కోల్‌కతా: కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండేవారు తమ పార్టీలో నుంచి వెళ్లిపోయినా తమకు ఎటువంటి ఇబ్బంది లేదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం రాహుల్ గాంధీ తాను చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో ‘డిజిటల్ మీడియా వారియర్స్’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
అస్సాంలో కాంగ్రెస్ పార్టీ పతనం, ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. హిమంత, మిలింద్ దేవరా వంటి వ్యక్తులు కాంగ్రెస్‌కు విడిచిపెట్టాలకున్నానని తెలిపారు. వారు పార్టీ నుంచి వెళ్లిపోవటం వల్ల ఇబ్బంది ఏం లేదన్నారు. వారి పార్టీ మార్పు సరైందేనని తెలిపారు.
హిమంత విచిత్రమైన రాజకీయనాయుడని.. అతని వంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు సరిపోడని అన్నారు. అతను ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనమని తెలిపారు. తాను రక్షించాలనుకుంటున్న విలువలకు అతని వ్యాఖ్యలు చాలా వ్యతిరేకమని చెప్పారు. ఇటీవల అస్సాం సీఎం హిమంత, రాహుల్ గాంధీ.. తీవ్రమైన విమర్శ, ప్రతివిమర్శలకు దిగిన విషయం తెలిసిందే. రాహుల్ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ద్వారా అస్సాంలో అలజడి సృష్టించాలని చూశారని విమర్శించారు. దీంతో అత్యంత అవినీతిపరుడైన సీఎం.. హిమంత అని రాహుల్ గాంధీ మండిపడ్డ విషయం తెలిసిందే.
ఇటీవల మహారాష్ట్రలో కీలక నేత అయిన మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేవలో చేరిన విషయం తెలిసిందే. ముంబై సౌత్ నియోజకవర్గానికి సంబంధించి.. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తికి గురై పార్టీ మారిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విలువలు లేని అటువంటి నేతలు వెళ్లిపోవటం అనేది ప్రతిపక్ష ఇండియా కూటమిపై కూడా ఎటువంటి ప్రభావం పడదని రాహుల్ గాంధీ తెలిపారు.
చదవండి: karnataka: కాంగ్రెస్‌పై సొంత పార్టీ నేత తీవ్ర విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment