ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నేత శ్యామ్ పిట్రోడా ఇటీవల వారసత్వ పన్నుపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటంతో.. అధికార బీజేపీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. తాజాగా ఆయన జాతీయ ఐక్యతపై చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. ఓ ఇంటర్వ్యూ భారత్ గురించి మాట్లాడారు.
"We could hold together a country as diverse as India, where people on East look like Chinese, people on West look like Arab, people on North look like maybe White and people in South look like Africa" 💀💀
(VC : @TheStatesmanLtd) pic.twitter.com/aPQUyJflag— Darshan Pathak (@darshanpathak) May 8, 2024
‘భారత్‌లో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. తూర్పు వైపు ఉన్న ప్రజలు చైనా వారిని పోలి ఉంటారు. దక్షిణం వైపు ఉన్న ప్రజలు అరబ్ వారిలా ఉంటారు. ఉత్తర దిక్కు వాళ్లు అయితే నల్లగా లేదా తెల్లగా ఉంటారు. దక్షిణ భారతంలోని ప్రజలు అఫ్రికా వారిలా కనిపిస్తారు’ అని శ్యామ్ పిట్రోడా తెలిపారు.
Sam bhai, I am from the North East and I look like an Indian. We are a diverse country - we may look different but we are all one.
Hamare desh ke bare mein thoda to samajh lo! https://t.co/eXairi0n1n— Himanta Biswa Sarma (Modi Ka Parivar) (@himantabiswa) May 8, 2024
శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఖండించారు. ‘శ్యామ్ భాయ్.. నేను ఈశాన్య భారతీయుడను. నేను భారతీయుడిలాగే కనిపిస్తాను. భిన్నత్వమున్న దేశంలో ఉన్నా.. భిన్నంగా కనిపించినా మేమంతా ఒక్కటే అని ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ వేశారు. ముందు భారత దేశ భిన్నత్వం గురించి ఎంతోకొంత అర్థం చేసుకోవాలని శ్యామ్ ప్రిటోడాకు హితవు పలికారు. శ్యామ్ చేసిన వ్యాఖ్యలపై ఈశాన్య భారతంలోని ముఖ్యమంత్రులు, మణిపూర్ సీఎం ఎన్ బిరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment