MP Revanth Reddy Complaints Against Assam CM For Comments On Rahul Gandhi: అస్సాం సీఎంపై కేసు నమోదు - Sakshi
Sakshi News home page

ఎంపీ రేవంత్‌ రెడ్డి ఫిర్యాదు.. అస్సాం సీఎంపై కేసు నమోదు

Published Tue, Feb 15 2022 12:22 PM | Last Updated on Tue, Feb 15 2022 1:03 PM

MP Revanth Reddy Complaints Against Assam CM For Comments On Rahul Gandhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన  అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫిర్యాదుతో పోలుసులు కేసు నమోదు చేశారు. కాగా మహిళలను అవమానించేలా మాట్లాడిన హేమంతపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రేవంత్ సోమవారం పోలీసులను కోరిన సంగతి తెలిసిందే. 48గంటల పాటు చూస్తామని.. అప్పటి వరకు కేసులు పెట్టకపోతే పోలీస్ స్టేషన్‌లు ముట్టడిస్తామన్నారు. ఈ నెల 16వ తేదీ 12 గంటలలోపు అసోం సీఎంను అరెస్ట్ చేయాలని రేవంత్‌ రెడ్డి కోరారు.
చదవండి: ఆగేదే లే! ముందుకెళ్లాల్సిందే.. మంత్రి కేటీఆర్‌ ఆదేశం 

ఎన్నికల ప్రచారంలో అసభ్యకరంగా కామెంట్స్ చేశాడని.. రాజ్యాంగంపై ప్రమాణం చేసి సీఎం పదవిలో ఉన్న హేమంత బిశ్వశర్మ అలా మాట్లాడటం సిగ్గు చేటు  అన్నారు. వెంటనే హేమంత బిస్వాపై క్రిమినల్ కేసు నమోదు చేసి, సీఎం పదవి నుండి బర్తరఫ్ చేయాలన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హిమంత బిశ్వశర్మపై సోమవారం రేవంత్ రెడ్డి పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 
చదవండి: జీడిమెట్లలో బాలిక అనుమానాస్పద మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement