( ఫైల్ ఫోటో )
సాక్షి, విజయవాడ: ప్రభుత్వాన్ని అప్రతిష్ణపాలు చేసేలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై విద్యా శాఖ తరపున స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విద్యా శాఖ ఫిర్యాదుపై ఇబ్రహింపట్నం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాల పరిచయం కోసం అన్ని మతాల పండగలకి సమాన ప్రాధాన్యనిస్తూ తెలుగు వాచకంలో రెండవ తరగతి నుంచి ఏడో తరగతి వరకు పాఠ్యపుస్తకాల రూపకల్పన చేశామన్నారు.
చదవండి: దుర్గమ్మ పాఠ్యాంశాలను తొలగించలేదు
పాఠ్యపుస్తకాలలో హిందూ పండుగలు - 7, ముస్లిమ్ పండుగలు - 2 , క్రిస్టియన్ పండుగలు - 2, సవరల పండుగ- ఒకటి చొప్పున పాఠ్యాంశాలు ఉన్నాయని తెలిపారు. మొత్తం 12 పండగలు గురించి పాఠ్యాంశాల్లో పొందుపరిచి అన్ని మతాలకి సమ ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. ఇందులో నుంచి ఒక్క పండగ మాత్రమే ఎంపిక చేసి హిందూ మతానికి అన్యాయం జరుగుతున్నట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. అందుకోసమే ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు.
చదవండి: శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేయకపోతే కృష్ణా జలాలు వృథా
Comments
Please login to add a commentAdd a comment