Vile Parle
-
యువ వైద్యురాలు దారుణహత్య
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో యువ వైద్యురాలు(24) దారుణహత్యకు గురైంది. నగర శివారులోని విలే పార్లే ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. మృతురాలు ఫిజియోథెరపిస్టుగా పోలీసులు గుర్తించారు. సోమవారం రాత్రి పార్టీ నుంచి కొంత మంది స్నేహితులతో కలిసి తన ఇంటికి తిరిగివచ్చింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. ఒంటిపై దుస్తులు లేకుండా పడివున్న శవాన్ని గుర్తించారు. అత్యాచారానికి పాల్పడి ఆమెను హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ముంబైలో మళ్లీ పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్
ముంబై : ముంబై మహానగరంలో మంగళవారం లోకల్ ట్రైన్ పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. అంథేరి నుంచి చర్చి గేట్ కు వెళ్తున్న ఈ లోకల్ ట్రైన్ విల్లే పార్లీ మరియు అంథేరి స్టేషన్ల మధ్య పట్టాలు తప్పాయి. అయితే ఈ ఘటన కారణంగా నగరంలోని లోకల్ ట్రైన్ సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ప్రయాణికుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం. సోమవారం సాయంత్రం ముంబైలోని చత్రపతి శివాజీ టెర్మినస్ సమీపంలో లోకల్ ట్రైన్‌కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదన్న విషయం తెలిసిందే.