నేటి నుంచి టెన్త్ పరీక్షలు | Tenth exams from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి టెన్త్ పరీక్షలు

Published Mon, Mar 21 2016 3:06 AM | Last Updated on Sun, Sep 3 2017 8:12 PM

నేటి నుంచి టెన్త్ పరీక్షలు

నేటి నుంచి టెన్త్ పరీక్షలు

హాజరుకానున్న 5.67 లక్షల మంది విద్యార్థులు
♦ ఉదయం 9:30 నుంచి పరీక్షలు ప్రారంభం
♦ గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారుల సూచన

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమవుతున్నాయి. 2,615 కేంద్రాల్లో ఆయా తేదీల్లో రోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఒక్క ద్వితీయ భాష పేపర్ మాత్రం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతుంది. మొత్తంగా ఈ పరీక్షలకు 5,67,478 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైందని, విద్యార్థులు నిర్ణీత సమయానికన్నా గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 9:30 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయని, ఐదు నిమిషాల వరకు మాత్రమే ఆలస్యాన్ని అంగీకరిస్తారని... అంతకుమించి ఆలస్యమైతే పరీక్ష హాల్లోకి అనుమతించబోరని స్పష్టం చేశారు.

 ఈ జాగ్రత్తలు తప్పనిసరి
► స్కూల్ యూనిఫారంతో రావద్దు. ఇతర సాధారణ దుస్తులు ధరించాలి.
► ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగ్‌లు, పుస్తకాలను అనుమతించరు.
► బ్లాక్ లేదా బ్లూ పెన్నుతోనే పరీక్షలు రాయాలి.
► జవాబు పత్రాల లోపల ఎలాంటి గుర్తులు పెట్టవద్దు. హాల్‌టికెట్ నంబర్, ఫోన్ నంబర్ వంటివి రాయవద్దు.
► ఏదైనా సహాయం అవసరమైతే హెల్ప్‌లైన్ కేంద్రానికి (040-23230942) ఫోన్ చేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement