సాక్షి, ముంబై : రైల్వే ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్ని ప్రకటనలు చేస్తున్నా... కొందరు ప్రయాణికులు మాత్రం అవేం పట్టించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కిందపడిన తన బ్యాగ్ కోసం కదులుతున్న రైల్లోంచి దూకిన ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అయితే క్షణం ఆలస్యం చేయకుండా అక్కడున్న కొందరు అప్రమత్తం కావటంతో ప్రాణాలతో బయటపడింది. మహారాష్ట్రలోని కుర్లా రైల్వేస్టేషన్‌లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
లోకల్ ట్రైయిన్ బయలుదేరటంతో ఓ యువతి రన్నింగ్‌లోనే ఆ రైలును ఎక్కేసింది. ఇంతలో ఓ మహిళ పరిగెత్తుకుంటూ ఆమె పక్కగా వెళ్లటంతో బ్యాగ్ రైల్లోంచి కింద పడిపోయింది. దాని కోసం ఆమె కిందకి దూకగా.. ప్లాట్‌ఫామ్‌పై పడిపోయింది. రైలు వేగానికి కాస్తుంటే ఆమె పట్టాల కిందకు వెళ్లిపోయేది. అక్కడేవున్న రైల్వే పోలీసులు, ప్రయాణికులు స్పందించి వెంటనే ఆమెని పక్కకు లాగేశారు. ఆ మహిళను కాపాడిన రైల్వే పోలీసులను నెటిజన్లు అభినందిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment