పట్టాలు తప్పిన లోకల్ రైలు | Mumbai Local Train Coach Derails, Services Disrupted | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన లోకల్ రైలు

Published Tue, May 31 2016 12:33 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

నగరంలో లోకల్ ట్రైయిన్ ప్రమాదానికి గురికావడంతో మిగతా సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ముంబై: నగరంలో లోకల్ రైలు ప్రమాదానికి గురికావడంతో మిగతా సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టాలు మారుతున్నప్పుడు జరిగిన ఈ ప్రమాదంలో రైలు కోచ్ పూర్తిగా ఓ వైపు ఒరిగి పడిపోయింది. లోయర్ పారెల్, ఎలిఫ్ స్టన్ రోడ్ జంక్షన్ల మధ్య జరిగిన ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.

 

దీంతో బాంద్రా, చర్చ్ గేట్ల మధ్య ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లను నెమ్మదిగా నడుపుతుండగా... ఫాస్ట్ లైన్ల రూట్లలో రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. కాగా, ప్రమాదానికి గురైన రైలుబోగీలను అక్కడి నుంచి తొలగించేందుకు అధికారులు క్రేన్లను ఉపయోగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement