కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ నేతలు మంగళ్ ప్రభాత్ లోధా, ఆశిష్ షెలార్‌లతో కలిసి ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించిన తర్వాత గురువారం లోకల్ ట్రైన్‌లో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
గోయల్ సిద్ధివినాయకుని ఆలయంలో దర్శనం పూర్తి చేసుకున్న తరువాత మీడియాతో మాట్లాడుతూ.. నేను తెల్లవారు జామున 3 గంటలకు క్యూలో నిలబడి దర్శనం చేసుకున్నారు. ముంబై ప్రజలు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చడానికి సహాయపడతారని నేను విశ్వసిస్తున్నాను అని అన్నారు.
#WATCH | Mumbai: Union Minister Piyush Goyal says, "I did 'darshan' in Siddhivinayak temple, which reminds me of my old days when I used to come here and stood in the queue at 3 am...I am fully confident that our Mumbai brothers and sisters are on hell-bent making India 'Viksit… pic.twitter.com/aruHSjOXjY
— ANI (@ANI) March 14, 2024
లోకల్ ట్రైన్‌లో ప్రయాణించే సమయంలో.. ముంబై మహానగరం మీద తనకున్న అభిమానం గురించి వెల్లడించారు. తన బాల్యం ముంబైలో గడిపానని, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో నివాసం ఉంటున్నప్పటికీ తన హృదయంలో ముంబయికి చెందిన స్ఫూర్తి, సంస్కృతి ఉందని అన్నారు
నరేంద్ర మోడీ ప్రభుత్వంలో గోయల్ విద్యుత్, రైల్వేలు, బొగ్గుతో సహా ముఖ్యమైన శాఖలలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంకా వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం, ప్రజా పంపిణీ శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. గతంలో మూడు సార్లు రాజ్యసభలో ఎన్నికైన గోయల్.. ప్రస్తుతం ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
#WATCH | Maharashtra | Union Minister Piyush Goyal travels in a Mumbai local train. pic.twitter.com/W1lTQfNkNL
— ANI (@ANI) March 14, 2024
Comments
Please login to add a commentAdd a comment