ముంబయి: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో భారత్ స్టాండ్‌ను ఎన్సీపీ నేత శరత్‌పవార్ తప్పుబట్టడాన్ని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ విమర్శించారు. శరత్ పవార్ తన కూతురు సుప్రియా సూలేను యుద్ధంలో హమాస్ తరుపున పోరాడటానికి పంపుతారని వ్యంగ్యాస్త్రాలు సందించారు.
ఇజ్రాయెల్‌లోని నోవా ఫెస్టివల్ వేళ హమాస్ దళాలు రాకెట్ దాడులు జరిపాయి. ఇజ్రాయెలీలను దారుణంగా హతమార్చాయి. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.. హమాస్ దాడులను ఖండించారు. అమాయక ప్రజల పక్షాన నిలుస్తూ ఇజ్రాయెలీలకు మద్దతు తెలిపారు. అయితే.. హమాస్ దాడులపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో శరద్ పవార్.. ప్రధాని మోదీ స్టాండ్‌ను విమర్శించారు. పాలస్తీనా ప్రజల పక్షాన నిలబడాలని ఆయన భావించారు.
ఇజ్రాయెలీలకు భారత్ మద్దతు తెలపడంపై శరద్ పవార్ తప్పుబట్టడాన్ని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కూడా విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాలని కోరారు. హమాస్ పట్ల సీనియర్ నాయకుడైన శరద్ పవార్ దృక్పథం సరిగా లేదని అన్నారు. దేశం గురించి మొదలు ఆలోచించాలని కోరారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా శరద్ పవార్ వ్యాఖ్యలను ఖండించారు.
ఇదీ చదవండి: కశ్మీరీ వలస కుటుంబాలకు ఇకపై నెలకు రూ.27 వేలు
Comments
Please login to add a commentAdd a comment