న్యూఢిల్లీ: ముస్లిం వ్యాపారుల వల్లనే కాయగూరల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యలకు ప్రతి స్పందిస్తూ ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. మీ ఇళ్లలో గేదెలు పాలు ఇవ్వకపోయినా దానికి ముస్లింలే కారణం అనేలా ఉన్నారే.. అంటూ ట్విట్టర్లో ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
అస్సామీయులు ఎప్పుడు వ్యాపారం చేసినా కాయగూరల ధరలు ఇంతగా పెరగలేదని ముస్లిం వ్యాపారులే ధరలను పెంచుకుంటూ పోతున్నారని అన్నారు. మీరే చెప్పండి కాయగూరల ధరలను పెంచింది ఎవరు మియాలు(అసోంలో ఉంటూ బెంగాలీ మాట్లాడే స్థానిక ముస్లింలు) కాదా? అని ఎదురు ప్రశ్నించారు. ఈ సందర్బంగా మియా సంఘం వారిని బయటవారిగా చెబుతూ వారు అస్సామీ సంస్కృతిని, భాషని కించపరుస్తూ చాలా జాత్యహంకారంతో వ్యవహరిస్తూ ఉంటారని ఘాటు విమర్శలు చేశారు.
అసోం సీఎం చేసిన ఈ వ్యాఖ్యలకు ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. అసోంలో ఒక విచిత్రమైన గుంపు తయారయ్యింది. వారింట్లో గేదె పాలు ఇవ్వకపోయినా, కోడి గుడ్డు పెట్టక పోయినా దానికి మియాలే కారణమంటారు. బహుశా వారి వ్యక్తిగత వైఫల్యాలకు కూడా మియా భాయ్ మీద నిందలు వేస్తారేమోనని చురకలంటించారు.
మన ప్రధాని విదేశీ ముస్లింలతో చాలా చనువుగా ఉంటారు కదా మరి అక్కడికి వెళ్ళినప్పుడు టమాటాలు, పాలకూరను, బంగాళాదుంపలను ఎగుమతి చేయమని ఆయా దేశాలను కోరితే బాగుంటుందని ఎద్దేవా చేశారు.
देश में एक ऐसी मंडिली है जिसके घर अगर भैंस दूध ना दे या मुर्ग़ी अण्डा ना दे तो उसका इल्ज़ाम भी मियाँ जी पर ही लगा देंगे। शायद अपने “निजी” नाकामियों का ठीकरा भी मियाँ भाई के सर ही फोड़ते होंगे।आज कल मोदी जी की विदेशी मुसलमानों से गहरी यारी चल रही है, उन्हीं से कुछ टमाटर, पालक, आलू… https://t.co/1MtjCnrmDT
— Asaduddin Owaisi (@asadowaisi) July 14, 2023
ఇది కూడా చదవండి: రాంగ్ రూటులో వచ్చి అంబులెన్సును ఢీకొట్టిన మంత్రి కాన్వాయ్
Comments
Please login to add a commentAdd a comment