సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరుకావాలనుకునే విద్యార్థులు అక్టోబర్ 29వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 13 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో నవంబర్ 27 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 11 వరకు పరీక్ష ఫీజును సంబంధిత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు చెల్లించాలని పేర్కొన్నారు.
రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు రూ.125 చెల్లించాలని, ఫెయిల్ అయిన విద్యార్థులు 3 అంతకంటే తక్కువ సబ్జెక్టులకు రూ.110, 3 కంటే ఎక్కువ సబ్జెక్టులు అయితే రూ.125 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వొకేషనల్ విద్యార్థులు రెగ్యులర్ ఫీజు రూ.125లకు అదనంగా మరో రూ.60 చెల్లించాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.24 వేల లోపు ఉంటే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.20 వేల లోపు వార్షిక ఆదాయం కలిగి ఉన్నా లేదా 2.5 ఎకరాల వెట్ ల్యాండ్ లేదా 5 ఎకరాల డ్రై ల్యాండ్ కలిగిన వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
అక్టోబర్ 29 వరకు టెన్త్ ఫీజు గడువు
Published Thu, Sep 26 2019 3:17 AM | Last Updated on Thu, Sep 26 2019 3:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment