Elections: ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం | BJP Swept The Guwahati Municipal Corporation Elections | Sakshi
Sakshi News home page

BJP: ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం.. మోదీ హర్షం

Published Sun, Apr 24 2022 8:58 PM | Last Updated on Sun, Apr 24 2022 9:00 PM

BJP Swept The Guwahati Municipal Corporation Elections - Sakshi

గుహవటి: మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. అసోంలోని గువాహటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, మిత్రపక్షం ఏజీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఎన్నికల ఫలితాల అనంతరం అసోం సీఎం హిమంత్ బిస్వాస్ శర్మ.. ప్రజలకు శిరసువంచి అభివాదం చేస్తున్నానని ట్విట్టర్‌ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే, గువాహటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 60 వార్డులకు ఎన్నికలుగా జరుగగా 58 వార్డులను బీజేపీ కూటమి కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థులు 52 వార్డుల్లో గెలుపొందగా, 7 వార్డులలో పోటీ చేసిన ఏజేపీ 6 వార్డులు దక్కించుకుంది. అసోంలో తొలిసారిగా బరిలో నిలిచిన ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఒక్క స్థానంలో విజయం సాధించింది. ఇక, కాంగ్రెస్‌ పార్టీకి మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. ఒక్క వార్డు కూడా గెలుచుకోకపోవడంతో హస్తం నేతలు ఖంగుతిన్నారు. ఇదిలా ఉండగా.. మున్సిపల్‌ ఎన్నికలు చివరిసారిగా 2013లో జరిగాయి. అప‍్పటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది.

ఇక, ఈ విజయంపై అసోం సీఎం హిమంత్ బిస్వాస్ శర్మ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. భారీ విజయాన్ని అందించిన ప్రజలకు తన శిరసువంచి అభివాదం చేస్తున్నానని అన్నారు. బీజేపీ విజయంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ఘన విజయంపై సంతోషం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement