 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వారిలో రెగ్యులర్ విద్యార్థులు 5,09,831 మంది, వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు 28,395 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,556 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. నేడు ఓరియంటల్ ఎస్సెస్సీ పేపరు–1 పరీక్ష జరగనుంది. -
తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన టెన్త్ పరీక్షలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొత్తం 2,615 కేంద్రాల్లో ఆయా తేదీల్లో రోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఒక్క ద్వితీయ భాష పేపర్ మాత్రం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతుంది. మొత్తంగా ఈ పరీక్షలకు 5,67,478 మంది విద్యార్థులు హాజరు అవుతున్నారు. పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైందని, విద్యార్థులు నిర్ణీత సమయానికన్నా గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 9:30 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయని, ఐదు నిమిషాల వరకు మాత్రమే ఆలస్యాన్ని అంగీకరిస్తారని... అంతకుమించి ఆలస్యమైతే పరీక్ష హాల్లోకి అనుమతించబోరని స్పష్టం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోనూ టెన్త్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,57, 595 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షకేంద్రానికి ముందుగా చేరుకోవాలని సూచించారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని చెప్పారు. మొదటి రోజు ట్రాఫిక్ పాటు పరీక్ష కేంద్రం కోసం వెతుక్కోవలసిన పరిస్థితుల దృష్ట్యా పరీక్షకు వచ్చే వారికి అరగంట ఆలస్యమైనా అనుమతిస్తామన్నారు. మిగతా రోజుల్లో మాత్రం పరీక్ష ప్రారంభమానికి ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. -
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
హాజరుకానున్న 5.67 లక్షల మంది విద్యార్థులు ♦ ఉదయం 9:30 నుంచి పరీక్షలు ప్రారంభం ♦ గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారుల సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమవుతున్నాయి. 2,615 కేంద్రాల్లో ఆయా తేదీల్లో రోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఒక్క ద్వితీయ భాష పేపర్ మాత్రం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతుంది. మొత్తంగా ఈ పరీక్షలకు 5,67,478 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైందని, విద్యార్థులు నిర్ణీత సమయానికన్నా గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 9:30 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయని, ఐదు నిమిషాల వరకు మాత్రమే ఆలస్యాన్ని అంగీకరిస్తారని... అంతకుమించి ఆలస్యమైతే పరీక్ష హాల్లోకి అనుమతించబోరని స్పష్టం చేశారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ► స్కూల్ యూనిఫారంతో రావద్దు. ఇతర సాధారణ దుస్తులు ధరించాలి. ► ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగ్‌లు, పుస్తకాలను అనుమతించరు. ► బ్లాక్ లేదా బ్లూ పెన్నుతోనే పరీక్షలు రాయాలి. ► జవాబు పత్రాల లోపల ఎలాంటి గుర్తులు పెట్టవద్దు. హాల్‌టికెట్ నంబర్, ఫోన్ నంబర్ వంటివి రాయవద్దు. ► ఏదైనా సహాయం అవసరమైతే హెల్ప్‌లైన్ కేంద్రానికి (040-23230942) ఫోన్ చేయవచ్చు.