
సాధారణంగా సెలబ్రిటీలు లగ్జరీ వాహనాల్లోనే ప్రయాణిస్తుంటారు. జనాల కంట పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ తాజాగా స్టార్ కిడ్ సారా అలీఖాన్ మాత్రం ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణించి ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన వీడియోను సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది
'సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో తన టీంతో కలిసి ఇలా లోకల్ ట్రైన్‌లో ప్రయాణం చేశాను' అంటూ సారా తన ఇన్‌స్టా వీడియోలో చెప్పుకొచ్చింది. ట్రైన్ దిగిన తర్వాత కూడా సారా ఆటోలో ప్రయాణంచడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment