jump off train
-
క్షణం ఆలస్యం అయ్యుంటేనా...
సాక్షి, ముంబై : రైల్వే ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్ని ప్రకటనలు చేస్తున్నా... కొందరు ప్రయాణికులు మాత్రం అవేం పట్టించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కిందపడిన తన బ్యాగ్ కోసం కదులుతున్న రైల్లోంచి దూకిన ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అయితే క్షణం ఆలస్యం చేయకుండా అక్కడున్న కొందరు అప్రమత్తం కావటంతో ప్రాణాలతో బయటపడింది. మహారాష్ట్రలోని కుర్లా రైల్వేస్టేషన్లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. లోకల్ ట్రైయిన్ బయలుదేరటంతో ఓ యువతి రన్నింగ్‌లోనే ఆ రైలును ఎక్కేసింది. ఇంతలో ఓ మహిళ పరిగెత్తుకుంటూ ఆమె పక్కగా వెళ్లటంతో బ్యాగ్ రైల్లోంచి కింద పడిపోయింది. దాని కోసం ఆమె కిందకి దూకగా.. ప్లాట్‌ఫామ్‌పై పడిపోయింది. రైలు వేగానికి కాస్తుంటే ఆమె పట్టాల కిందకు వెళ్లిపోయేది. అక్కడేవున్న రైల్వే పోలీసులు, ప్రయాణికులు స్పందించి వెంటనే ఆమెని పక్కకు లాగేశారు. ఆ మహిళను కాపాడిన రైల్వే పోలీసులను నెటిజన్లు అభినందిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
క్షణం ఆలస్యం అయ్యుంటేనా...
-
రేప్ నుంచి తప్పించుకునేందుకు..
అత్యాచారం నుంచి తప్పించుకునేందుకు ఓ మహిళ 10 నెలల కొడుకు, భర్తతో కలిసి కదులుతున్న రైలు నుంచి కిందికి దూకేసిన సంఘటన పశ్చిమబెంగాల్ లో చోటుచేసుకుంది. అలీపూర్‌ద్వార్ జిల్లాలోని బుక్సా టైగర్ రిజర్వ ప్రాంతంలోగల రాజా భట్కావా రైల్వే స్టేషన్ కు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. బాధిత మహిళ (27)కు 10 నెలల కుమారుడున్నాడు. భర్తలతో కలిసి ఉత్తరప్రదేశ్ లోని ఘజియా బాద్ లో ఇటుకబట్టీల్లో కూలీగా పనిచేసుకుంటూ జీవనం సాగించే ఆమె.. మంగళవారం తమ స్వగ్రామం.. పశ్చిమబెంగాల్ లోని కూచ్ బెహర్ జిల్లాకు దిన్హతాకు బయలుదేరింది. వీళ్లు ఎక్కిన జనరల్ బోగీలోనే 12 మంది యువకుల బృందం ఉంది. ప్రయాణం మొదలైనప్పటి నుంచి మహిళను వేధిస్తున్న యువకుల దురాగతాన్ని న్యూ హసీమరా స్టేషన్ వద్ద రైల్వే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు బాధిత దంపతులు. అయితే తగినంత సిబ్బంది లేరని అలీపూర్‌ద్వార్ రైల్వే స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని అక్కడి పోలీసులు సలహా ఇచ్చారు. పోలీసులు కూడా మహిళలను కాపాడకపోవడంతో దుండగులు మరింత రెచ్చిపోయారు. సిలిగురి స్టేషన్ లో దాదాపు ప్రయాణికులందరూ దిగిపోయారు. జీఆర్పీ గార్డులు కూడా అక్కడే దిగిపోయినట్లు తెలిసింది. రైలు రాజా భట్కావా స్టేషన్ దాటిన తర్వాత మహిళపై అత్యాచాయత్నం చేసిన యువకులు.. అడ్డురాకుండా ఉండేందుకు ఆమె భర్తను కట్టేశారు. ప్రాణభయంతో కొట్టుమిట్టాడిన భార్యాభర్తలు పది నెలల పిల్లాడితో సహా కదులుతున్న రైలు నుంచి దూకేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆ ముగ్గురూ అలా రక్తాలతోనే అడవిలో రెండు కిలోమీటరర్లు నడిచి రాజా భట్కావా స్టేషన్ కు చేరుకున్నారు. వారిని గుర్తించిన రైల్వే సిబ్బంది బాధితులను అలీపూర్‌ద్వార్ రైల్వే ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులకోసం గాలిస్తున్నట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అడిషనల్ కమిషనర్ ముకుల్ చంద్ర మేథీ చెప్పారు.